
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్‌ను ఏఐసీసీ సభ్యుడు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్) శుక్రవారం నగరంలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కేఎల్‌ఆర్, దేవేందర్‌గౌడ్‌లు అరగంటసేపు మేడ్చల్ తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. తాను మేడ్చల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నానని, పొత్తులో భాగంగా టీడీపీ తనకు పూర్తిస్థాయిలో మద్దతివ్వాలని కేఎల్‌ఆర్ దేవేందర్‌గౌడ్‌ను కోరినట్లు తెలిసింది. కేఎల్‌ఆర్ దేవేందర్ గౌడ్‌ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
అయితే మేడ్చల్ స్థానాన్ని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా మేడ్చల్ సీటు తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టే అవకాశముంది. మరోపక్క కాంగ్రెస్‌తో పొత్తు కోసం చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం హైదరాబాద్‌కు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment