
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు రాజకీయ అఘాయిత్యాలను ప్రజలు భరించలేకుండా ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘నోరు చేసే అఘాయిత్యాలను పొట్ట భరించలేదు’ అనే చందంగా చంద్రబాబు వ్యవహారాలున్నాయని ఎద్దేవా చేశారు. అవకాశవాద రాజకీయాలతో, పూటకో మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలువిసుగు చెంది ఉన్నారని ట్విటర్లో పేర్కొన్నారు.
నీచ రాజకీయాలతో ప్రజలు అలిసిపోయి ఉన్నారనీ, ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్యాలు చేయొద్దు బాబూ అని వ్యాఖ్యానించారు. వాటిని ఆపేయండి.. ఇంకా భరించ లేకుండా ఉన్నామని సెటైర్లు వేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా.. ‘అది అబద్దమని తెలిసీ, నిజమని ఇతరులను నమ్మించేందుకు వితండవాదం చేసే వారితో దూరంగా ఉండడమే నయం. వారితో వాదన అనవసరం’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. అమితాబ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన పవన్.. ‘ఈ కామెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది’ అని చురకలంటించారు.
నోరు చేసే అఘాయిత్యానికి పొట్ట భరించలేదు” అన్న సామెత లాగా ..
— Pawan Kalyan (@PawanKalyan) 4 November 2018
ముఖ్యమంత్రి గారు,
అవకాశవాద రాజకీయాలుతో, పూట కోక మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలువిసుగు చెంది ఉన్నారు..అలిసి పోయిఉన్నారు ..
ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్వాలు ఆపేసేయాలి... ఇక భరించలేకుండాఉన్నాం..🙏🙏🙏
Comments
Please login to add a commentAdd a comment