సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన అక్రమాస్తులను కాపాడుకునేందుకు అమరావతిలో కృత్రిమ ఉద్యమం చేపట్టాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు మండలి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ, మండలి రద్దును పార్లమెంటులో అడ్డుకోవాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంతో కూడా చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే పార్లమెంటులో ఎంపీలతో మాట్లాడించే వారని కన్నబాబు ధ్వజమెత్తారు. వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సినా అవసరం లేదా.. ప్రజల పట్ల చంద్రబాబుకు కనీస బాధ్యత లేదా అని కన్నబాబు ప్రశ్నించారు.
భుములు కబ్జా చేయడం టీడీపీకి అలవాటైపోయిందని మంత్రి కురసాల విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ పని చేసినా చెప్పి చేస్తున్నారని.. బాబులా రహస్యంగా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పులను.. సీఎం జగన్ సరిదిద్దుతున్నారని కన్నబాబు అన్నారు. అమవరాతిలో చంద్రబాబు సంపద సృష్టికి అడ్డు వచ్చామని.. కృత్రిమ పోరాటాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన పాలనలో ఎన్ని అక్రమాస్తులు సంపాదించారో ప్రజలకు తెలుసని.. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని వెనక్కి నేట్టాలని బాబు చుస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు మీ కుట్రలు చాలని.. మీ దాష్టికాలు ఆపాలంటూ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment