‘కొత్త డెంగ్యూ దోమ వచ్చింది.. పేరు మోదీ బాబా’ | Maharashtra Congress MLA Praniti Shinde Said PM Modi Is A Dengue Mosquito | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 5:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Maharashtra Congress MLA Praniti Shinde Said PM Modi Is A Dengue Mosquito - Sakshi

 షోలాపూర్‌ : రాజకీయాల్లో తమ ప్రత్యర్థి నాయకులను, పార్టీ నేతలను పంచ్‌ డైలాగ్స్‌లో విమర్శించడం సాధారణమే. అలాంటి డైలాగ్స్‌ వల్ల ఆ విమర్శలు ప్రజల్లోకి త్వరగా చేరుకుంటాయి. అందుకే రాజకీయ నాయకులు కొత్త కొత్త డైలాగులతో ప్రత్యర్థులపై విమర‍్శలు చేస్తుంటారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఓ కొత్త డైలాగ్‌తో విమర్శించారు మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రణితి షిండే. 

షోలాపూర్‌ సౌత్‌ ఎమ్మెల్యే ప్రణితి షిండే శనివారం ఓ ర్యాలిలో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీని డెంగ్యూ దోమతో పోల్చారు. ‘  మన దేశంలోకి కొత్త డెంగ్యూ దోమ వచ్చింది. దాని పేరు మోదీ బాబా. ఆ దోమ దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మనం ఏం​చెయ్యాలంటే పురుగుల మందు స్ప్రే చేసి దోమను చంపినట్లుగా మోదీని పవర్‌ నుంచి తొలగించి మనల్ని మనం రక్షించుకోవాలి’ అని వ్యంగ్యంగా విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement