
సాక్షి, న్యూఢిల్లీ : అమ్మ(జయలలిత)కు ఇన్‌ఫెక్షన్ కాకూడదని మంచి ఉద్దేశంతో మేం ఒక్కరం కూడా అమ్మను చూసేందుకు వెళ్లలేదు. ఎందుకంటే మేం ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నాం. కానీ వాళ్లు మాత్రం ప్రతి రోజు వెళ్లి చూసొచ్చి అమ్మ కోలుకుంటోంది.. తింటోంది అని చెప్పేవాళ్లు. మేం ఆ మాటలు విని సరే అనుకునే వాళ్లం’ అని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చెప్పారు.
ఆర్కే నగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ చేతుల్లో తమ అభ్యర్థి ఘోరంగా ఓటమిపాలయిన సందర్భంగా సోమవారం అన్నాడీఎంకే ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పన్నీర్ మీడియాతో మాట్లాడారు. ‘ఒక్క మంత్రి కూడా అమ్మను ప్రత్యక్షంగా కలవలేదు. ప్రతిసారి నర్సు.. వారే (శశికళ కుటుంబ సభ్యులు) వెళ్లి వస్తుండేవారు’ అని పన్నీర్ సెల్వం చెప్పారు. జయలలిత పోర్ట్‌ఫోలియోకు ఎంతటి విలువిచ్చారో అంతే గౌరవాన్ని తాను కాపాడానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment