
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు నియామకాలు చేపట్టారు. కేఎస్ అళగిరిని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, హెచ్ వసంత కుమార్, కె జయకుమార్, ఎంకే విష్ణు ప్రసాద్, మౌర్య జయకుమార్‌లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావక్కరసర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఇన్నాళ్లూ ఆ పదవిలో ఉన్నందుకు ఆయనను రాహుల్ అభినందించారు. మరియం బీబీ, మియాని దాల్బోత్‌లను వరుసగా అండమాన్, నికోబార్ దీవులు, మేఘాలయల మహిళా కాంగ్రెస్‌లకు కార్యనిర్వాహక అధ్యక్షురాళ్లుగా రాహుల్ నియమించారు. లక్షద్వీప్‌కు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ, గుజరాత్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌ల ఏఐసీసీ ఎస్సీ విభాగంలోనూ కొందరిని రాహుల్ గాంధీ నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment