SANGAREDDY MLA
-
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి.. లేకపోతే ఉద్యమమే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సిద్ధాపూర్‌లలోని పేదలకు 5వేల ప్లాట్లు, కొండాపూర్, ఆలియాబాద్‌లలో 4వేల ప్లాట్లు ఇచ్చామని, అయితే అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ పేదలను మాత్రం పంపించి వేశారని చెప్పారు. వెంటనే వారికి పొజిషన్ ఇవ్వాలని, ఇదే విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని, అన్నీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో అర్థం కాదు కానీ కాంగ్రెస్‌ను మాత్రం ఔట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. పడుకున్న కేసీఆర్‌ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు పడుకున్న కేసీఆర్‌ను లేపి తన్నించుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని అన్న జగ్గారెడ్డి బీజేపీకి రాజకీయం తప్ప సమస్యలపై పోరాటం చేయడం తెలియదని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
తెలంగాణాలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి : జగ్గారెడ్డి
-
రాజీనామాపై జగ్గారెడ్డి దిమ్మతిరిగే ట్విస్ట్
-
‘ఆర్టీసీని అప్పుడే విలీనం చేసేవాడిని’
సాక్షి, సంగారెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన దృష్టికి ఆర్టీసీ విలీనం విషయం తీసుకొచ్చి ఉంటే అప్పుడే సమస్యను పరిష్కరించేవాడినని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమాలు చేయాల్సిన అవసరం రాదనుకున్నామని, కానీ ఇంత దారుణ పరిస్థితులు ఉంటాయని ఎవరూ ఊహించలేదని వాపోయారు. ఒకవైపు కోర్టు చీవాట్లు పెడుతున్నా ఒంటెద్దు పోకడలకు పోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమని విమర్శించారు. చాలీ చాలని వేతనాలతో ఆర్టీసీ కార్మికులు గొడ్డు చాకిరీ చేస్తున్నారని సానుభూతి వ్యక్తం చేశారు. పోలీసులను ఉపయోగించి ప్రజల గొంతు నొక్కుతున్నారని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరించి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేదా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, జగ్గారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. -
‘అధికారంలోకి వచ్చినా పదవి ఆశించను’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, మున్సిపల్ ఎన్నికలలో 50 శాతం చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిని మార్చడం అనవసరమన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని కుంతియాకు చెప్పినట్టు వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారని, వీళ్లంతా సమర్థులేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో లాగా కాంగ్రెస్‌లో సింగిల్ హీరో ఉండరని, బలమైన నాయకులు చాలా మంది ఉన్నారని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వీడినా పార్టీ బలంగానే ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సహకరిస్తానని, అవకాశం ఉంటే తనకు ఇవ్వాలని కుంతియాను కోరినట్టు తెలిపారు. ఇక నుంచి గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టె నాయకులు ఎవరైనా పీసీసీ అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలని పార్టీ నిర్ణయించినట్టు వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అప్పుల పాలైన పార్టీని గాడిలో పెడతానని, కార్యకర్తలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఆశించనని జగ్గారెడ్డి అన్నారు. -
సామాజిక కోణాలు చెల్లవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కోణాలు చెల్లవని కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక తేలిపోయిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని ఆయన అన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి తనకు ఆహ్వానం లేదని, అయినా తనకు అంత ప్రోటోకాల్ లేదని అన్నారు. కేసీఆర్ భట్టికి ఇచ్చే ప్రాధాన్యత ఉత్తమ్‌కు ఇవ్వకపోవచ్చని అన్నారు. సీఎల్పీ నేత ఎంపిక విషయంలో రాహుల్ నిర్ణయమే శిరోధార్యమని, సీఎల్పీ నేత ఎంపికలో లాబీయింగ్‌తో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా పనిచేసిందని అన్నారు. సీఎల్పీ నేతగా నియమించి భట్టికి కాంగ్రెస్ అధిష్టానం మంచి అవకాశం ఇచ్చిందని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా భట్టి తన పనితనాన్ని నిరూపించుకోవాలని అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్ఎస్లోకి వెళ్లరని జగ్గారెడ్డి చెప్పారు. ఓడిపోయిన నేతలకు పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్ కారణం కానే కాదని, ఆయన సమర్ధవంతంగా పనిచేశారని, కానీ పరిస్థితులు అనుకూలించలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఉత్తమ్ గొప్పవాడు అన్న సర్వే సత్యనారాయణ ఇప్పుడు ఉత్తమ్ పనికిరాడని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఉత్తమ్ మంచోడు.. ఇప్పుడు చెడ్డోడా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఉత్తమ్ బలహీనుడు కాదని, బలవంతుడని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మరో ఐదేళ్లు కొనసాగించినా తప్పేమీ లేదని అన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతి పోటీచేయకపోతే తన భార్య నిర్మలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరతానని జగ్గారెడ్డి చెప్పారు. -
విఐపి రిపోర్టర్ - సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
-
సంగారెడ్డి స్థానంపై తేల్చిచెప్పిన జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి దసరా పర్వదినం రోజున ఎన్నికల సమరానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించి రాజకీయ సన్యాసంపై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని చెక్ పెట్టారు. ‘కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తా’.. అని పేర్కొని పార్టీ మారనున్నారనే ప్రచారాన్ని సైతం తొసిపుచ్చే ప్రయత్నం చేశారు. దసరా వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం ఆదివారం రాత్రి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో రావణాసురుడి దహనాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. వేలాది మంది సమక్షంలో జగ్గారెడ్డి ప్రసంగిస్తూ పై విధంగా మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలపై వాగ్దానాల జల్లు కురిపించారు. తన హాయాంలో చేపట్టిన అభివృద్ధిని ఉటంకిస్తూ చివర్లో పదేపదే ‘దటీజ్ జగ్గారెడ్డి’ అంటూ పంచ్ డైలాగులు విసురుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అమరుల కుటుంబాల సీటు..ఉత్తిదేనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రకటన వెల్లడైన తర్వాత జగ్గారెడ్డి రాజకీయ భవితవ్యంపై చర్చ జరిగింది. ఇంత కాలం తెలంగాణను వ్యతిరేకిస్తూ వచ్చిన జగ్గారెడ్డి ఇక క్రియా శీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, సంగారెడ్డి స్థానాన్ని అమర వీరుల కుటుంబాల నుంచి ఓ అభ్యర్థిని కాంగ్రెస్ తరఫున బరిలో నిలిపి గెలిపించుకోవాలని ఆయన అభిలషిస్తున్నారని కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) కథనాలూ వచ్చాయి. ఈ విషయంపై జగ్గారెడ్డి ఎక్కడా బహిరంగంగా ప్రకటన చేయకపోయినా ..సన్నిహితుల వద్ద ఉటంకించినట్లు ప్రచారం జరిగింది. పజల నుంచి సానుభూతి కోసం జగ్గారెడ్డి లీకులిచ్చారని రాజకీయ ప్రత్యర్థులు దుమ్మెత్తిపోశారు. ఇంతకాలం ఈ ప్రచారంపై ఎలాంటి ప్రకటన చేయని జగ్గారెడ్డి నోటి నుంచి ‘మళ్లీ నేనే పోటీ చేస్తా’ననే మాట వెల్లడికావడంతో గమనిస్తే పథకం ప్రకారమే ఉత్తుత్తి ప్రచారం చేసుకున్నారని తెలుస్తోంది. జగ్గారెడ్డి ఇంతకాలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోడానికే తెలంగాణ అమరవీరుల పేర్లను వినియోగించుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన, ఇటీవలే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు మాట మార్చిన విషయం తెలిసిందే. -
యూటీ కాదు.. హైదరాబాద్ మాది
వినాయక్‌నగర్ (నిజామాబాద్), నూస్లైన్ : ‘హైదరాబాద్‌ను యూటీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నడు. అది ఆయన జాగీరు కాదు, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి’ అని ఎంఐఎం నాయకుడు ఖైసర్ హెచ్చరించారు. నగరంలోని ఖిల్లా చౌరస్తాలో గల ఈద్గా పక్కన గల ఆట స్థలంలో బుధవారం సలార్-ఎ-మిలత్ బ్యానర్ పై టెన్నిస్ బాల్, క్రికెట్ టోర్నీని బహుదుర్పూర ఎమ్మెల్యే మోజమ్‌ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు జిల్లాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ పేరుతో సహా సలార్-ఎ-మిలత్ బ్యానర్‌కు గుర్తింపు వచ్చేలా ఆడాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ అల్తాఫ్ అజర్జ్వ్రి మాట్లాడుతూ..మైనార్టీల కోసం మన నాయకులు అసెంబ్లీలో, పార్లమెంట్లో పోరాడుతున్నారన్నారు. రాష్ట్రం లో ముస్లింల కోసం ఎంఐఎం పార్టీ ఎంత కష్టపడుతుందో దేశవ్యాప్త ముస్లింలు చూస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బ్యాటింగ్ చేయగా, ఎమ్మెల్యే బౌలింగ్ వేసి టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫహిమ్ తదితరులు పాల్గొన్నారు.