
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆయన శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓట్ల కోసం కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా ఆపాలని.. ఢిల్లీ వెళ్లి సతవిధాలుగా యత్నస్తున్నాయన్నారు.
కాగా, ఎస్సారెస్సీ పునర్జీవ పథకం ద్వారా వరదకాలువ నిండు కుండలా మారబోతోందన్నారు. రూ. 1600 కోట్లతో మిడ్‌మానేరు పూర్తి చేశామని..కరీంనగర్ జిల్లా మరో కోనసీమను తలపించబోతోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment