
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ నవీన్ కోరారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పిటిషన్ విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఆరోగ్య వివరాలను ఆరా తీయాలని వేసిన ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఉరుకోలేమని మొట్టికాయలు వేసింది. ముఖ్యమంత్రి కనిపించక పోతే హెబియస్ కార్పస్ ధాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.
(చదవండి: ప్రగతి భవన్ వద్ద యువకుడి మెరుపు నిరసన)
(ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన)
Comments
Please login to add a commentAdd a comment