సాక్షి, విశాఖపట్నం : దేశంలో యువత ఉంది కానీ ఉద్యోగాలు మాత్రం లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిట్టివలసలో జూట్ మిల్లులో 600 మంది కార్మికులు రోడ్డుమీద పడితే వారిని ఆదుకోవడానికే గంటా శ్రీనివాసరావును స్థానికులు గెలిపించారని చెప్పారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా శుక్రవారం తగరపు వలసలో పవన్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీమోహన్‌లకు ప్రత్యేక హోదా అన్నా, రైల్వేజోన్ అన్నా హేళన అయిందంటూ పవన్ మండిపడ్డారు. రైల్వే జోన్ విషయంలో నా వైఖరి ఏంటని అడుగుతున్నారు. అయితే ముందు మీ వైఖరి ఏంటో చెప్పండి
ముందు 19 మంది ఎంపీలు రాజీనాయాలు చేయాలి. అప్పుడు మీతో కలిసి నేను వస్తాను. అంతా కలిసి రైల్ రొఖో చేద్దాం. కాంగ్రెస్ నేతలను తరిమేయాలని చెప్పింది నేనే. కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టం చేయాలి. దళితుల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా భూ దోపిడీలే జరుగుతున్నాయి. ప్రచారానికి నేతలు వచ్చినప్పుడు సీఎం అని అరవడం ఆపేయండి.. ముందు ఓటింగ్ హక్కును పొందండి. అప్పుడు మీరు ఓట్లేసిన వాళ్లు సీఎం అవుతారని’ పవన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment