
కంటోన్మెంట్: సర్వే సత్యనారాయణతో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన శిష్యుడేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సర్వేతో పాటు కేసీఆర్‌కూ చేయూతనిచ్చి రాజకీయంగా ఎదిగే అవకాశమిచ్చానన్నారు. ఆదరించి మంత్రి పదవి కూడా ఇస్తే కేసీఆర్ గురువుకే పంగనామాలు పెట్టే స్థాయికి వెళ్లాడని విమర్శిచారు. మంగళవారం పికెట్ చౌరస్తాలో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణతో కలిసి ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. టీడీపీ లేకపోతే కేసీఆర్ ఉండేవాడా..? అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ 2014లో పది మంది టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ పంచన చేరారని, ప్రస్తుత ఎన్నికల్లో వారందరినీ చత్తుగా ఓడించాలన్నారు. కంటోన్మెంట్‌లో సర్వే సత్యనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాని విజ్ఞప్తి చేశారు. అనంతరం సర్వే మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడే తన రాజకీయ గురువన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో చిన్న ఉద్యోగిగా ఉన్న తనతో రాజీనామా చేయించి 1985లో చంద్రబాబు తనను కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ప్రస్తుత తన రాజకీయ జీవితం బాబు చలవేనన్నారు. ఇదే విషయాన్ని తాను సోనియా గాంధీకీ చెప్పానన్నారు.
పికెట్ చౌరస్తాలో చంద్రబాబు,సర్వే సత్యనారాయణ ,మోదీ, కేసీఆర్ ఇద్దరూ నియంతలే
టీడీపీ అధినేత చంద్రబాబు
చిలకలగూడ: ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ నియంతలేనని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు విమర్శించారు. చిలకలగూడలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్‌షోలో అయన మాట్లాడుతూ.. అరాచకానికి పరాకాష్టగా కేసీఆర్ పాలన అని అభివర్ణించారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందని, బహిరంగ సభల్లో ప్రశ్నించిన సామాన్య జనంపై కూడా విరుచుకుపడుతున్నారన్నారు. తనను విమర్శించడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. ‡రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రస్థానంలో కొనసాగాలనేదే తన తపన అని, తెలంగాణలో పెత్తనం చెలాయించే అవసరం తనకు లేదన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అన్ని రంగాల్లోను అభివృద్ధి కుంటుపడిందన్నారు. బీజేపీకి ఓటేస్తే ఎంఐఎంకి వేసినట్టేనని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కాంగ్రె స్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ ప్ర చారంలో టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివా స్, సికింద్రాబాద్ ఇన్‌చార్జి మేకల సారంగపాణి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment