సీఈవో సంజీవ్‌కుమార్
సాక్షి, బెంగళూరు: ‘మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిర్దేశించిన కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సంజీవకుమార్ తెలిపారు. వేగవంతంగా ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 14 పైగా టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బెంగళూరులో మొత్తం 5 చోట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యాక సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సాయంత్రానికి స్పష్టమైన వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
పురుషుల ఓటింగే ఎక్కువ
♦ గత రెండు పర్యాయాల ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ మంది ఓటేశారని సంజీవకుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పురుషులు 73.24 శాతం, మహిళలు 71.08 శాతం మంది ఓటు వేయగలిగారు.
♦ 2008 ఎన్నికల్లో మొత్తం 64.78 శాతం ఓటింగ్ నమోదు కాగా అందులో 66.33 శాతం పురుషులు, 63.23 శాతం మహిళలు ఉన్నారన్నారు.
♦ 2013 ఎన్నికల్లో 71 శాతం పోలింగ్ నమోదైతే అందులో పురుషులు 71.84 శాతం, మహిళలు 70 శాతం మంది ఓటు వేసినట్లు సంజీవ్ కుమార్ చెప్పారు.
♦ ఈసారి ఎన్నికల్లో బెంగళూరు నగరం జిల్లాలో 54.72 శాతం, గ్రామీణంలో 84.03 శాతం, రామనగర జిల్లాలో అత్యధికంగా 84.52 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment