
విలేకరులతో మాట్లాడుతున్న మధుయాష్కీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్‌ఎస్ తెలంగాణ రాబందుల పార్టీగా మారిపోయిందని ఏఐసీసీ కార్య దర్శి మధుయాష్కీగౌడ్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమం త్రి కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని.. ఇప్పుడు మళ్లీ బహురూపు వేషాలు, బట్టేబాజీ మాటలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గఢీల పాలన కొనసాగుతోందని, ఎన్నికల్లో ప్రజలు దీనికి చరమగీతం పాడుతారన్నారు. కేసుల విచారణ పేరుతో కాంగ్రెస్ నేతలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళల అక్రమ రవాణా కేసులో కేసీఆర్, హరీశ్‌రావుల ప్రమేయంపై ఎందుకు విచారణ జరగ డం లేదన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిని త్వరలో బయటపెడతామని చెప్పారు. కాంట్రాక్టుల్లో, అక్రమ వ్యాపారాల్లో పది శాతం కమీషన్, 30 శాతం వాటాలు తీసుకున్నారని ఆరోపించారు. ఐఎంజీ భూ ములు, పద్మాలయ స్టూడియో కేసులను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో చెప్పాలన్నారు. అపార్టుమెంట్‌లో నివాసమున్న ఎంపీ కవిత విల్లాల్లోకి మారారని దుయ్యబట్టారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి ఇప్పటికే రూ.3 కోట్లు పంపారని ఆరోపించారు. ఆంధ్రా పార్టీతో జత కట్టారని విమర్శిస్తున్న మంత్రి కేటీఆర్.. అదే ఆంధ్రాకు చెందిన వెంకయ్యనాయుడు కార్ల ఏజెన్సీ వద్ద కొనుగోలు చేసిన కార్లలో ఎంత కమీషన్ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత అక్రమ సంపాదన కూడగట్టారని ఆరోపించారు. ఈవీఎంలు ట్యాం పరయ్యే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment