ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్‌లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యాన భారీగా సాగిన పాదయాత్ర
సాక్షి ప్రతినిధి,తూర్పు గోదావరి, కాకినాడ : అడుగులో అడుగు...ఒకటి రెండు కాదు రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని, అరుదైన ఘనతను దక్కించుకుని, అలుపెరగని బాటసారిగా ప్రజా సంకల్ప యాత్రను చేపడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సంఘీభావంగా జిల్లాలో కూడా అడుగులు పడ్డాయి. రెండు రోజుల పాదయాత్రకు జిల్లాలో ఉన్న పార్టీ శ్రేణులన్నీ సుశిక్షిత సైనికుల్లా కదిలారు. ఎండ, వానను లెక్క చేయకుండా కదం తొక్కారు. వంచనపై ప్రజా గర్జన నినాదంతో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి అడుగులేసి ముందుకు సాగారు. దారి పొడవునా తమ సమస్యలను చెప్పుకునేందుకు యత్నించారు. ప్రజల కష్టాలను తెలుసుకుని జగన్నాథ రధ చక్రాలుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముందుకు కదిలాయి.
కొత్తపేటలో: ఆలమూరు మండలం చెముడులంక నుంచి చింతలూరు వరకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామచంద్రపురంలో: మండలకేంద్రమైన కె.గంగవరం వైఎస్ విగ్రహానికి అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలతో పాదయాత్ర ప్రారంభించి కాజులూరు మండలం కుయ్యేరు వరకు నిర్వహించారు.
కాకినాడ రూరల్‌లో: కాకినాడ రూరల్ మండలం నేమం శివాలయంలో కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పూజలు నిర్వహించి వాకలపూడి అంబేడ్కర్, రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర కొవ్వాడ వరకు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అమలాపురంలో: పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కో–ఆర్డినేటర్, పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి నుంచి తాండవపల్లి వరకు పాదయాత్ర నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఐవీ సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శులు ఉండ్రు వెంకటేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎండను లెక్క చేయకుండా పాదయాత్రను చేసిన విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు.
రాజానగరంలో: రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం నుంచి రాధేయపాలెం వరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పాదయాత్ర ప్రారంభించారు.
కాకినాడలో: ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దుమ్ములపేట వరకు కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు.
పిఠాపురంలో: పిఠాపురం మండలం కోలంక నుంచి పిఠాపురం పట్టణం వరకు కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పన మోహనరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు.
రాజమహేంద్రవరం సిటీలో: తాడితోట నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్, ఫ్లోర్‌లీడర్ షర్మిలా రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు.
ప్రత్తిపాడులో: ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి నుంచి పెదశంకర్లపూడి వరకు కో–ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పాదయాత్ర నిర్వహించారు.
పి.గన్నవరంలో: అయినవిల్లి మండలం విలస నుంచి అయినవిల్లి వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వరకు జగన్‌యాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేశారు. పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి,కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి తదితరులు పాల్గొన్నారు.
రాజోలులో: సఖినేటిపల్లి రేవు నుంచి మలికిపురం వరకు కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పాదయాత్ర చేశారు.
అనపర్తిలో: పెదపూడి మండలం పైన గ్రామం నుంచి జి.మామిడాడ గ్రామం వరకు కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు.
ముమ్మిడివరంలో: కాట్రేనికోన మావిళ్ళమ్మ గుడి దగ్గర నుంచి చెయ్యేరు అగ్రహారం కో–ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ర నాయకులు, కార్యకర్తలు భారీగా పాదయాత్ర నిర్వహించారు. అమలాపురం పార్లమెంటరీ మహిళా అధ్యక్షుడు కాశి మునికుమారి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
పెద్దాపురంలో: సామర్లకోట మండలం చంద్రపాలెం నుంచి సామర్లకోట వరకు కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రివెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీరరాఘవరావు, జిగిని వీరభద్రరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
జగ్గంపేటలో: కిర్లంపూడి సోమవరం నుంచి జగ్గంపేట వరకు జాతీయ రహదారిపై భారీ ఎత్తున జనంతో కో–ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు పాదయాత్ర చేశారు.
మండపేటలో: మండపేట నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో మండపేట రూరల్ మారేడుబాక నుంచి ఏడిద గ్రామం వరకు పాదయాత్ర సాగింది. పార్టీరాష్ట్ర నాయకులు రెడ్డి రాధాకృష్ణ, పెంకే వెంకట్రావు, జడ్పీటీసీ చిన్నం అపర్ణాదేవి పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో రాయవరం మండలం వి.సావరం నుంచి మాచవరం వరకు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజమండ్రి రూరల్‌లో: కడియపులంక నుంచి కడియం వరకు కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్, రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment