‘నిజాలపై విస్తృత స్థాయి బేటీలు’
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీళ్లు, నిధులు, నియమాకాలు అని చెప్పి ప్రజలను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెబుతుందని అందుకే నిజాలపై మే నెలలో విస్తృత స్థాయి భేటీలు చెపడుతామని కోదండరాం పేర్కొన్నారు. కేజీ టు పీజీ పథకం మాటలకే పరిమితం అయిందని దానిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీజేఎసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని నిరసన కార్యక్రమాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాక గ్రామస్థాయిలో కూడా టీజేఎసీ పటిష్టం చేసి ప్రజల సమస్యలపై పోరాడుతామని ఆయన అన్నారు. అందుకే గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని కోదండరాం తెలిపారు.