
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టారని డిప్యూటి సీఎం నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్(ఏపీసీవోఎస్) ప్రారంభం సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే కమ్మ, రెడ్డి కులాలను చంద్రబాబు చీల్చారని ఆరోపించారు. (మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్)
వర్సిటీ ఎన్నికలను అదనుగా చేసుకుని కులాల మధ్య మంట పెట్టిన చంద్రబాబు, నేడు కులాల గురించి ప్రత్యేకంగా మాట్లాడటం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కుల, మతాలకు అతీతంగా పని చేస్తుంటే నిందలు వేస్తూ మాట్లాడటం దారుణమన్నారు. ఇక జీవితంలో బాబు మారడని పేర్కొన్నారు. (సరిహద్దు నుంచి యుద్ధ సందేశం)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పొందేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గొప్ప పరిణామమని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment