Gous
-
గౌస్–పూజ జోడీకి స్వర్ణం
సాక్షి, అమరావతి: జాతీయ క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణ పతకం లభించింది. గోవాలో జరుగుతున్న ఈ క్రీడల్లో మంగళవారం ముగిసిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో షేక్ గౌస్–పూజ (ఆంధ్రప్రదేశ్) జోడీ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో షేక్ గౌస్–పూజ ద్వయం 21–8, 21–17తో బొక్కా నవనీత్–కె.మనీషా (తెలంగాణ) జంటను ఓడించింది. ఫైనల్లో ఓడిన నవనీత్–మనీషా జోడీకి రజతం దక్కింది. తరుణ్‌కు పసిడి పతకం సింగిల్స్ విభాగంలో తెలంగాణకు రెండు పతకాలు దక్కాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో మన్నేపల్లి తరుణ్ స్వర్ణ పతకాన్ని, మహిళల సింగిల్స్‌లో మారెడ్డి మేఘన రెడ్డి కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు. ఫైనల్లో తరుణ్ 21–15, 16–21, 21–15తో సౌరభ్ వర్మ (మధ్యప్రదేశ్)పై నెగ్గగా... సెమీఫైనల్లో మేఘన రెడ్డి 21–7, 22–24, 16–21తో అదితి భట్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయింది. సౌరభ్ వర్మతో 70 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నిర్ణాయక చివరి గేమ్‌లో తరుణ్ స్కోరు 15–15 వద్ద వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో తరుణ్ 12–21, 21–14, 22–20తో జాతీయ చాంపియన్ మిథున్ (కర్ణాటక)ను ఓడించడం విశేషం. -
అమెరికా ముందు మోకరిల్లుతున్న మోదీ
కవాడిగూడ: భారతదేశ మార్కెట్ కబ్జాకు అమెరికా ప్రయత్నాలు సాగిస్తుంటే దానికి ప్రధాని నరేంద్రమోదీ మోకరిల్లి సహకరిస్తున్నారని ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి ఎండీ గౌస్ ఆరోపించారు. అదివారం బాగ్‌లింగంపల్లి ఓంకార్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మూడు రోజుల పాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశ నిర్ణయాలు వెల్లడించారు. దేశంలో ఉదారవాద, ఆర్థిక విధానాలను ఆమలు చేయడానికి ప్రధాని ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు ఆత్యాచారాలు, మైనార్టీలపై దాడులు, ప్రజాస్వామ్యవాదుల హత్యలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మద్దికాయల అశోక్, వి.కె.చౌదరి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎండీ గౌస్ -
అరిచిందని చంపేశారు..
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని గాంధీపార్కులో గత నెల 28న వెలుగు చూసిన మహిళ ‘హత్యా’చారం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితుల్ని రిమాండుకు తరలించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజకుమారి కేసు వివరాలు వెల్లడించారు. ధారూరు మండలం మైలారం ముందు తండాకు చెందిన రమావత్ చాప్లీబాయ్ (45) భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె వికారాబాద్ పట్టణంలో కూలీపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకునేది. మద్యానికి బానిసైన ఆమె గతనెల 27న రాత్రి 9 గంటల సమయంలో వికారాబాద్‌లోని అనంత్ వైన్స్ వద్ద కూర్చొని ఉంది. వికారాబాద్ రాజీవ్ గృహకల్పకు చెందిన ఎండీ గౌస్, ఎండీ అలీలు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. రైలు అప్పటికే వెళ్లిపోవడంతో వారు స్టేషన్ సమీపంలోని అనంత్ వైన్స్ వైపుగా వచ్చారు. అంతకుముందే వారు మద్యం తాగి ఉన్నారు. వారిద్దరు ఒంటరిగా ఉన్న చాప్లీబాయిని గమనించారు. వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసినట్లు నటించి ఆమెతో మాటలు కలిపారు. కొద్దిసేపటి తర్వాత మద్యం తాగుదామని వారు చెప్పి చాప్లీబాయిని గాంధీ పార్కులోకి తీసుకెళ్లారు. అంధకారంగా ఉన్న పార్క్‌లో ఎండీ గౌస్, ఎండీ అలీలు ఆమెపై అత్యాచారం చేశారు. అరిచిందని అంతం చేశారు.. కొద్దిసేపటికి తర్వాత గౌస్, అలీలు చాప్లీబాయిపై రెండోసారి అఘాయిత్యం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆమె కేకలు వేసింది. అరుపులకు ఎవరైనా వస్తారేమోనని భయపడిన అలీ చాప్లీబాయి గొంతు కొరికాడు. అయినా ఆమె కేకలు ఆపకపోవడంతో తన జేబులో ఉన్న చేతిరూమాలును తీసి గొంతుకు బిగించి చంపేశాడు. దీనికి గౌస్ సహకరించాడు. మరుసటి రోజు ఉదయం ధారూరు మైలారం ముందు తండాకు చెందిన విద్యార్థులు సేదతీరేందుకు గాంధీ పార్క్‌కు రావడంతో మహిళ విగతజీవిగా పడి ఉంది. ఆమెను చాప్లీబాయిగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఆర్ఐ ఎదుట లొంగిపొయిన నిందితులు... మహిళ ‘హత్యా’చారం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పోలీసులకు పట్టుబడుతామేమోనని భయపడిన నిందితులు బుధవారం సాయంత్రం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఐ షేక్‌అలీ ఎదుట లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. నిందితుల్ని గురువారం రిమాండుకు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన డీఎస్పీ స్వామి, సీఐ రవి, ఎస్ఐ శేఖర్‌ను,ఐడీ పార్టీ పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి అభినందించారు. -
అధికారుల పేర్లతో లక్షలు వసూలు చేసిన గౌస్