నారీ శక్తి పార్టీని ఆవిష్కరిస్తున్న కావురి లావణ్య, తదితరులు
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): స్త్రీ అభివృద్ధే సమాజాభివృద్ధి నినాదంతో ‘నారీశక్తి’ పేరుతో నూతన జాతీయ రాజకీయపార్టీ ఆవిర్భవించింది. విజయవాడలోని జింఖానా మైదానం వద్ద ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో నూతన రాజకీయపార్టీ ఆవిర్భావ సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకురాలు కావూరి లావణ్య, ప్రవాసాంధ్రురాలు నారీశక్తి ఆవిర్భావం, లక్ష్యాలను వివరించారు. లావణ్య తల్లిదండ్రులు కావూరి కృష్ణమూర్తి, కారుణ్య దంపతులు నారీశక్తి లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. స్త్రీలకు భవిత కోసం పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. న్యాయవాది లంకా పద్మజ మాట్లాడుతూ.. స్త్రీలపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, మహిళా ఐపీఎస్‌లకే భద్రతలేని పరిస్థితి నెలకొందని, నిర్భయ వంటి చట్టం వచ్చినా దాడులు ఆగడం లేదన్నారు. మాజీ మేయర్ మల్లికా బేగం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిల్లో 15 మంది మహిళలు కూడా లేరన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు చంద్రికా నాయుడు, సుంకర నాగలక్ష్మీ, షబ్బీర్ అహ్మద్, ఎం.కొండయ్య, నారాయణరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment