
విజయవాడ: కృష్ణలంక జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి కిందపడ్డాడు. అదే సమయంలో వెనక నుంచి వస్తోన్న ఆర్టీసీ బస్సు వ్యక్తిపై నుంచి దూసుకెళ్లింది. 108 అంబులెన్స్ రావడంలో ఆలస్యం కావడంతో తీవ్రరక్తస్రావం జరిగి సంఘటనాస్థలంలోనే ఆ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు బాలాజీనగర్‌కు చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment