
సాక్షి, కొత్తగూడెం: జీవో 39 గ్రామ పంచాయతీ వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో టీజేఏసీ, తెలంగాణ విద్యా వంతుల వేదిక(టీవీవీ) సమావేశం మంగళవారం జరిగింది. కార్య క్రమంలో కోదండరాం మాట్లాడుతూ స్థానిక సంస్థలను నిర్వీ ర్యం చేసేలా ఉన్న రైతు సమన్వయ సమితులతో ప్రత్యేకంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలను తయారు చేసుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, గద్దెనెక్కిన కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. ‘కొలువుల కోసం కొట్లాట’ పేరుతో అక్టోబర్ 31న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. తెలంగాణ వస్తే సింగరేణి భద్రంగా ఉంటుం దనుకున్నం.. వాస్తవం దానికి విరుద్ధంగా ఉందన్నారు. సమావేశంలో టీజేఏసీ కో చైర్మన్ పురుషోత్తం, జిల్లా చైర్మన్ మల్లెల రామనాథం తదితరులు పాల్గొన్నారు.