
ముంబై : మహారాష్ట్రలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఎన్సీపీ చీఫ్ సచిన్ అహిర్ ఆ పార్టీని వీడి గురువారం శివసేనలో చేరారు. సేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సమక్షంలో అహిర్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శివసేన గూటికి చేరేముందు అహిర్ ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరేలను సేన కార్యాలయంలో కలుసుకున్నారు.
2009-14లో మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ సర్కార్‌లో అహిర్ మంత్రిగా వ్యవహరించడం గమనార్హం. ముంబైలోని వొర్లికి చెందిన అహిర్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు. అహిర్ పార్టీని వీడటం ఎన్సీపీకి గట్టి షాక్‌గా భావిస్తున్నారు. కాగా మహారాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత చగన్ భుజ్‌భల్ సైతం త్వరలో శివసేనలో చేరతారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment