సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలోనే బీజేపీ చేతులెత్తేసిందని, రాష్ర్టంలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే తాము ప్రజల్లోకి చేరుకున్నామని, రాష్ర్ట ప్రజల ముందు తమ అభివృద్ధి ప్రణాళికలను ఉంచామని చెప్పుకొచ్చారు. గుజరాత్‌లో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో పసిగట్టామన్న రాహుల్, అక్కడ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోరాటం కాదని, అది గుజరాతీల అభివృద్ధితో ముడిపడిన అంశమని అభివర్ణించారు.
ప్రచారంలో బీజేపీ నిస్తేజంగా వ్యవహరించిందని, గుజరాత్ అభివృద్ధికి మేలైన ప్రణాళిక ప్రకటిస్తుందని తాము భావించినా ఆ పార్టీ ప్రచారంలో తమకు ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ మోదీ, బీజేపీ సాగించిన వ్యక్తిగత దాడులు ప్రతికూల ఫలితాలిచ్చాయని అన్నారు.
వారు వ్యక్తిగత దాడులకు దిగినా తాము సంయమనం కోల్పోలేదని, మోదీపై వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్‌పై తాము చర్యలు తీసుకున్నా..మన్మోహన్ సింగ్ గురించి మోదీ వ్యక్తిగత దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా పదేళ్ల పాటు సేవలందించారు. అలాంటి మన్మోహన్‌పై మోదీ వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment