అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మ గాంధీ పేరును మోదీ తన స్వార్థం కోసం మోదీ వాడుకున్నారని విమర్శించారు. ప్రధాని కాకముందు ఎప్పుడైనా గాంధీని మోదీ గుర్తుచేశారా అంటూ ప్రశ్నించారు. ఆయన గురువారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ.. గాంధీ జీవించి ఉంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకించేవారని అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక సబర్మతి ఆశ్రమానికి చెందిన ప్రధాన ట్రస్టులు అతన్ని దూరం పెట్టాయని గుర్తు చేశారు.
గాంధీ నెలకొల్పిన సబర్మతి ఆశ్రమ యాజమాన్యం సీఏఏను వ్యతికేస్తూ మాట్లాడకపోవడంపై గుహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ అసభ్యకర భాషను వినియోగిస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ఉన్నా, లేకపోయినా గుజరాత్ రాష్ట్రం శాశ్వతమని గుహ పేర్కొన్నారు.
చదవండి: మోదీ, గాడ్సేలది ఒకే భావజాలం: రాహుల్
రాహుల్‌ను గెలిపిస్తే.. మోదీకే ప్రయోజనం
Comments
Please login to add a commentAdd a comment