యూటీ కాదు.. హైదరాబాద్ మాది
Published Thu, Aug 29 2013 2:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
వినాయక్‌నగర్ (నిజామాబాద్), నూస్‌లైన్ : ‘హైదరాబాద్‌ను యూటీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నడు. అది ఆయన జాగీరు కాదు, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి’ అని ఎంఐఎం నాయకుడు ఖైసర్ హెచ్చరించారు. నగరంలోని ఖిల్లా చౌరస్తాలో గల ఈద్గా పక్కన గల ఆట స్థలంలో బుధవారం సలార్-ఎ-మిలత్ బ్యానర్ పై టెన్నిస్ బాల్, క్రికెట్ టోర్నీని బహుదుర్‌పూర ఎమ్మెల్యే మోజమ్‌ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు జిల్లాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ పేరుతో సహా సలార్-ఎ-మిలత్ బ్యానర్‌కు గుర్తింపు వచ్చేలా ఆడాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్సీ అల్తాఫ్ అజర్జ్వ్రి మాట్లాడుతూ..మైనార్టీల కోసం మన నాయకులు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో పోరాడుతున్నారన్నారు. రాష్ట్రం లో ముస్లింల కోసం ఎంఐఎం పార్టీ ఎంత కష్టపడుతుందో దేశవ్యాప్త ముస్లింలు చూస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బ్యాటింగ్ చేయగా, ఎమ్మెల్యే బౌలింగ్ వేసి టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫహిమ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement