
అమిత్ షాతో నాదెండ్ల (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. భేటీ వివరాలు వెల్లడి కాలేదు. ఈ నెల 6న హైదరాబాద్‌లో అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు పార్టీలో ఆయనకు ఎటువంటి పదవి కట్టబెట్టలేదు.
నాదెండ్లతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, సినీ నిర్మాత బెల్లంకొండ రమేశ్, రామగుండం డిప్యూటీ మేయర్ సత్యప్రసాద్, టీడీపీ నాయకులు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి తదితరులు కూడా అదే రోజు బీజేపీలో చేరారు. కాగా, నాదెండ్ల కుమారుడు మనోహర్ జనసేన పార్టీలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment