టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ నెల 29 న జాతీయ స్థాయిలో జన్ ఆక్రోష్ ర్యాలీ ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ కుంతియా తెలిపారు. ఢిల్లీలో జరుగనున్న ఈ ర్యాలీలో ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అందరూ పాల్గొంటారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతున్న మొదటి పెద్ద ర్యాలీ అని వెల్లడించారు. నరేంద్రమోదీ వచ్చాక నిరుద్యోగం పెరిగింది.. మహిళలమీద అత్యాచారాలు పెరిగాయి.. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఆయన విమర్శించారు. రాహుల్ దుర్ఘటన నుంచి బయట పడ్డారని, ఈ ఘటనపై విచారణ జరపి నిందితులకు శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ అంశం పార్టీ అంతర్గతం
నాగం జనార్ధన్‌రెడ్డి పార్టీలో చేరికపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి టీపీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన కుంతియా.. అది పార్టీ అంతర్గత విషయం అని అన్నారు. పీసీసీతో మాట్లాడితే వ్యవహారం సెటిల్ అవుతుందని స్పష్టం చేశారు.
కాగా రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే ర్యాలీకి మండల స్ధాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ నేతలంతా రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. మోదీ పరిపాలనతో నిరాశ, నిస్పృహ మిగిలాయన్నారు. మహిళలు, మైనార్టీల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment