
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గత మంగళవారం పూర్తి కావాల్సిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ బుధవారం కూడా పూర్తి కాలేకపోయింది. పరిశీలన తర్వాత తిరస్కరించిన, ఆమోదించిన అభ్యర్థుల నామినేషన్ల జాబితాను బుధవారం రాత్రి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం ప్రకటించలేకపోయింది. ఈ జాబితాను గురువారం ప్రకటిస్తామని సీఈఓ కార్యాలయం వాట్సాప్ గ్రూప్‌లో ప్రకటించింది. మరోవైపు గురువారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొని ఉంది. నిమిషం ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించడానికి నిరాకరించిన ఎన్నికల యంత్రాంగం.. షెడ్యూల్ ప్రకారం వాటిని పరిశీలించడంలో విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.