ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ (ఫైల్ ఫొటో)
తిరువనంతపురం : అమెరికాను తునాతునకలు చేస్తానంటూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కేరళలో కనిపించారు. రాష్ట్రంలోని ఓ ప్రదేశంలో అధికార సీపీఐ పార్టీ బ్యానర్‌లో కిమ్ జాంగ్ ఉన్ ఫొటో కనిపించడం ఆదివారం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఫొటోను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల వరుస హత్యలు జరుగుతోంది ఇందుకేనని అన్నారు.
దేశంలోని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలపై కిమ్ తరహాలో సీపీఐ అణు క్షిపణులను వేయదని ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఐ హత్యాకాండను సృష్టిస్తోందని ఆరోపించిన ఆయన.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలను క్షిపణులను ఉపయోగించి నేలమట్టం చేయడం సీపీఐ తర్వాతి ఎజెండా కాకుండా ఉంటే బావుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
గతంలో సీపీఐ బ్యానర్లలో కార్ల్ మార్క్స్, వాద్లిమిర్ లెనిన్‌ల ఫొటోలు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, కిమ్ జాంగ్ ఉన్ ఫొటోను వాడటం ఇదే తొలిసారి. కాగా, పార్టీ బ్యానర్‌లో కిమ్ ఫొటోపై స్పందించిన సీపీఐ జిల్లా కార్యదర్శి ఒకరు స్థానిక కార్యకర్తల పొరబాటు వల్లే ఇలా జరిగినట్లు చెప్పారు. బ్యానర్‌ను తొలగించినట్లు వెల్లడించారు.
Kim Jong-un finds place in CPM’s posters in Kerala!!
— Sambit Patra (@sambitswaraj) 17 December 2017
No wonder they have converted Kerala into Killing fields for their opponents!
Hope the left is not planning to launch 🚀 missiles at the RSS,BJP offices as their next gruesome agenda! pic.twitter.com/6LHf1dVtAy
Comments
Please login to add a commentAdd a comment