
ప్రధాని నరేంద్రమోదీ
కవాడిగూడ: భారతదేశ మార్కెట్ కబ్జాకు అమెరికా ప్రయత్నాలు సాగిస్తుంటే దానికి ప్రధాని నరేంద్రమోదీ మోకరిల్లి సహకరిస్తున్నారని ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి ఎండీ గౌస్ ఆరోపించారు. అదివారం బాగ్‌లింగంపల్లి ఓంకార్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మూడు రోజుల పాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశ నిర్ణయాలు వెల్లడించారు. దేశంలో ఉదారవాద, ఆర్థిక విధానాలను ఆమలు చేయడానికి ప్రధాని ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు ఆత్యాచారాలు, మైనార్టీలపై దాడులు, ప్రజాస్వామ్యవాదుల హత్యలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మద్దికాయల అశోక్, వి.కె.చౌదరి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎండీ గౌస్
Comments
Please login to add a commentAdd a comment