khuntia
-
కాంగ్రెస్‌లో వారికి ప్రత్యేక అధికారాలు : ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై దాదాపు ఐదు గంటలపాటు జరిగిన కీలక సమావేశం ముగిసింది. అనంతరం రాష్ట్ర ఇన్చార్జ్ కుంతియా మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ బాధ్యతలను ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు అప్పగించినట్లు తెలిపారు. వీటితో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవని, పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించొద్దని హెచ్చరించారు. అన్ని వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. పార్టీ మారే వారు తమ సొంత ప్రయోజనాల కోసమే వీడుతున్నారని విమర్శించారు. ఎవరు పోయినా పార్టీ ఓట్లశాతం తగ్గలేదన్నారు. కొత్తగా నియమించిన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు 40 నియోజకవర్గాల చొప్పున కేటాయించినట్లు కుంతియా తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 25 నుంచి 90 రోజుల పాటు కార్యదర్శులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండేలా పార్టీని బలోపేతం చేయడమే తక్షణ కర్తవ్యమని వెల్లడించారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే అధిష్టానానికి చెప్పవచ్చని, నేరుగా రాహుల్ గాంధీకైనా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కానీ మీడియాలో ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2014తో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10 శాతం పెరిగిందని, తాజా సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన ఏఐసీసీ కార్యదర్శులకు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విస్తృత అధికారులు ఉంటాయని చెప్పారు. రానున్న ఎన్నికలకు అభ్యర్థులకు టికెట్ కేటాయింపుల్లో సహా వారికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు వెల్లడించారు. డిసెంబర్లో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేలా పార్టీని సిద్ధం చేస్తున్నామన్నారు. కేవలం ఈ ఏడాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికల కమిటీలను నియమించారని తెలిపారు. తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలకు ఎక్కడా కమిటీలు వేయదని స్పస్టం చేశారు. దీనిపై అనవసర ఆతృత ఎందుకంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, జైరాం రమేష్, కుంతియా, ఏఐసీసీ నూతన కార్యదర్శులు పాల్గొన్నారు. -
‘దామోదర్ రెడ్డి అంశం పార్టీ అంతర్గతం’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ నెల 29 న జాతీయ స్థాయిలో జన్ ఆక్రోష్ ర్యాలీ ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ కుంతియా తెలిపారు. ఢిల్లీలో జరుగనున్న ఈ ర్యాలీలో ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అందరూ పాల్గొంటారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతున్న మొదటి పెద్ద ర్యాలీ అని వెల్లడించారు. నరేంద్రమోదీ వచ్చాక నిరుద్యోగం పెరిగింది.. మహిళలమీద అత్యాచారాలు పెరిగాయి.. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఆయన విమర్శించారు. రాహుల్ దుర్ఘటన నుంచి బయట పడ్డారని, ఈ ఘటనపై విచారణ జరపి నిందితులకు శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ అంశం పార్టీ అంతర్గతం నాగం జనార్ధన్‌రెడ్డి పార్టీలో చేరికపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి టీపీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన కుంతియా.. అది పార్టీ అంతర్గత విషయం అని అన్నారు. పీసీసీతో మాట్లాడితే వ్యవహారం సెటిల్ అవుతుందని స్పష్టం చేశారు. కాగా రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే ర్యాలీకి మండల స్ధాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ నేతలంతా రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. మోదీ పరిపాలనతో నిరాశ, నిస్పృహ మిగిలాయన్నారు. మహిళలు, మైనార్టీల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని తెలిపారు. -
‘మా పార్టీలో ఆయన మాటే ఫైనల్’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటే తుది నిర్ణయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియా చిట్ చాట్ లో ..2019 వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డే తమ కెప్టెన్ అని తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ కట్టు దాటితే..ఎంతటి నేత అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తమ్ పనితీరు పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారని కుంతియా పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయం అని వివరించారు. ఎవరితో కలవాలి..ఎప్పుడు కలవాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, పొత్తులపై పీసీసీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. తన నుంచి, పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు. ప్రజలు తమవైపు చూస్తున్నారనడానికి సంగారెడ్డి సభే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతిమండలానికి వెళతామని, అన్నీ స్థాయిల్లో నేతల మధ్య విబేధాలు పరిష్కరిస్తామని తెలిపారు. రాహుల్ సందేశ్ యాత్రలు ఎన్నికల వరకు కొనసాగిస్తామన్నారు. తన నుంచి పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు. పార్టీలో ఎవరినీ విస్మరించబోమని కుంతియ తెలిపారు. వ్యక్తులపై కాదని, పాలసీలపై తమ పోరాటమన్నారు. జైరాం రమేష్, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. ఓటమి చెందిన చోట రాహుల్‌ను తప్పుబడుతున్నవారు... గెలిచిన చోట ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి కదా అని అన్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి కేసీఆ అధికారాన్ని లాక్కున్నారని కుంతియా విమర్శించారు. కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరికీ లబ్ధి జరగడం లేదని ఆయన దుయ్యబట్టారు. -
వారితో పార్టీకి నష్టమేమీ లేదు:కుంతియా
హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారితో పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ కార్యదర్శి ఆర్ సీ కుంతియా తెలిపారు. సోమవారం గాంధీభవన్ లో టీ పీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతల వలసలు, పార్టీ పరిస్థితిపై కుంతియా సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో పార్టీ స్థితిగతులపై మాట్లాడిన ఆయన పార్టీని వీడుతున్న నేతలతో కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరడానికి కూడా ఇతర పార్టీల నేతలు సిద్దంగా ఉన్నారన్నారు. పార్టీ ఫిరాయింపులను స్థానిక నాయకత్వ వైఫల్యంగా భావించలేమని ఆయన అన్నారు. కాంగ్రెస్ తోనే తెలంగాణకు మేలు జరుగుతుందనే విషయాన్ని ప్రజలు త్వరలోనే గ్రహిస్తారన్నారు.