
సాక్షి, కర్నూలు : మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిపై ఆయన సోదరుడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడిందని, అలాంటిది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి వెళ్లటం వల్ల పెద్దాయన( కోట్ల విజయభాస్కర్ రెడ్డి) ఆత్మ క్షోభిస్తుందన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలోకి చేరడాన్ని కార్యకర్తలు జీర్ణంచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఆలూరు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మార్చి 2వ తేదీన కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించిన సభలో సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సూజాతమ్మ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
వీరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ సభలో మరోసారి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిండు సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా దుండగులు చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల కుటుంబం టీడీపీలో చేరిన మొదటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment