పెదఅమిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా పరిశీలకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని, నర్సాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు తదితరులు
పశ్చిమ గోదావరి, ఉండి : ఈ నెల 14వ తేదీన జిల్లాలో ప్రవేశించనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చరిత్ర సృష్టించబోతోందని పార్టీ జిల్లా పరిశీలకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామంలో ఉండి నియోజకవర్గ పార్టీకార్యాలయంలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ కన్వీనర్లతో పాదయాత్ర రూట్‌మ్యాప్ ఏర్పాట్లు తదితర విషయాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సరిగ్గా 15 ఏళ్ళ క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో భాగంగా మే నెల 14వ తేదీనే జిల్లాలో ప్రవేశించారని సరిగ్గా అదేరోజున జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కూడా జిల్లాలో ప్రవేశించడం చారిత్రక ఘట్టమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఎన్నో సమస్యలు ప్రజలను చుట్టుముట్టినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అల్లాడిపోతున్నారని అన్నారు. అందుకే రాజన్న బిడ్డ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాలో సుమారు 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుందని అన్నారు. 12 నియోజకవర్గాల్లో పబ్లిక్ మీటింగ్స్ జరుగుతాయని అన్నారు. చిన్నా, పెద్దా, యువత అంతా జగన్‌వైపే చూస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తోందని, గ్రామంలోని జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌ల వరకు అందరూ భాగస్వాములేనని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అప్పులపాలు చేశారని అన్నారు. దొంగ దీక్షలు చేస్తూ పైగా ధర్మపోరాట దీక్షలు అని చెప్పడం అనైతికమని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రంతో సఖ్యత కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. చంద్రబాబు కొడుకు మాత్రం మంత్రి పదవితో డబుల్‌బొనాంజా పొందారని అన్నారు.
ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు ఆళ్ళ నాని, ముదునూరి ప్రసాదరాజు, కొయ్యే మోషేన్‌రాజు, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, నియోజకవర్గాల కన్వీనర్లు పీవీఎల్ నర్సింహరాజు (ఉండి), మధ్యాహ్నపు ఈశ్వరి (ఏలూరు), గ్ర«ంధి శ్రీనివాస్ (భీమవరం), కవురు శ్రీనివాస్ (ఆచంట), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), తెల్లం బాలరాజు (పోలవరం), తలారి వెంకట్రావు (గోపాలపురం), తానేటి వనిత (కొవ్వూరు), కొఠారు అబ్బయ్య చౌదరి (దెందు లూరు), జిల్లా యూత్ అధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్(బాబు), పార్టీ రాష్ట్ర రాజకీయ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఇందుకూరి రామకృష్ణంరాజు, మాజీ శాసనపభ్యులు గంటా మురళి, ఉండి మండల పార్టీ అధ్యక్షుడు గులిపల్లి అచ్చారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment