
పట్నా : బిహార్‌లో మహాకూటమితో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి గట్టిషాక్ ఇస్తామన్న విపక్షాల ఆశలు వమ్మయ్యాయి.లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బిహార్‌లోని 40 లోక్‌సభ స్ధానాల్లో 37 స్ధానాల్లో బీజేపీ మిత్రపక్షాలు భారీ ఆధిక్యంతో దూసుకెళుతున్నాయి.
బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి మధ్య జరిగిన పోరులో బీజేపీ కూటమి తిరుగులేని ఆధిక్యం దిశగా సాగుతోంది. పట్నా సాహిబ్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సినీ నటుడు, కాంగ్రెస్ అభ్యర్ధి శత్రుఘ్న సిన్హాపై ముందంజలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment