Alagiri
-
అళగిరికి పదవీ గండం తప్పదా?
సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు ఎవరో అనే చర్చ పార్టీలో బయలుదేరింది. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుత అధ్యక్షుడు కేఎస్ అళగిరిని తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో పదవిని చేజిక్కించుకునేందుకు రేసులో ఐదుగురు నేతలు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అళగిరి ఐదేళ్ల పాటు కొనసాగారు. కాంగ్రెస్‌లో మూడేళ్లకు ఒకసారి అధ్యక్ష మార్పు జరిగేది. అయితే, అళగిరి పనితీరును మెచ్చి ఆయన్ను అదనంగా మరో రెండేళ్లు కొనసాగించారు. డీఎంకేతో సఖ్యతగా ఉంటూ వచ్చిన అళగిరి ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక, నగర పాలక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. ఈ పరిస్థితులలో తమిళనాడుతో పాటు నాలుగు రాష్ట్రాలలో దీర్ఘకాలంగా అధ్యక్షుడిగా ఉన్న వారిని చార్చేందుకు అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. ఢిల్లీకి అళగిరి.. కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తులను ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు నలుగురు ఎంపీలు, ఒక మాజీ ఎంపీ ప్రయత్నాలు చేపట్టి ఉండడం గమనార్హం. ఇందులో ఎంపీలు చెల్లకుమార్, జ్యోతిమణి, తిరునావుక్కరసర్ ఉన్నట్టు తెలిసింది. అలాగే, మాజీ ఎంపీ విశ్వనాథన్ సైతం ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం. తిరునావుక్కరసర్ గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. రాహుల్‌గాంధీ మద్దతు కలిగిన ఎంపీ జ్యోతిమణి సైతం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా డీఎంకేతో సన్నిహితంగా మెలిగే నేతై ఉండాలన్న సలహాను కాంగ్రెస్ సీనియర్లు అఽధిష్టానానికి సూచించే పనిలోపడ్డారు. అళగిరి హుటాహుటినా ఢిల్లీకి ఆది వారం సాయంత్రం బయలుదేరి వెళ్లడంతో ఆయనకు మరో అవకాశం దక్కేనా లేదా కొత్త వారికి పదవి కట్టబెట్టేనా అన్నది వేచిచూడాల్సిందే. -
Tamil Nadu: ‘ఆ ఏడుగురి విడుదలకు వ్యతిరేకం’
సాక్షి ప్రతినిధి, చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు ఎంత మాత్రం ఆ మోదం కాదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. నేరస్తులకు శిక్ష వేయడం న్యాయస్థానాల పరిధిలోని వ్యవహారమని, ఇందులో రాజకీయ జోక్యం, వత్తిళ్లు తగదని పేర్కొన్నారు. జైళ్లలో ఏడుగురే కాదు.. వందమందికి పైగా తమిళులు ఉన్నారని వ్యాఖ్యానించారు. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలని కోరుతూ 2018లో రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతికి ఈనెల 20వ తేదీన లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చెన్నై సైదాపేటలోని ఆయన నిలువెత్తు విగ్రహానికి టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తదితర కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి రాసిన లేఖపై స్పందించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 21వ శతాబ్దాన్ని పురస్కరించుకుని అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. అవి యువతకు ఎంతో ఉపకరించాయన్నారు. సమాచార వ్యవస్థ సైతం కొంతపుంతలు తొక్కిందని పేర్కొన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయంటే రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమని వివరించారు. పారిశ్రామిక రంగాన్ని సైతం పరుగులు పెట్టించి తమిళుల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. అలాంటి నేతను హత్య చేసిన ఏడుగురు తమిళ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు సమ్మతం కాదన్నారు. రాష్ట్రంలోని జైళ్లలో వంద మందికి పైగా తమిళ ఖైదీలు 20 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. తమిళులు అనే భావనతో ఏడుగురిని మాత్రమే విడుదల చేయాలని కోరడం సబబుకాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడుగురు తమిళుల విడుదల అంశాన్ని డీఎంకే తన మేనిపెస్టోలో పొందుపరిచిందని, ఆ విషయౖమై డీఎంకేను కాంగ్రెస్ ఎలాంటి వత్తిడి చేయలేదని ఆయన వివరించారు. చదవండి: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్ -
త్వరలో అమెరికాకు తలైవా?
సాక్షి, చెన్నై : రాజకీయ పార్టీ ఏర్పాటు లేదని ప్రకటించిన తలైవా రజనీకాంత్ వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదిగో రాజకీయం, ఇదిగో పార్టీ అంటూ ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్ ఎట్టకేలకు గత ఏడాది చివర్లో వెనక్కి తగ్గారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా, పార్టీ ఏర్పాటు లేదన్న ప్రకటనను చేశారు. అభిమానులకు ఇది నిరాశే అయినా, తలైవా ఆరోగ్యం తమకు ముఖ్యం అని ప్రకటించిన వాళ్లు ఎక్కువే. అదే సమయంలో తలైవా మద్దతు తమ కంటే తమకు దక్కుతుందన్న ఆశాభావంతో రోజుకో ప్రకటనలు చేసే పార్టీల వాళ్లు పెరిగారు. రజనీని కలుస్తామని, మద్దతు కోరుతామని వ్యాఖ్యలు చేసే వాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ మద్దతు, భేటీల వ్యవహారాలను దాటవేయడానికి సిద్ధమైనట్టు సమాచారు. ఇందులో భాగంగా అమెరికా పయనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వైద్యపరమైన చికిత్సలు, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కొంతకాలం అమెరికాలో ఉండేందుకు రజనీ నిర్ణయించినట్టు, కుటుంబసభ్యులు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. మార్చి నెలాఖరు వరకు విదేశాల్లో ఉండి, ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చేందుకు తగ్గట్టుగా పర్యటన ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలిసింది. అళగిరి నిర్ణయం ఎమిటో.. డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ఆదివారం రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయబోతున్నారు. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేసిన పక్షంలో ఆయనతో కలిసి నడవడం లేదా, కొత్త పార్టీ ఏర్పాటు ద్వారా జత కట్టడం దిశగా అళగిరి వ్యూహాలు ఉన్నట్టు ఇది వరకు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. రాజకీయ పార్టీ లేదని రజనీ ప్రకటనతో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు అళగిరి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆది వారం మదురైలో మద్దతుదారులతో భేటీకానున్నారు. పది వేల మంది మద్దతు నేతలు తరలి వస్తారన్న ఆశాభావంతో ఏర్పాట్లు జరిగాయి. వీరి అభిప్రాయాలు, సూచనల మేరకు అళగిరి రాజకీయ ప్రకటన ఉండబోతున్నది. డీఎంకేను చీల్చే రీతిలో కలైంజర్ డీఎంకేను ఏర్పాటు చేస్తారా లేదా, మరేదేని కీలక నిర్ణయాన్ని అళగిరి తీసుకుంటారా అనే ఎదురుచూపులు పెరిగాయి. -
డీఎంకేకి షాక్.. అమిత్ షా- అళగిరిల భేటీ?!
చెన్నై: వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట తన వ్యూహాలను సైలెంట్‌గా అమలు చేస్తోంది. ఈ క్రమంలో డీఎంకేకు చెక్ పెట్లేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా అళగిరి విశ్వాసపాత్రుడు కేపీ రామలింగం నేడు తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్ మురగన్‌ని కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భవంగా చెన్నైలో ఆయనతో భేటీ అయ్యేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. కొత్త పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్న అళగిరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలుపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఏడాది విరామం తర్వాత రాష్ట్రానికి వస్తోన్న అమిత్ షా తమిళనాట పార్టీని బలోపేతం చేసే నిర్ణయాల గురించి క్యాడర్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే పర్యటనలో భాగంగా అమిత్ షా, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో భేటీ అవుతారని తెలిసింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్-మేలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారా లేదా అనే గందరగోళం తలెత్తిన నేపథ్యంలో రజనీ-అమిత్ షాల భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. అలానే అమిత్ షా-అళగిరిల భేటీ కూడా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ ఎల్ మురగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్ షా రజనీకాంత్‌ని కలవరని నేను చెప్పలేను’ అంటూ పరోక్షంగా రజనీ-షాల మీటింగ్ గురించి హింట్ ఇచ్చారు. అంతేకాక ‘అళగిరి బీజేపీలో చేరబోతున్నారనే దాని గురించి తమకు అధికారిక సమాచారం లేదని.. ఒకవేళ ఆయన బీజేపీలో చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని’ తెలిపారు. (డీఎంకేతో పొత్తు.. కమల్ క్లారిటీ) కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం: అళగిరి బీజేపీలో చేరబోతున్నారనే వార్తల్ని అళగిరి ఖండిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎల్ మురగన్ చేసిన వ్యాఖ్యలు విన్నాను. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. నా మద్దతుదారులతో చర్చించిన తర్వాత నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. 2021 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచించలేదు. అవన్ని పుకార్లు’ అంటూ కొట్టి పారేశారు. ‘పార్టీ వ్యతిరేక’ కార్యకలాపాల ఆరోపణలతో అళగిరిని 2016 లో డీఎంకే నుంచి బహిష్కరించారు. కరుణానిధి మరణం తరువాత స్టాలిన్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. అనంతరం అళగిరిపై వేటు వేశారు. 2018 లో కరుణానిధి మరణించిన వారం తరువాత, అళగిరి తన సోదరుడికి డీఎంకే కార్యకర్తలు తనతో ఉన్నారని బహిరంగంగా సవాలు చేశారు. -
కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి
సాక్షి, చెన్నై: కలైంజర్ డీఎంకే పేరుతో కొత్త పార్టీ స్థాపనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల 20న మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యతకు దారి తీసింది. డీఎంకే నుంచి తన పెద్దకుమారుడు అళగిరిని కరుణానిధి గతంలో బహిష్కరించిన విష యం తెలిసిందే. కరుణానిధి మరణం తదుపరి డీఎంకేలో చేరడానికి అళగిరి ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఆసక్తి చూపలేదు. చదవండి: బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం 2021 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా స్టాలిన్ ముందుకెళుతున్నారు. అదే సమయంలో పార్టీలోకి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకురావడం, ప్రాధాన్యత ఇవ్వడంతో డీఎంకే సీనియర్లలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో అళగిరి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరగడం డీఎంకేలో చర్చకు దారి తీసింది. మద్దతుదారులతో భేటీ రాజకీయాలకు అళగిరి దూరంగా ఉంటున్నా తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం కూడా సాగింది. అయితే రజనీ పార్టీపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 20న మదురైలోని దయ కల్యాణ మండపంలో తన మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యను సంతరించుకుంది. చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు.. దక్షిణ తమిళనాడులో అళగిరికి మద్దతు గణం అధికంగా ఉండడం, ప్రస్తుత డీఎంకేలో అసంతృప్తితో ఉన్న నేతలకు రహస్యంగా పిలుపు వెళ్లడం వెరసి అళగిరి ఏ ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే కలైంజర్ డీఎంకే ఏర్పాటుకు గతంలో తమ నేత సిద్ధంగా ఉన్నట్టుగా మద్దతుదారులు ప్రకటించిన నేపథ్యంలో అదే నినాదాన్ని అందుకుని డీఎంకేలో చీలిక దిశగా అళగిరి వ్యూహాలు ఉండవచ్చన్న చర్చ ఊపందుకుంది. మద్దతుదారుల అభిప్రాయం మేరకు కొత్త పార్టీనా లేదా బీజేపీతో జతకట్టడమా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి పరుగు
సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల నేపథ్యంలో డీఎంకేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్గాలు వ్యతిరేకించిన తీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరిని ఇరకాటంలో పెట్టింది. అదే సమయంలో డీఎంకేను ఉద్దేశించి ఆయన సైతం చేసిన వ్యాఖ్యలు కూటమికి ఎసరుపెట్టే పరిస్థితులకు దారి తీశాయి. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో కేఎస్ దేశ రాజధాని ఢిల్లీకి పరుగులు తీశారు. తమ నేత సోనియాగాందీతో కేఎస్ భేటీ సాగింది. ఈ సమయంలో కేఎస్ సోనియా క్లాస్ పీకినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జిల్లా, యూనియన్ పంచాయతీల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ వర్గాలు అనేక చోట్ల డీఎంకేకు షాక్ ఇచ్చే దిశగా ముందుకు సాగిన విషయం తెలిసిందే. దీంతో తమకు అవకాశాలు ఉన్నా, చివరకు ఆయా జిల్లా, యూనియన్ పదవుల్ని డీఎంకే కోల్పోవాల్సిన పరిస్థితి. (నా పరిస్థితి బాగోలేదు.. ఇలాగైతే దిగిపోతా: సీఎం) అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి విడుదల చేసిన ఓ ప్రకటన వివాదానికి దారి తీసింది. కూటమి ధర్మాన్ని డీఎంకే ధిక్కరించినట్టుగా పరోక్షంగా ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌పై కేఎస్ ఎదురుదాడి వ్యాఖ్యల తూటాలు పేల్చడం చర్చకు దారి తీసింది. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్‌తో డీఎంకే కటీఫ్ తథ్యం అన్న చర్చ జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఈనెల 21న కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారు. అదే సమయంలో సోమవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పక్ష పార్టీల సమావేశాన్ని సైతం డీఎంకే బహిష్కరించడం చర్చకు దారి తీసింది. ఈ సమయంలో డీఎంకే సీనియర్ నేత, ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్టానం ఇరకాటంలో పడ్డట్టు అయింది. (అశాంతి సృష్టిస్తున్నారు: మోదీ) ఢిల్లీకి పరుగు.. కేఎస్ అళగిరి చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ వర్గాలు తీవ్రంగానే పరిగణించి ఉన్నాయని టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలతో ఇక కూటమి అన్నది కొనసాగేనా అన్న చర్చ జోరందుకుంది. జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ డీఎంకే పాత్ర కీలంగా ఉన్న నేపథ్యంలో ఈ వివాదం కాంగ్రెస్ పెద్దల్ని ఇరకాటంలో పడేసింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో కేఎస్ ఆగమేఘాలపై పరుగులు తీశారు. ఉదయాన్నే పార్టీ నేత సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు. గంటన్నరకు పైగా సోనియాతో భేటీ సాగడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. అయితే, అళగిరి తన తరఫు వివరణను సోనియాగాందీకి ఇచ్చుకున్నా, డీఎంకేతో వైర్యం మంచి కాదని క్లాస్ పీకినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాగిన వ్యవహారాలను సోనియా తీవ్రంగా పరిగణించి, డీఎంకే నిర్ణయాలకు తగ్గట్టుగా ముందుకు సాగాలని హితబోధ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన కేఎస్ మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నకు దాట వేత ధోరణి అనుసరించారు. డీఎంకే – కాంగ్రెస్‌ల బంధం గట్టిదని , తమ కూటమిలో ఎలాంటి వివాదాలు, చీలికలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు, వివాదాలు తప్పవని, తన తరఫున ఉన్న వివరణను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లినట్టు ముగించారు. కాగా, టీఆర్ బాలును మీడియా కదిలించగా, కేఎస్ ప్రకటన డీఎంకే వర్గాల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన మాట వాస్తవమేనని, కార్యదర్శులతో స్టాలిన్ భేటీ కానున్నారని ముగించడం గమనార్హం. -
అది రజనీకి మాత్రమే సాధ్యం..
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కుమారుడు అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ లోటు ఉందని, ప్రజలను ఆదుకునేందుకు ఓ నాయకుడు కావాలని అన్నారు. అది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మాత్రమే సాధ్యమని ఆళగిరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడూతూ.. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విపక్ష నేతగా విఫలమయ్యారని విమర్శించారు. అలాగే ప్రజల సమస్యలపై అన్నాడీఎంకే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ సంక్షోభం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని, ఈ దశలోనే రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందుండు నడిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉందన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అళగిరిని డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే కరణానిధి మరణాంతరం తిరిగి డీఎంకే పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే రాజకీయంగా నిలదొక్కుకున్న స్టాలిన్ ఆళగిరిని పార్టీ నీడ కూడా తాకనీయలేదు. అయితే అళగిరి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో బుధవారం భేటీ అయిన ఆయన.. రజనీ గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా రజనీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ అవేవీ నిజం కాలేదు. -
అళగిరి వారసుడి ఆస్తులు అటాచ్...!
సాక్షి, చెన్నై : డిఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి తనయుడు దురై దయానిధి మీద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురి పెట్టింది. గ్రానైట్ స్కాం కేసులో దురై దయానిధిని టార్గెట్ చేస్తూ, ఆయనకు సంబంధించిన రూ. 40.34 కోట్లు విలువ కల్గిన చర, స్థిర ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈకేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈడీ నిర్ణయించడం అళగిరికి పెద్ద షాక్కే. మదురై జిల్లా మేలూరు కేంద్రంగా సాగుతూ వచ్చిన గ్రానైట్ అక్రమ రవాణాను డీఎంకే ప్రభుత్వ హయంలోనే ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సహాయం వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రానైట్ మాఫియా రూపంలో ప్రభుత్వానికి పదహారు వేల కోట్ల మేరకు నష్టం వాటిళ్లినట్టు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇందుకు ఆయనకు లభించిన ప్రతి ఫలం బదిలీ వేటు. ఈ స్కాంలో ఎందరో పెద్దలు ఉన్నారంటూ చిట్టాను సైతం సహాయం విప్పినా పట్టించుకున్న పాలకులు కరువే. ఈ సమయంలో డిఎంకే కాంగ్రెస్‌ల మధ్య కేంద్రంలో ఉన్న బంధం బెడిసి కొట్టడం ట్విస్టులకు దారి తీసింది. డిఎంకే కుటుంబాన్ని గురి పెట్టి స్పెక్ట్రమ్ స్కాం, అక్రమ బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు అంటూ కేసుల మోత మోగింది. అలాగే, అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఎంకే అళగిరి అండదండాలతో ఆయన వారసుడు దురై దయానిధి మదురైలో యదేచ్చగా గ్రానైట్ తవ్వేసుకుంటూ సొమ్ము చేసుకున్నట్టుగా గుర్తించిన ఈడీ ఓ కేసును నమోదు చేసింది. తొలి నాళ్లలలో నత్తనడకన ఈ కేసు సాగినా, ఆ తదుపరి కనుమురుగైంది. అదే సమయంలో రాష్ట్రంలో అధికారం మార్పు జరగడంతో ఎట్టకేలకు ఐఎఎస్ సహాయ నిజాయితీని మద్రాసు హైకోర్టు గుర్తించింది. రాష్ట్రంలో సాగుతున్న గ్రానైట్, ఖనిజన సంపదల అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆయన నేతృత్వంలో ఓ కమిటీని రంగంలోకి దించింది. ఈ కమిటీ సమగ్ర నివేదికను హైకోర్టుకు సైతం సమర్పించి ఉన్నది. అలాగే, గ్రానైట్ అక్రమార్జనలో ఉన్న పెద్దలు, ఏ మేరకు తవ్వకాలు సాగాయి, అనేక గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఏ మేరకు కనుమరుగు అయ్యాయో అన్న వివరాలను ఆ నివేదికలో పొందు పరిచి ఉన్నారు. ఈ నివేదిక కోర్టుకు చేరి రెండేళ్లు అవుతున్నది. ఈ నేపథ్యంలో అళగిరి వారసుడు దురై దయానిధి మీద దాఖలైన కేసు ఫైల్ దుమ్ము దుళి పే పనిలో ఈడీ నిమగ్నం కావడం ఆస్తుల అటాచ్..... ఆరేళ్ల క్రితం నమోదైన కేసు ఫైల్‌ను దుమ్మదులిపే పనిలో పడ్డ ఈడీ వర్గాలు దురై దయానిధిని టార్గెట్ చేశారు. గ్రానైట్ అక్రమార్జన ద్వారా ప్రభుత్వానికి పంగనామాలు పెట్టిన దురై దయానిధి ఆస్తుల్ని అటాచ్ చేయడం గమనార్హం. తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దయానిధి ఆగడాలకు మదురైలో హద్దే లేదన్న ప్రచారం మరీ ఎక్కువే. అందుకే కాబోలు ప్రస్తుతం ఎప్పుడో నమోదైన కేసు మీద ఈడి ఇప్పుడు దృష్టి పెట్టి విచారణ వేగవంతానికి సిద్ధమైనట్టుంది. ఒలంపస్ గ్రానైట్స్ పేరుతో సాగిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ, ప్రస్తుతం కేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం అయింది. త్వరలో ఈకేసు కోర్టు విచారణకు రానున్న దృష్ట్యా అంతలోపు తమ కొరడాను ఝుళిపించే పనిలో నిమగ్నమైంది. బుధవారం దురై దయానిధి ఆస్తుల అటాచ్ ఉత్వర్వులకు సంబంధించిన ప్రకటన ఢిల్లీలో వెలువడింది. ఆయనకు సంబంధించిన రూ. 40 కోట్ల చర, స్థిర ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం. ఇది కాస్త ఎంకే అళగిరికి షాక్కే. ప్రస్తుతం డిఎంకే బహిష్కృత నేతగా రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్న అళగిరి కుటుంబానికి వ్యతిరేకంగా ప్రస్తుతం పరిణామాలు బయలు దేరడంతో ఆయన మద్దతు దారుల్లో ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ పరిణామాలు మున్ముందు తమ నేతను ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతాయో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా అళగిరి
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు నియామకాలు చేపట్టారు. కేఎస్ అళగిరిని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, హెచ్ వసంత కుమార్, కె జయకుమార్, ఎంకే విష్ణు ప్రసాద్, మౌర్య జయకుమార్‌లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావక్కరసర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఇన్నాళ్లూ ఆ పదవిలో ఉన్నందుకు ఆయనను రాహుల్ అభినందించారు. మరియం బీబీ, మియాని దాల్బోత్‌లను వరుసగా అండమాన్, నికోబార్ దీవులు, మేఘాలయల మహిళా కాంగ్రెస్‌లకు కార్యనిర్వాహక అధ్యక్షురాళ్లుగా రాహుల్ నియమించారు. లక్షద్వీప్‌కు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ, గుజరాత్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌ల ఏఐసీసీ ఎస్సీ విభాగంలోనూ కొందరిని రాహుల్ గాంధీ నియమించారు. -
అళగిరి బల ప్రదర్శన
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే బహిష్కృత నాయకుడు అళగిరి బుధవారం తన మద్దతుదారులు, అభిమానులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అళగిరి బల ప్రదర్శనగా పేర్కొంటున్న ఈ యాత్ర చెన్నైలో వాలాజా రోడ్ జంక్షన్ నుంచి మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వరకు 1.5 కి.మీ. దూరం సాగింది. నలుపు రంగు చొక్కా, ధోవతి ధరించిన అళగిరి ఓపెన్ టాప్ వ్యానులో నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా, కరుణానిధి చిత్ర పటాల్ని చేతబట్టి, నల్ల చొక్కాలు, నెత్తిన పసుపు వర్ణం టోపీ ధరించి మద్దతుదారులు ర్యాలీలో ముందుకు సాగారు. అళగిరి కుమారుడు దురాయ్ దయానిధి, కూతురు కాయల్విజి, సన్నిహితులు మదురై మాజీ డిప్యూటీ మేయర్ పీఎం మణ్నన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. డీఎంకే పార్టీ నుంచి ప్రముఖ నాయకులెవరూ ర్యాలీలో పాల్గొనలేదు. యాత్ర ముగిశాక అళగిరి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ యాత్ర వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తన తండ్రికి నివాళులర్పించేందుకే ర్యాలీ చేపట్టినట్లు అళగిరి తెలిపారు. ధైర్యముంటే, యాత్రలో పాల్గొని తనకు మద్దతుతెలిపిన నాయకులు, కార్యకర్తలందరిపై వేటువేయాలని డీఎంకేకు సవాలు విసిరారు. -
రసపట్టులో అన్నదమ్ముల సవాల్
పార్టీపై స్టాలిన్ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం పరిశీలకులందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. స్టాలిన్ పార్టీ మనిషిగానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాకపోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరే పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. చెన్నైలోని మెరీనాలో తన తండ్రి ఎం.కరుణానిధి సమాధి వద్దకు ఆయన రెండో కొడుకు డీఎంకే మాజీ నేత ఎంకే అళగిరి నేడు (బుధవారం) ఊరేగింపుగా వెళుతున్నారు. 1980ల్లో తన ఇద్దరు కొడుకుల మధ్య వైరంతో విసిగిపోయిన కరుణానిధి పార్టీ దక్షిణాది వ్యవహారాలు చూసుకో మని అళగిరిని మదురైకు పంపించారు. ఉత్తర తమిళ నాడులో పార్టీ పనిని చెన్నై నుంచి నడపాలని స్టాలిన్‌కు అప్పగించారు. స్టాలిన్ కార్యక్షేత్రంలోనే ఆయనకు అన్న సవాలు విసురుతున్నారు. కుటుంబ పోరు ఇక బహిరంగమే. తోబుట్టువుల మధ్య ఈ యుద్ధంలో అళగిరే బలహీనుడు. ఆగస్టు చివరి వారం స్టాలిన్ తండ్రికి వారసునిగా డీఎంకే అధ్యక్ష పదవి చేపట్టారు. కరుణ ఈ పదవిలో 49 ఏళ్లున్నారు. 2014లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళ గిరి ప్రస్తుతం పార్టీ సభ్యుడు కూడా కాకపోవడంతో తమ్ముడిని అడ్డుకోలేకపోయారు. ప్రతి జిల్లాలో అన్ని పదవుల్లో్ల తన మనుషులను నియమిస్తూ గత నాలు గేళ్లలో పార్టీపై స్టాలిన్ పూర్తి పట్టు సాధించారు. ఈ నాలుగేళ్లలో అళగిరి రాజకీయాల్లో చురుకుగా లేరు. తమ్మునితో పోరు సలపకుండా వెనుదిరగడం ఆయ నకు ఇష్టం లేదు. మళ్లీ డీఎంకేలో చేరాలనుకున్న ఆయనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. దీంతో ఇక బాహాటంగానే స్టాలిన్‌తో తలపడాలను కుని, తన తండ్రికి నిజమైన, విధేయులైన కార్యకర్త లంతా నాతోపాటే ఉన్నారని చెప్పారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్ కార్యసాధకుడు కాదని, పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఆయనకు లేదని అళగిరి చెప్పారు. స్టాలిన్‌కు ఎక్కడ నొప్పి పుడు తుందో అక్కడే అళగిరి గురిచూసి కొడుతున్నారు. కరుణానిధి బతికుండగానే 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోనే డీఎంకే పోటీచేసింది. డీఎంకేకు ఒక్క లోక్‌సభ సీటూ దక్క లేదు. రెండేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితను గద్దె దింపలేకపోయింది. అందుకే, 2019 పార్లమెంటు ఎన్నికలు స్టాలిన్‌కు అగ్నిపరీక్ష వంటివి. మూడోసారి ఎన్నికల్లో డీఎంకేను గెలిపించ లేకపోతే స్టాలిన్‌కు ప్రమాదం ముంచుకొస్తుంది. అళగిరి పార్టీని చీల్చలేక పోయినా, స్టాలిన్‌ను ఇబ్బం దిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్న పేరెత్తని స్టాలిన్! అళగిరి విమర్శలకు స్టాలిన్ స్వయంగా స్పందించ లేదు. పార్టీ నేతలతోనే జవాబు చెప్పించారు. పార్టీపై స్టాలిన్ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం డీఎంకే వ్యవహారాలు గమనిస్తున్నవారందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరారు. స్టాలిన్ పార్టీ మనిషి గానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాక పోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరేక పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. జయలలిత మరణించాక ఏఐఏడీఎంకేలో వచ్చిన చీలిక, బల హీన నాయకత్వంలో పార్టీ నడవడాన్ని తమకు అను కూలంగా మార్చుకోవడానికి డీఎంకే ప్రయత్నిస్తున్నట్టే, డీఎంకేను నడిపే కరుణానిధి కుటుంబంలోని కీచులాటలను వాడుకోవడానికి కూడా అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి డీఎంకే నేతలు, కార్యకర్తలను చెప్పుకోదగ్గ సంఖ్యలో అళగిరి తనవైపుకు తిప్పుకోలేరు.. రెండేళ్ల క్రితం స్టాలిన్ అడ్డపంచె వదిలి ప్యాంటు, రంగు చొక్కా బదులు తెల్ల షర్టు వేసుకునేలా సలహాదారుల బృందం ఆయనను ఒప్పించింది. ఇలా ‘గెటప్’ మార్చితే తమిళనాడు యువతను వారిలా కనిపిస్తూ ఆకట్టుకోవవచ్చనేది ఈ సలహాబృందం అభిప్రాయం. కొత్త రూపంలోని స్టాలిన్ మీడియా తీసిన ఫొటోల్లో ఆసక్తికరంగానే కనిపించారుగాని ఎన్నికల్లో మాత్రం డీఎంకే గెలిచేస్థాయిలో ఓట్లు పడలేదు. కనీసం కరుణానిధి, జయలలిత లేని తమిళ రాజకీయక్షేత్రంలోనైనా ఎన్నికల్లో కొత్త అంశాలు జోడించి విజయానికి బాటలు వేయాలనే వత్తిడి స్టాలిన్‌పై పెరుగుతోంది. రెండేళ్లకు పైగా అధికారంలో ఉన్న పాలకపక్షమైన ఏఐడీఎంకేపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిపైనే పార్టీ గెలుపునకు పూర్తిగా ఆధారపడితే స్టాలిన్‌కు విజయం గ్యారంటీ అని చెప్పడం కష్టం. తన తండ్రి సీఎంగా అందించిన డీఎంకే పరిపాలన నాణ్యత తన నాయకత్వంలో బాగా మెరుగవుతుందని, సుపరిపాలనకు తన పార్టీ మంచి నమూనాగా నిలుస్తుందని స్టాలిన్ సరికొత్త ఇమేజ్‌తో ప్రజలను నమ్మించగలిగితేనే పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది. గతంలో మాదిరిగా పాలక పక్షంపై జనంలో పేరుకుపోయే వ్యతిరేకత ఈసారి డీఎంకే అధికారంలోకి రావడానికి తోడ్పడకపోవచ్చు. తమిళనాడులో 1984, 2016లో మినహా ప్రజలు అధికారంలో ఉన్న ద్రవిడ పార్టీలను ఓడించారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలో ఈ రెండు సందర్భాల్లో తప్ప ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి ఫోర్ట్ సెయింట్ జార్జిలో (తమిళ అధికారపీఠం ఉండే ప్రాంతం) అధికారం చేపట్టాయి. కరుడుగట్టిన ఏఐఏ డీఎంకే కార్యకర్తకు సీఎం పళనిస్వామి– ఓపీఎస్ నేతృత్వంలోని అసలు ఏఐఏడీఎంకేనుగాని, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని చీలికవర్గమైన కొత్త పార్టీని(అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం)గాని ఎంచుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకేలోని అసంతృప్తి జ్వాలలపైనే తమిళ నాడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి స్టాలిన్ పూర్తిగా ఆధారపడలేరనేది వాస్తవం. ఖాయంగా అధికారం లోకి రావాలంటే కొత్త సీసాలో పాత సారా పోసి చూపించకుండా, తమిళనాడు ప్రగతికి కొత్త విజన్ ఏమిటో స్టాలిన్ ప్రజలకు చెప్పగలగాలి. కొత్త పార్టీ పెట్టినా పెద్దగా లాభం ఉండదు! అళగిరి కొత్తగా పార్టీ పెట్టినా ఎన్నికల ఫలితాలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులో ఓట్లు చీల్చి డీఎంకేను ఓడించగలిగితే అళగిరికి అంతకన్నా ఆనందించే విషయం ఉండదు. ఈ లక్ష్య సాధనకు స్టాలిన్ రాజ కీయ ప్రత్యర్థులతో కలిసి పనిచేయడానికి కూడా ఆయన సిద్ధమే. ప్రస్తుతానికి ఏ రాజకీయ సంస్థతో అనుబంధం లేకుండా కనిపిస్తున్నాగాని కరుణానిధికి ప్రత్యామ్నాయ వారసునిగా అళగిరి తాను జనం ముందు కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత తనను తప్పనిసరిగా డీఎంకేలోకి తమ్ముడు స్టాలిన్ తీసుకునే పరిస్థితిని అళగిరి ఈలోగా సృష్టించగలగాలి. అంటే ఎన్నికల్లో తన వల్ల డీఎంకే దెబ్బతినేలా చూడాలి. రాజకీయంగా తన ఉనికి చాటాలనే ఆతృత ఆయనలో కనిపిస్తోంది. తన కొడుకులు, మనవళ్లకు డీఎంకేలో రాజకీయ, ఆర్థిక వారసత్వం, వాటా దక్కించుకోవాలనేది కూడా అళ గిరి కోరిక. భారీగా డబ్బున్న డీఎంకే నిర్వహణలోని ట్రస్టుల్లో అళగిరి కుటుంబసభ్యులెవరికీ సభ్యత్వం లేదు. ఆయనలో అసలు అసంతృప్తికి ఇదో ప్రధాన కారణం. అందుకే ఆయన కొంత తగ్గివచ్చి తమ్ముడికి కొత్త ప్రతిపాదన చేశారు. తనను డీఎంకేలోకి మళ్లీ తీసుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధమేనని ఇటీవల ప్రకటించారు. కరుణానిధి గోపా లపురం ఇంట్లో డీఎంకే ప్రథమ కుటుంబానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. కరు ణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోవడానికి తన కుటుంబసభ్యుల ద్వారా అళగిరి ఒత్తిడి తెచ్చారట. తమ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచే బాధ్యత తనపై ఉందని చెప్పుకునే ఆయన సోదరి సెల్వికూడా తన వంతు ప్రయత్నం చేశారు. తన సోదరులిద్దరూ కలిసి ఉండేలా చూడ డానికి అమె గట్టి కృషి చేశారు. కాని, అళగిరిని మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. ఆయనకు ఈ విషయంలో సవతి చెల్లెలు కనిమొళి, దగ్గర బంధువులైన మారన్ సోదరులు బాసటగా నిలబడ్డారు. తన తండ్రి మంచి ఆరో గ్యంతో ఉన్నప్పుడే మళ్లీ పార్టీలో చేరడానికి తాను గట్టి ప్రయత్నాలు చేయాల్సిందనీ, కాని ఆ పని చేయలేదని మదురైలోని తన మద్దతుదారులతో మాట్లాడుతూ అళగిరి తన బాధ వెళ్లబోసుకుంటు న్నారని తెలుస్తోంది. తన తండ్రి నిర్ణయం మార్చా ల్సిన అవసరం కనిపించడం లేదని స్టాలిన్ అంటు న్నారు. సోషల్ మీడియా అత్యంత చురుకుగా పని చేస్తున్న ఈ రోజుల్లో అళగిరి తరహా దురుసు రాజ కీయాల వల్ల పార్టీకి చేటేగాని లాభం ఉండదని భావి స్తున్నారు. డీఎంకే అగ్రనాయకత్వం కూడా అళగిరి మళ్లీ పార్టీలోకి రావాలని కోరుకోవడం లేదు. 2001లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినం దుకు అళగిరిని సస్పెండ్ చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పని చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. తనకు పలుకుబడి ఉన్న మదురై చుట్టుపక్కల ప్రాంతాల్లో డీఎంకే అభ్య ర్థుల ఓటమికి ఆయన పనిచేశారనే ఆరోపణలు న్నాయి. అళగిరి దెబ్బతో పరాజయం పాలైనవారిలో డీఎంకే సీనియర్ నేత పీటీఆర్ పళనిరాజన్ కూడా ఉన్నారు. ఆయన 1996–2001 మధ్య తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. మదురై పశ్చిమ స్థానంలో ఆయన కేవలం 708 ఓట్ల తేడాతో ఓడి పోయారు. అళగిరి 17 ఏళ్ల క్రితంలా ఇప్పుడు లేకున్నా డీఎంకేను దెబ్బదీయడానికి ఆయనకున్న శక్తియుక్తులను ఎవరూ తక్కువగా అంచనావేయడం లేదు. అళగిరి పొరపాటు చేశారా? అంటే అవుననే చెప్పాలి. తన తండ్రి మరణించాక ఆయన కొంత కాలం వేచి చూడాల్సింది. వారంలోపే దూకుడుగా మాట్లాడారు. ఎన్నికల్లో స్టాలిన్ బోల్తాపడే వరకూ ఆగి తర్వాతే అళగిరి విమర్శిస్తే బావుండేది. తొంద రపడి తన బలహీనత బయటపెట్టుకున్నారు. బుధ వారం ర్యాలీకి తెలిసిన నేతలు, జనం తగినంత మంది హాజరుకాకపోతే అళగిరి రాజకీయ జీవితం ముగిసినట్టేననుకోవచ్చు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్!
-
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్!
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవ ఎంపిక దాదాపు ఖరారైంది. మంగళవారం జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ స్టాలిన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. కోశాధికారి పదవికి సీనియర్ నేత దురై మురుగన్ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది. ఆదివారం ఉదయాన్నే పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఆశీస్సులు తీసుకున్న స్టాలిన్ మెరీనా తీరం చేరుకున్నారు. అక్కడ దివంగత అన్నాదురై సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కరుణానిధి సమాధి వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తల్లి దయాళు అమ్మాల్ ఆశీర్వాదం పొందారు. తదుపరి అభిమానుల నినాదాల నడుమ తేనంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాళయానికి వెళ్లారు. పార్టీ నిర్వాహక కార్యదర్శి, ఎన్నికల అధికారి ఆర్ఎస్ భారతికి స్టాలిన్ నామినేషన్‌ను సమర్పించారు. స్టాలిన్ నామినేషన్‌ను ఆమోదిస్తూ జిల్లాల కార్యదర్శులు ప్రతిపాదన చేశారు. ఆయా జిల్లాలల నుంచి స్టాలిన్‌కు మద్దతుగా రెండు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ కోశాధికారి పదవికి దురై మురుగన్ నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా సైతం పలు నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియలో అ«ధ్యక్ష పదవికి స్టాలిన్, కోశాధికారి పదవికి దురై మురుగన్‌లకు మద్దతుగానే అన్ని నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆ ఇద్దరు ఎంపిక ఏకగ్రీవమైంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: అళగిరి! తమిళనాట ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తానని కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అన్నారు. తన బలాన్ని చాటేందుకు సెప్టెంబరు 5న చెన్నైలో శాంతి ర్యాలీని నిర్వహించాలని ఆయన నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ విజయవంతం లక్ష్యంగా, తన మద్దతుదారుల్ని ఏకంచేస్తూ గత మూడు రోజులుగా మదురైలో అళగిరి బిజీగా ఉన్నారు. -
రజనీకాంత్ పార్టీలోకి అళగిరి?
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి మరణాంతరం ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశమైంది. నిజమైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని, డీఎంకేకి తానే అసలైన నాయకుడినని ఇటీవల అళగిరి సంచలన వ్యాఖ్యలకు తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో డీఎంకేలో ఎంకే స్టాలిన్, అళగిరి మధ్య వారసత్వం పోరు జరుగుతోందన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన వార్త వినిపిస్తోంది. డీఎంకేలో నేతలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తోన్న అళగిరి.. రజనీకాంత్‌కు చెందిన పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కరుణానిధి మృతి అనంతరం చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వచ్చిన రజనీకాంత్.. అళగిరి, స్టాలిన్‌లతో కూడిన రెండు పోటోలను డీఎంకే సోమవారం విడుదల చేసింది. దానిలో రజనీకాంత్ అళగిరితో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతుండగా, మరో ఫోటోలో స్టాలిన్‌తో మాట్లాడడం మాత్రం ఎంతో ఇబ్బందికరంగా ఫీలయినట్లు తెలుస్తోంది. కాగా రజనీకాంత్ పార్టీ ప్రారంభించిప్పుడు కరుణానిధిని కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్, అళగిరి మధ్య స్నేహం కుదిరిందని, డీఎంకేలో తనకు ప్రాధాన్యత లేనందున రజనీకాంత్‌తో కలిసి వెళ్తారనే వార్తలు తమిళనాట వినిపిస్తున్నాయి. ఇదిలా వుండగా నేడు జరగనున్న డీఎంకే కార్యవర్గ సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్నే పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అళగిరి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. -
డీఎంకేలో ఆధిపత్యం కోసం అన్నదమ్ముల పోరు
-
డీఎంకేలో మళ్లీ అన్నదమ్ముల పోరు
సాక్షి, చెన్నై: పార్టీకి నమ్మకస్తులైన కార్యకర్తలంతా తనతోనే ఉన్నారనీ, తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డీఎంకే తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లేనని కరుణానిధి పెద్ద కొడుకు, బహిష్కృత పార్టీ నేత అళగిరి సోమవారం వ్యాఖ్యానించారు. పార్టీపై ఆధిపత్యం విషయంలో కరుణానిధి మరో కొడుకు స్టాలిన్, అళగిరిల మధ్య గొడవల నేపథ్యంలో 2014లో అళగిరిని, ఆయన మద్దతుదారులను కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం స్టాలిన్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుకాగా, కరుణ మరణంతో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టే వీలుంది. సోమవారం చెన్నైలో కరుణ సమాధి వద్ద నివాళులర్పించాక అళగిరి మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకేలోకి తిరిగి రాకుండా స్టాలిన్ అడ్డుకుంటున్నారన్నారు. ‘కరుణ నిజమైన అభిమానులు, మద్దతుదారులంతా నా పక్షానే ఉన్నారు. సమయమే సమాధానం చెబుతుంది’ అని అన్నారు. దక్షిణ తమిళనాడులో అళగిరికి మంచి పట్టు ఉంది. డీఎంకేలోని అనేక మంది నేతలు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ సంప్రదింపుల్లో ఉన్నారని ఆరోపించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతే ఇక పార్టీ నాశనమైనట్లే. అప్పుడు కరుణానిధి ఆత్మ వారిని శిక్షిస్తుంది. ఊరికే వదిలిపెట్టదు’ అని అన్నారు. ఆయన మా పార్టీ మనిషి కాదు ‘అళగిరి మా పార్టీ మనిషి కాదు. ఆయన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు’ అని ఎమ్మెల్యే అన్బళగన్ అన్నారు. డీఎంకేలో అందరూ ఐక్యంగానే ఉన్నారనీ, స్టాలిన్ వెన్నంటే ఉంటామన్నారు. డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ సైతం ఇదే తరహాలో స్పందించారు. -
అసలైన డీఎంకే నాదే: అళగిరి
మదురై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్షంలో ముసలం పుట్టింది. అసలైన డీఎంకే కేడర్ అంతా తనతోనే ఉన్నారని ఆ పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి ప్రకటించుకున్నారు. తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను ‘నాన్‌వర్కింగ్ ప్రెసిడెంట్’ అంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత ఏడు జిల్లాల్లో స్టాలిన్ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో అళగిరి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. గురువారం మదురైలో జరిగిన పార్టీ నేత ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ‘ప్రస్తుతం పార్టీలో వివిధ స్థానాల్లో ఉన్న వారంతా పదవుల కోసమే తప్ప పనిచేసే వారు కాదు. అసలైన కేడర్ అంతా నా వెంటే ఉంది. పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని మాత్రమే మా నాయకుడు’ అని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ 2014 లోక్‌సభకు ఎన్నికలకు ముందు అధ్యక్షుడు కరుణానిధి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ దక్షిణ జిల్లాల్లోని పార్టీ క్యాడర్లో ఆయనకు మంచి పట్టుంది. -
స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు, కింగ్ మేకర్ ఎంట్రీ!
చెన్నై : తమిళనాట రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. జయలలిత మరణంతో ఓ వైపు అన్నాడీఎంకేలో కుర్చీ కోసం కుమ్ములాటలు జరుగుతుంటే...మరోవైపు ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోనూ వారసత్వ పోరు మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ నెల 4వ తేదీన (బుధవారం) డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి కూడా కీలక పదవి ఇస్తే తిరిగి పార్టీలోకి వస్తానంటూ సంకేతాలు ఇస్తున్నారు. డీఎంకే దక్షిణాది కింగ్‌మేకర్‌గా ఒకప్పుడు అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆయన్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించేందుకు కుటుంబీకులు కరుణపై ఒత్తిడి కూడా వచ్చింది. దీంతో అళగిరి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరోవైపు కనిమొళికి కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కరుణానిధి పాల్గొంటారా? లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా ఈ సమావేశం గతంలోనే జరగాల్సి ఉండగా, ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాంతో ఈ భేటీ వాయిదా పడింది. కాగా ఈ సమావేశంలో కరుణానిధి పాల్గొంటారని పార్టీ సీనియర్ నేత అన్బళగన్ తెలిపారు. సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌కు ముఖ్య బాధ్యతలు అప్పగించేవిధంగా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో డీఎంకే సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అన్నయ్యకు అనుమతి!
► కరుణతో అళగిరి ► గంట పాటు గోపాలపురంలో.. పెద్దకుమారుడు, డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరికి పార్టీ అధినేత, తండ్రి కరుణానిధిని కలిసేందుకు గోపాలపురంలో అనుమతి లభించింది. గంట పాటు ఆ ఇంట్లో ఉన్న అళగిరి ఉత్సాహంగా వెలుపలకు రావడంతో మీడియా చుట్టుముట్టింది. తలైవర్ నల్లా ఇరుక్కురార్(నాయకుడు బాగున్నారు) అంటూ ఆనందకర వ్యాఖ్యలతో ముందుకు సాగడం విశేషం. సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి వారసులు ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్ల మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పరిణామాలు అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించే వరకు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. పార్టీ బహిష్కరణతో కొన్నాళ్లు మదురైకు, మరికొన్నాళ్లు విదేశాలకు పరిమితమైన అళగిరి, రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా ఉండే వారు. గతంలో పలుమార్లు అధినేత, తండ్రి కరుణానిధితో భేటీకి తీవ్రంగా ప్రయత్నించినా, ఆయనకు అనుమతి దక్కలేదని చెప్పవచ్చు. చివరకు గోపాలపురం ఇంటికి రావడం, తల్లి దయాళుఅమ్మాల్తో మాట్లాడడం, తిరిగి వెళ్లడం జరుగుతూ వచ్చింది. అరుుతే, ఇటీవల మాత్రం కొన్ని నిమిషాల పాటు కరుణానిధితో భేటీ అయ్యే అవకాశం అళగిరికి వచ్చింది. అరుుతే, ఆ భేటీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు సంధిం చకుండా, మౌనంగానే గోపాలపురం నుంచి ఆయన వెళ్లి పోయారు. ఈనేపథ్యంలో కొద్ది రోజులుగా కరుణానిధి అలర్జీ కారణంగా ఇంట్లోనే ఉంటూ, చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను చూడడానికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు.అరుుతే, శుక్రవారం ఉదయం అళగిరి గోపాలపురంలో ప్రత్యక్షంకావడం గమనార్హం. అన్నయ్యకు అనుమతి : ఎప్పుడొచ్చినా, ఒకింత ఆగ్రహంతో గోపాలపురం మెట్లు ఎక్కే అళగిరి, ఈ సారి ఆనందంగా ఇంట్లోకి దూసుకెళ్లడం గమనార్హం. పదకొండు గంటల సమయంలో తన సతీమణి గాంధీతో కలిసి గోపాలపురం చేరుకున్న ఆయన గంట సేపు అక్కడే ఉండడం విశేషం. అర గంట పాటు కరుణానిధితో అళగిరి భేటీ సాగినట్టు, తదుపరి తల్లి, సోదరి సెల్విలతో మాట్లాడి అళగిరి ఆ ఇంట్లో నుంచి ఆనందంగా బయటకు రావడం గమనార్హం. మీడియా చుట్టుముట్టడంతో ఆనందంగా వ్యాఖ్యల్ని వళ్లిస్తూ...తలైవర్ నల్లా ఇరుక్కురార్...నల్లా ఇరుక్కురార్ అంటూ ముందుకు సాగారు. మదురై తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల ప్రస్తావనను మీడియా తీసుకురాగా, నో కామెంట్ అన్నట్టు మౌనంగా కదిలారు. కాగా, తమ నాయకుడు గోపాలపురం నుంచి ఉత్సాహంగా బయటకు రావడంతో అళగిరి వర్గీయుల్లో ఆనందమే. ఇక, స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో తనతో పాటు చదువుకున్న మిత్రులతో అళగిరి భేటీ అయ్యారు. శని లేదా, ఆదివారం అళగిరి మళ్లీ విదేశాలకు పయనం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. -
తలైవర్ బాగున్నారు...: అళగిరి
చెన్నై : డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమారుడు, బహిష్కత డీఎంకే నేత అళగిరి తెలిపారు. గోపాలపురంలోని నివాసంలో కరుణానిధిని శుక్రవారం అళగిరి కలిశారు. తండ్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తలైవర్ బాగున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు చెప్పారు. కాగా కరుణానిధి ఇటీవలి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అలర్జీ కావడంతో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు విశ్రాంతి సూచించారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న కరుణానిధి సందర్శకులను కలవడం లేదు. కాగా తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని డీఎంకే అధినేత కరుణానిధి ఇటీవల ఓ తమిళ వారపత్రికకు ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరుణానిధి తర్వాత డీఎంకే ఆధిపత్యం కోసం అళగిరి, స్టాలిన్ మధ్య చాలాకాలంగా పోరు జరిగిన విషయం విదితమే. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2014లో డీఎంకే నుంచి అళగిరిని పార్టీ చీఫ్ కరుణానిధి బహిష్కరించారు. -
మంతనాలు
తండ్రి కరుణతో అళగిరి భేటీ తల్లిదండ్రుల పరామర్శకేనని సమాధానం పార్టీ పునఃప్రవేశమని ప్రచారం చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకే అధిష్టానంతో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీ నుంచి బహిష్కృతుడైన కరుణానిధి తనయుడు అళగిరి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. తన తండ్రి కరుణానిధిని గురువారం కలుసుకోవడం ద్వారా ఎన్నికల వేళ అళగిరి ఏమి కిరి కిరికి సిద్ధమైనాడనే చర్చకు తెరలేపాడు.తన ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్ల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరులో డీఎంకే అధినేత కరుణానిధి నలిగిపోతున్నారు. కరుణ తదనంతరం పార్టీ పగ్గాలు ఎవరికనే అంశం కరుణ కుటుంబంలో రాజకీయ చిచ్చును రగిల్చింది. పెద్ద కుమారుడైనందున తానే వారసుడినని అళగిరి, అంటిపెట్టుకుని చురుకైన రాజకీయాలు నడుపుతున్నందున తనకే పార్టీ పగ్గాలు అప్పగించాలని స్టాలిన్ పట్టుదలతో ఉన్నారు. పార్టీ దక్షిణ తమిళనాడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అళగిరి మధురైలో ఉండగా, పార్టీ కోశాధికారిగా చెన్నైలోనే నివాసం ఉంటున్న స్టాలిన్‌కు సహజంగానే కరుణానిధితో సాన్నిహిత్యం ఎక్కువ. కరుణానిధిని కలిసేందుకు వచ్చే డీఎంకే నేతలోపాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల అతిరథమహారథులతో సైతం స్టాలిన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. కరుణానిధితో సమానంగా పరిచయాలు స్టాలిన్ వారసత్వానికి కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే స్టాలిన్ స్థాయిలో సమన్వయం, సంయమనం పాటించే స్వభావం అళగిరిలో లేదు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని నమ్ముతున్న కరుణానిధి పెద్ద, చిన్న కుమారులనే బేరీజు తావివ్వకుండా స్టాలిన్నే చేరదీయడం ప్రారంభించారు. ఈ పరిణామంతో పార్టీ కేడర్ దాదాపుగా స్టాలిన్ వెనుకే నడవడం ప్రారంభించింది. స్టాలిన్ ఆధిపత్యాన్ని సహించలేని అళగిరి తండ్రి కరుణతోనే కయ్యానికి కాలుదువ్వాడు. తననే వారసుడిగా ప్రకటింపజేయాలని తల్లి చేత సిఫారసు చేయించుకున్నాడు. వారసత్వ ప్రకటనలో కరుణ మౌనం అళగిరిలో అసహనాన్ని పెంచింది. పార్టీపట్ల క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తూ అదుపు తప్పినట్లుగా ప్రవర్తిస్తున్న తీరును భరించలేని కరుణానిధి రెండేళ్ల క్రితం అళగిరిపై వేటువేశారు. పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తరవాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల సమయంలో డీఎంకేకు ఒక్కసీటు కూడా రాదని బహిరంగ ప్రకటనలు చేశాడు. పార్టీ అన్నా, తండ్రి కరుణానిధి అన్నా గౌరవమేనని మరో ప్రకటన చేయడం ద్వారా స్టాలిన్ అంటే మాత్రం గిట్టదని పరోక్షంగా చెప్పాడు. తండ్రిని కలిసేందుకు అళగిరి అనేక ప్రయత్నాలు చేయగా కరుణానిధి నిరాకరించారు. మళ్లీ తెరపైకి: డీఎంకే ప్రతిష్టను భ్రష్టుపట్టించడమే ధ్యేయంగా ప్రకటనలు సాగిస్తున్న అళగిరి అసెంబ్లీ ఎన్నిక ల నేపథ్యంలో అకస్మాత్తుగా కరుణానిధిని కలుసుకోవడం అందరినీ సంభ్రమాశ్చ్యర్యాలకు గురిచేసింది. గురువారం ఉదయం 11 గంటలకు గోపాలపురంలోని ఇంటికి వెళ్లి కరుణానిధిని కలుసుకున్నారు. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎన్నికలపైనా, సీట్ల సర్దుబాటు గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్లు ప్రచారం జరిగింది. బయటనే వేచిఉన్న మీడియా ప్రతినిధులు మళ్లీ డీఎంకేలో చేరుతున్నారా అని ప్రశ్నించగా, పెద్దాయన క్షేమ సమాచారం విచారించేందుకు మాత్రమే వచ్చానని బదులిచ్చాడు. అళగిరి మళ్లీ డీఎంకేలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో కరుణానిధితో భేటీ కావడం అన్నిపార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పార్టీ అధికార ప్రతినిధి ఇళంగోవన్‌ను ప్రశ్నించగా, ఈ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని సమాధానాన్ని దాటవేశారు. అళగిరి సోదరుడైన స్టాలిన్‌ను ప్రశ్నించగా, తన తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చి వెళ్లాడు ఇందులో రాజకీయం ఏముంటుందని వ్యాఖ్యానించారు. గతంలో నిరాకరించిన కరుణానిధి నేడు అళగిరిని కలిసేందుకు అనుమతించడంతో ఎవరెన్ని రకాలుగా దాటవేసినా వారిద్దిరి భేటీ రాజకీయంతో కూడుకున్నదేనని విశ్వస్తున్నారు. -
డీఎంకేలోకి మళ్లీ అళగిరి?
కుటుంబీకుల ఒత్తిడి కరుణ అంగీకరించినట్టు సమాచారం కొత్త ఏడాదిలో కింగ్ మేకర్ రీ ఎంట్రీ అవకాశం చెన్నై : డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరికి మళ్లీ రీ ఎంట్రీకి మార్గం సుగమం అవుతున్నట్టుంది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా, ఆయన్ను మళ్లీ ఆహ్వానించేందుకు కుటుంబీకులు అధినేత ఎం కరుణానిధి మీద ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో కొత్త ఏడాదిలో ఈ కింగ్ మేకర్ మళ్లీ రీ ఎంట్రీ కాబోతున్నట్టు డీఎంకేలో చర్చ సాగుతున్నది. డీఎంకే దక్షిణాది కింగ్‌మేకర్‌గా ఒకప్పుడు ఎంకే అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. యూపీఏ హ యాంలో ఎంపీగా, కేంద్ర కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించినా తన దృష్టిని అంతా రాష్ట్రం మీదే అళగిరి కేంద్రీకరించే వారు. ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని పార్టీ వర్గాలు తన చేతి నుం చి జారీ పోకుండా జాగ్రత్తలు పడ్డారు. అయితే, తన కోటలో ఆయన సోదరుడు, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ క్రమంగా పాగా వేయడం మొదలెట్టడంతో అళగిరి బహిరంగ యుద్దానికి ది గారు. అన్నదమ్ముళ్ల మధ్య ఏళ్ల తరబడి చాప కింద నీరులా సాగుతూ వచ్చిన వారసత్వ సమరం ఈ పరిణామాలతో డీఎంకేలో పెను కలకలాన్ని సృష్టించిం దని చెప్పవచ్చు. అళగిరి తీరుపై తీవ్ర ఆగ్రహానికి లోనైన కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. డీఎంకే బహిష్కృత నేతగా ముద్ర పడ్డ ఎంకే అళగిరి తదుపరి తన వేగాన్ని పెంచి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో డిఎంకేను చావు దెబ్బ తీసిందని చెప్పవచ్చు. తదుపరి పరిణామాలతో వెనక్కి తగ్గిన అళగిరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగేందుకు యత్నిం చారు. పలు మార్లు తన తండ్రి, అధినేత కరుణానిధి కలిసేందుకు యత్నించినా అనుమతి దక్కలేదు. చివరకు మౌనంగా ఉండటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన అళగిరి గత కొంత కాలంగా మీడియాకు దూరంగానే ఉం టూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెం బ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న డీఎంకే , అళగిరి సేవల్ని మళ్లీ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తమతో దోస్తికి ప్రధాన పార్టీలు కలిసి రాని దృష్ట్యా, ఒక వేళ కాంగ్రెస్ వస్తేకలుపుకోవడం లేదా , ఒంటరిగా నైనా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు అధినేత కరుణానిధి వ్యూహ రచనలు చేసి ఉన్నారని చెప్పవచ్చు. ఈ సమయంలో అళగిరి వెన్నం టి ఉంటే, దక్షిణ తమిళనాడులో కొంత మేరకు లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని పలువురు కరుణానిధి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇదే విషయాన్ని కుటుంబీకులు సైతం కరుణానిధి దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కుటుంబీకులు ఒత్తిడి, తాజా పరిణామా ల్ని పరిగణలోకి తీసుకున్న కరుణానిధి అళగిరిని ఆహ్వానించేందుకు అంగీకా రం తెలిపినట్టు సమాచారం. దళపతి స్టాలిన్‌తో అంగీకరించినట్టు, చివరకు కరుఔ తుది నిర్ణయానికే కట్టుబడుతాననని తేల్చినట్టు సమాచారం. కరుణ తీసుకునే ఏ నిర్ణయాని కైనా కట్టుబడే మనస్తత్వం స్టాలిన్దని చెప్పవచ్చు. -
అళగిరి కొత్త అడుగు
చెన్నై : డీఎంకేలో మరో మారు ప్రకంపన సృష్టించే విధంగా బహిష్కృత నేత అళగిరి అడుగులు వేస్తున్నారు. రెండు నెలల్లో సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు స్వయంగా అళగిరి వెళ్లడించడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. గోపాల పురంలో తనకు అనుమతి కరువు కావడంపై అళగిరి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. డీఎంకే నుంచి అధినేత ఎం కరుణానిధి తనయుడు అళగిరిని బహిష్కరించిన విషయం తెలిసిందే. మళ్లీ తనను అక్కున చేర్చుకుంటారన్న ఆశ అళగిరిలో ఉన్నా, అందుకు తగ్గ సమయం మాత్రం రావడం లేదు. అయితే, రాను రాను ఆ ఆశలు అళగిరిలో సన్నగిల్లుతున్నట్టున్నాయి. కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉన్న అళగిరి మళ్లీ తన విమర్శలు, ఆరోపణాస్త్రాల్ని సంధించే పనిలో పడ్డారు. ప్రధానంగా స్టాలిన్‌కు వ్యతిరేకంగా మళ్లీ విరుచుకు పడే పనిలో పడ్డారు. హాంకాంగ్‌కు వెళ్లే సమయంలో గత వారం స్టాలిన్‌పై తీవ్రంగా స్పందించిన అళగిరి అక్కడి నుంచి మంగళవారం చెన్నై చేరుకోగానే సంచనల వ్యాఖ్య చేసి మదురైకు చెక్కేశారు. అనుమతి కరువు : పార్టీ నుంచి బహిష్కరించినా యథా ప్రకారం తరచూ చెన్నైకు వచ్చినప్పుడల్లా గోపాల పురంకు అళగిరి వెళ్తూ వచ్చారు. అయితే, ఆయనకు అధినేత, తండ్రి కరుణానిధి ప్రసన్నం మాత్రం దక్కడం లేదని చెప్పవచ్చు. దీంతో తన తల్లి దయాళు అమ్మాల్‌తో మాట్లాడటం, తన ఆవేదనను వెల్గక్కడం మదురైకు వెళ్లి పోవడం చేస్తూ వచ్చారు. అయితే, విదేశాల నుంచి చెన్నైకు వచ్చిన అళగిరి తనకు ఏదైనా శుభవార్త దక్కుతుందని ఎదురు చూసి భంగ పడక తప్పలేదు. తన తల్లి దయాళు అమ్మాల్‌ను కలుసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. కరుణానిధి అనుమతి కూడా దక్కక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టున్నారు. మదురై వెళ్తూ చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో కొత్త అడుగు వేయబోతున్నట్టు ప్రకటించి విమానం ఎక్కేయడం గమనార్హం. రెండు నెలల్లో : అళగిరి విమానాశ్రయానికి రావడంతో మీడియా ఆయన్ను చుట్టుముట్టింది. తన తల్లిదండ్రుల్ని కలిసేందుకు వచ్చానని, వీలు పడక పోవడంతో తిరిగీ వెళ్తున్నట్టు పేర్కొన్నారు. స్టాలిన్‌ను ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశానని, అందులో ఎలాంటి మార్పులేదన్నారు. డీఎంకే అంటే కరుణానిధి, కరుణానిధి అంటే డిఎంకే మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన స్థానంలో మరొకర్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. రెండు నెలల్లో కొత్త నిర్ణయం, ప్రకటన వెలువరిస్తానని అంత వరకు వేచి ఉండంటూ, భద్రతా సిబ్బంది సాయంతో మీడియాను దాటుకుంటూ మదురైకు చెక్కేశారు. అయితే, రెండు నెలల్లో అళగిరి ఏ నిర్ణయం వెల్లడించబోతున్నారు. ఆయన చేయబోయే ప్రకటన ఏమిటీ..? ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనన్న చర్చ డీఎంకేలో బయలు దేరి ఉన్నది. అదే సమయంలో స్టాలిన్ వ్యతిరేక శక్తులు మళ్లీ అళగిరి పక్షాన చేరి, పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తారా.? అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు ఉదాహరణగా లోక్ సభ ఎన్నికల సమయంలో అళగిరి వ్యవహరించిన తీరు ఓ నిదర్శనం. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అళగిరి రెండు నెలల తర్వాత ప్రకటన ఎలా ఉంటుందోనన్నది వేచి చూడాల్సిందే. -
అన్నయ్య కోసం!
పెద్దన్నయ్య అళగిరిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని తండ్రి కరుణానిధిపై ఒత్తిడి తెచ్చేపనిలో గారాల పట్టి కనిమొళి నిమగ్నమయ్యారు. ఈ విషయంపై ఆమె గంటకు పైగా తన తండ్రితో భేటీ అయినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే అన్నయ్య ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాల్సిం దేనని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇప్పుడు డీఎంకేలో దీనిపైనే చర్చసాగుతున్నట్టు తెలుస్తోంది. చెన్నై : డీఎంకేలో అన్నదమ్ములు అళగిరి, స్టాలిన్ మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితుల్ని చక్కదిద్దే పనిలోపడ్డ అధినేత కరుణానిధి మళ్లీ అళగిరిని పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. అళగిరితో సాగిన రాయబారాలు బెడిసికొట్టడంతో ఆయన్ను మళ్లీ ఆహ్వానించాలా? అన్న సందిగ్దతలో డీఎంకే శ్రేణులు పడ్డాయి. ఇందుకు అద్దంపట్టే రీతిలో రెండు రోజుల క్రితం అళగిరి డీఎంకే అధిష్టానంపై విరుచుకుపడ్డారు. స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు అళగిరికి, పార్టీకి మధ్య మరింత ఆగాదాన్ని సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. పార్టీలోకి అళగిరిని మళ్లీ ఆహ్వానించబోమన్న స్పష్టమైన హామీని కరుణానిధి నుంచి స్టాలిన్ తీసుకున్నట్టుగా, అందుకే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున సీఎం అభ్యర్థి కరుణానిధి ఉంటారన్న వ్యాఖ్యను స్టాలిన్ చేసినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అళగిరిని పార్టీలోకి ఆహ్వానిస్తే, ఎక్కడ స్టాలిన్ అలక వహిస్తాడోనన్న ఆందోళనలోపడ్డ కరుణానిధి ఆ ప్రయత్నాల్ని విరమించుకునేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్దన్నయ్యకు అండగా నిలబడేందుకు కరుణ గారాల పట్టి కనిమొళి సిద్ధమైనట్టు ఉన్నారు. కరుణానిధిని బుజ్జగిం చేందుకు అన్నయ్య తరపున రాయబారం సాగించేందుకు రెడీ అయ్యారన్న ప్రచారం డీఎంకేలో సాగుతోంది. ‘కని’ రాయబారం ఎప్పుడూ కనిమొళి ఇంటిమెట్లు ఎక్కని అళగిరి పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తొలిసారిగా అడుగు పెట్టారని చెప్పవచ్చు. తన ఆవేదనను అంతా చెల్లెమ్మ వద్ద అళగిరి ఇటీవల వెళ్లగక్కారు. మదురైకు వెళ్లిన సందర్భంలో అన్నయ్యన్ను కనిమొళి ఓదార్చిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో అళగిరి ఎక్కడ శాశ్వతంగా పార్టీకి దూరమవుతారోనన్న ఆందోళనలో పడ్డ కనిమొళి, మళ్లీ ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతల్ని తన భుజాన వేసుకుని ఉన్నారన్న ప్రచారం డీఎంకేలో జోరందుకుంది. కరుణానిధితో ఈ విషయంగా గంటకు పైగా కనిమొళి భేటీ అయినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే అన్నయ్యను పార్టీలోకి ఆహ్వానించాల్సిందేనని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అన్నయ్య మళ్లీ పార్టీలోకి రాక కోసం కొన్ని పార్టీలు సైతం ఎదురు చూస్తున్నాయన్న విషయాన్ని కరుణ దృష్టికి తీసుకెళ్లినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కరుణానిధి సీఎం అన్న ప్రకటనను స్వయంగా చిన్నన్నయ్య స్టాలిన్ చేయబట్టే, అదే రోజు ఎండీఎంకే నేత వైగో మిత్రులతో కూటమికి రెడీ అన్న సంకేతాన్ని పంపించారన్న విషయాన్ని గుర్తెరగాలని ఆమె సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎండీఎంకే నేతలతో పాటు దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న నాడార్లు, ఉత్తర తమిళనాడులో బలంగా ఉన్న వన్నియర్లు, సెంట్రల్ తమిళనాడులోని ముత్తయ్యార్ సామాజిక వర్గాల నాయకులు డీఎంకే వైపు చూస్తున్నారన్న విషయాన్ని వివరించి ఉన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆ వర్గాలకు న్యాయం చేకూర్చే రీతిలో నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పెద్దన్నయ్యను మళ్లీ ఆహ్వానించాలని కరుణానిధిపై కనిమొళి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. తనకు కనిమొళి గారాల పట్టి కావడంతో అళగిరిమీద ఉన్న కోపాన్ని కరుణానిధి దిగమింగి, ఎన్నికలు సమీపించనీ.. చూద్దామన్న హామీని ఆమెకు ఇచ్చినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
అళగిరి రివర్స్ గేర్
పార్టీలోకి మళ్లీ ఆహ్వానించేందుకు ఓ వైపు కసరత్తులు జరుగుతుంటే, మరో వైపు రివర్స్ గేర్ వేస్తూ అధిష్టానంపై అళగిరి సంచలన వ్యాఖ్యలు చేయడం డీఎంకేలో మళ్లీ చర్చకు తెర లేపింది. డీఎంకేతో సామరస్యం ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ అర్హతలున్నాయని నాయకత్వానికి స్టాలిన్ పాకులాడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరుణానిధిని కలిసేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై:డీఎంకేలో సాగుతున్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలు నేర్పిన గుణపాఠంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీలో సమూల మార్పుల లక్ష్యంగా అధినేత కరుణానిధి కుస్తీలు పడుతున్నారు. పార్టీలో సాగుతున్న వివాదాలకు ముగింపు పలికే విధంగా కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు. ఇందులో ప్రధాన అంశంగా ఉన్న అళగిరి ఎపిసోడ్‌కు శుభం కార్డు వేయడానికి పావులు కదుపుతున్నారు. బహిష్కరణకు గురైన పెద్దకుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరిని మళ్లీ పార్టీలోకి రప్పించే విధంగా రాయబారాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా అధిష్టానం ముందు అళగిరి కొన్ని డిమాండ్లు ఉంచారు. అలాగే, సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న సూచనను దూతలు అళగిరి ముందు ఉంచారు. అన్నీ సజావుగా సాగుతున్న సమయంలో అళగిరి సంచలన వ్యాఖ్యలు చేయడం డీఎంకే వర్గాల్ని విస్మయంలో పడేశాయి. స్టాలిన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ వ్యాఖ్యల వెనుక తన డిమాండ్లకు డీఎంకే అధిష్టానం దిగి రాలేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఏ అర్హతలున్నాయ్...: బుధవారం అళగిరి మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, అటు అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటు స్టాలిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎంకేలో కరుణానిధిని తప్ప మరెవ్వరినీ అధి నాయకుడిగా ఏ కార్యకర్త అంగీకరించడని పేర్కొన్నారు. ఏ అర్హతలున్నాయని స్టాలిన్ నాయకత్వం కోసం వెంపర్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. కరుణానిధి నాయకత్వంలో డీఎంకే 2016లో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అన్న విషయాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని మళ్లీ పార్టీ సమావేశంలో స్టాలిన్ గుర్తు చేశారేగానీ, కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదని మండిపడ్డారు. ఎలాంటి అర్హతలు లేని స్టాలిన్ నాయకత్వాన్ని పార్టీలో ఏ ఒక్కరూ అంగీకరించే ప్రసక్తే లేదని శివాలెత్తారు. తాను మాత్రం డీఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో సామరస్యానికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చే శారు. తన డిమాండ్లను డీఎంకే అధిష్టానం ముందు ఉంచానని, వాటిని నెరవేర్చాల్సింది వాళ్లే అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సామరస్యం ప్రసక్తే లేదని, ఎవరొచ్చినా, తన నిర్ణయం ఇదేనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరుణానిధిని కూడా కలిసేది లేదని స్పష్టం చేశారు. డీఎంకే సంస్థాగత ఎన్నికలన్నీ బోగస్‌గా తేల్చారు. నిజమైన కార్యకర్తలకు పదవులు దక్కలేదని, కొత్తగా వచ్చిన వాళ్లకు, ధన బలం ఉన్న వాళ్లకే సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కాయని ఆరోపించారు. పార్టీలో నిజమైన సేవకులకు చోటు లేదని, నిజాయితీగా వ్యవహరిస్తే, క్రమ శిక్షణవేటు వేస్తున్నారని మండి పడ్డారు. తన కోసం నిలబడిన వారు ఎందరో డీఎంకే బాధితులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. అళగిరి తాజా వ్యాఖ్యలతో డీఎంకేలో మళ్లీ ప్రకంపన బయలు దేరినట్టే. ప్రక్షాళన వేళ మరో శిరోభారం నెత్తికెక్కడంతో అధినేత కరుణానిధి ఎలా వ్యవహరించనున్నారో వేచి చూడాల్సిందే. -
లైన్ క్లియర్!
సాక్షి, చెన్నై :డీఎంకేలో అళగిరి, స్టాలిన్ల మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీలో నెలకొన్న పరిస్థితులతో అళగిరిని మళ్లీ ఆహ్వానించే రీతిలో కసరత్తులు ఆరంభమయ్యాయి. అధినేత కరుణానిధితో అళగిరి మద్దతుదారుడు కేపీ రామలింగం భేటీ సామరస్యానికి దారి తీసింది. దీంతో మళ్లీ అళగిరి డీఎంకేలో చేరనున్నారన్న ప్రచారం వేగం పుంజుకుంది. అదే సమయంలో అళగిరి మళ్లీ పార్టీలోకి వస్తే స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ప్రచారం సాగింది. అయితే, అళగిరి మళ్లీ పార్టీలోకి రావడంపై స్టాలిన్‌కు ఎలాంటి ఆక్షేపణ లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి స్టాలిన్ అడుగులు వేస్తుంటారు. ఆ దిశగానే అళగిరి విషయంలోను తన పంథాను మార్చినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సంకేతాలు: అళగిరి మద్దతు దారుడు కేపీ రామలింగం సీఐటీ నగర్‌లోని కరుణానిధి ఇంటిమెట్లు ఎక్కనున్నారన్న విషయం ముందుగానే స్టాలిన్‌కు తెలుసన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం గత వారం తన పెళ్లి రోజున తండ్రి కరుణానిధి ఆశీస్సులు అందుకున్న సమయంలోనే అళగిరి ప్రవేశానికి స్టాలిన్ లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. అళగిరిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే విషయంగా కరుణానిధి సంధించిన ప్రశ్నకు తనకు ఎలాంటి ఆక్షేపణ లేదంటూ స్టాలిన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తరువాత కరుణానిధి తదుపరి అడుగు లు వేసినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా కరుణానిధి రచిస్తున్న వ్యూహం తోనే అళగిరి విషయంలో స్టాలిన్ ఓ అడుగు వెనక్కు వేసినట్టు ప్రచారం సాగుతోంది. తమ్ముడు స్టాలిన్ రూట్ క్లియర్ చేయడంతో అన్నయ్య అళగిరికి గోపాలపురం మెట్లు ఎక్కేందుకు ఆహ్వానం వస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి. వినాయక చవితి అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో కరుణానిధిని అళగిరి కలుసుకునేందుకు నిర్ణయించినట్టు, ఇందుకు పెద్దాయన సైతం అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ సంప్రదింపుల అనంతరం అధికారికంగా అళగిరికి మళ్లీ పార్టీలోకి ఆహ్వానం రాబోతున్నది. తదనంతరం అన్నదమ్ముళ్లు ఇద్దరు మళ్లీ చేతులు కలపడం ఖాయం అని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
సంధికి యత్నం!
సాక్షి, చెన్నై : డీఎంకేలో అన్నదమ్ముళ్ల మధ్య సాగుతూ వచ్చిన వారసత్వ పోరు ఇటీవల ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డీఎంకే నుంచి అళగిరిని బహిష్కరించారు. దీంతో స్టాలిన్‌ను టార్గెట్ చేసి అళగిరి ఆరోపణాస్త్రాలను సంధిస్తూ వస్తున్నారు. డీఎంకే అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూ, అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పావులు కదిపే పనిలో ఆయన పడ్డారు. ఇది డీఎంకే అధిష్టానానికి శిరోభారంగా మారింది. అళగిరి చర్యలు ఎక్కడ పార్టీ అభ్యర్థులకు గడ్డు పరిస్థితులను సృష్టిస్తాయోనన్న బెంగ నెలకొంది. అదే సమయంలో తన స్వరం పెంచడం ద్వారానైనా డీఎంకే అధిష్టానం దిగి వస్తుందన్న ధీమాతో అళగిరి ఉన్నట్టుగా ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. వేరు కుంపటి పెట్టను, డీఎంకేను చీల్చను, కరుణానిధిని మాత్రం రక్షించు కుంటానంటూ చెప్పుకొచ్చిన అళగిరి తన దూతను ఆయన వద్దకు రాయబారం సాగించేందుకు పంపిన విషయం వెలుగు చూసింది. రాయబారం : తన మద్దతుదారుడు, పార్టీ వ్యవసాయ విభాగం నేత కేపీ రామలింగంను అళగిరి ఠదూతగా ఎంపిక చేసుకున్నారు. కరుణానిధి వద్దకు ధైర్యంగా వెళ్లగల నేత రామలింగం కావడంతో ఆయన్ను ఎంపిక చేసుకుంటే, తాను ఆశించినవి జరగొచ్చన్న ధీమాతో అళగిరి ఉన్నట్టున్నారు. ఈరోడ్‌లో మంగళవారం ప్రచారం నిర్వహించిన కరుణానిధిని కేపీ రామలింగం కలుసుకున్నట్టు తెలిసింది. గురువారం మదురైలో పర్యటించనున్న దృష్ట్యా, పెద్దకుమారుడు అళగిరి ఇంటికి వెళ్దామా? అన్నట్టుగా కేపీ రామలింగం వేసిన బాణం కరుణకు చిర్రెత్తించినట్టు సమాచారం. తానెందుకు వెళ్లాలి? అని రామలింగంను కరుణ ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయన వైపు ఉన్న న్యాయం కూడా చూడాలిగా అంటూ పరోక్షంగా కేపీ ఇచ్చిన సమాధానంతో కరుణానిధి ఆగ్రహానికి లోనైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలయ్యే వరకు ఓపిక పట్టాలని చెబితే, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, డీఎంకేను చీల్చిన బద్ద శత్రువు వైగోను ఆహ్వానించడం ఏమిటంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అలాగే, కేపీ రామలింగం తీరును ఎండగడుతూ తీవ్రంగా క్లాస్ పీకినట్టు డీఎంకే వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అళగిరితో కలసి తమరు ఒలకబెడుతున్నదేంటో తనకు తెలుసని, పంథా మార్చుకోకుంటే, అందరికీ వేటు పడుతుందని రామలింగంను హెచ్చరించి పంపారు. అయితే, కరుణానిధి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆగ్రహంగా ఉన్నా, ఎన్నికలయ్యే వరకు ఓపిక పట్టరా?, పంథా మార్చుకోండంటూ ఆయన చేసిన హెచ్చరికను అళగిరి పరిగణనలోకి తీసుకున్నట్టున్నారు. తన పంథాను మార్చుకోవడంతో పాటుగా ఎన్నికలయ్యే వరకు ఓపిక పట్టేందుకు సిద్ధమైనట్టుంది. బుధవారం అళగిరి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. మారిన స్వరం : ఇన్నాళ్లు స్టాలిన్‌ను టార్గెట్ చేసిన ఘాటైన పదాల్ని ఉపయోగిస్తూ వచ్చిన అళగిరి బుధవారం స్వరం మార్చారు. తేనిలో మీడియాతో మాట్లాడిన అళగిరి సిద్ధాంత పరంగా తామిద్దరం వేర్వేరు అని వ్యాఖ్యానించారు. సిద్ధాంత పరంగా తామిద్దరు ఢీ కొడుతున్నామేగానీ, స్టాలిన్ తన తమ్ముడన్న విషయాన్ని గుర్తుంచుకోండని మీడియాకు హితవు పలికారు. ఆయనతో తనకు ఉన్న బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని, అన్నదమ్ముళ్ల బంధం అంటే అదే అని వ్యాఖ్యానించి అందర్నీ విస్మయంలో పడేశారు. కరుణానిధి లేకుంటే, డీఎంకే లేదని, తాను కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని ముందుకు కదిలారు. అదే సమయంలో తేని ఎండీఎంకే అభ్యర్థి అళగు సుందరం, కాంగ్రెస్ అభ్యర్థి జేఎం హారుల్ అళగిరికి ఎదురు పడ్డారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరగా, అళగిరి చిరునవ్వుతో ముందుకు సాగడం గమనార్హం. అయితే, అళగిరిలో ఉన్నట్టుండి బంధం గుర్తుకు రావడం వెనుక స్టాలిన్‌కు లభిస్తున్న ఆదరణ కారణం అని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణాదిలో అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణుల పనితీరు అస్తవ్యస్థంగా ఉండటం డీఎంకేకు కలిసి వస్తున్నట్టుగా వస్తున్న సంకేతాలతోనే స్వరం మార్చే పనిలో అళగిరి ఉన్నట్టున్నారని డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. అయితే, అళగిరి దిగి వచ్చినా, కరుణానిధి ఆదరించేనా? స్టాలిన్ అక్కున చేర్చుకునేనా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. -
అన్నయ్య వస్తే ఆంతర్యమా?
డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి భేటీ గురించి కరుణానిధి గారాల పట్టి కనిమొళి పెదవి విప్పారు. అన్నయ్య కలిసిన మాట వాస్తవమేనని, కుశల ప్రశ్నలు, ఆరోగ్య క్షేమాల గురించి మాత్రమే తనతో అళగిరి వాకబు చే శారని, అందులో ఆంతర్యమేమీ లేదని వివరించారు. శనివారం ప్రచారబాట పట్టే ముందుగా మీడియాతో కనిమొళి మాట్లాడారు. సాక్షి, చెన్నై:డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఓ వైపు ఎంకే స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో ఉన్నారు. మరో వైపు తాను సైతం అంటూ అధినేత ఎం కరుణానిధి ప్రచారానికి కదిలారు. వయోభారాన్ని పక్కన పెట్టి రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రచార సభల రూపంలో కరుణానిధి ముందుకు సాగుతున్నారు. ఇది వరకు ఎన్నికల ప్రచారాలకు ప్రత్యక్షంగా వెళ్లని కరుణానిధి గారాల పట్టి కనిమొళి తాజాగా అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు సిద్ధం అయ్యారు. శనివారం దక్షిణ చెన్నైలోని తమ పార్టీ అభ్యర్థి టీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతుగా ఓట్ల వేటతో ప్రచారానికి కనిమొళి శ్రీకారం చుట్టారు. సీఐటీ కాలనీలోని తన నివాసం నుంచి బయలు దేరే ముందుగా ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు కనిమొళి సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా గతం వారం తన పెద్ద అన్నయ్య, డీఎంకే బహిష్కృత నేత అళగిరి తనతో భేటీ కావడం గురించి పెదవి విప్పారు. ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో కనిమొళి ఇంటికి అళగిరి స్వయంగా వెళ్లడంతో ఆంతర్యాన్ని కని పెట్టే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. అయితే, ఇందులో ఎలాంటి రాజకీయం లేదంటూ కనిమొళి స్పష్టం చేశారు. అళగిరి భేటీలో ఆంతర్యమేమిటో..? చెల్లెమ్మను అన్నయ్య కలవడంలో ఆంతర్యం ఉంటుందా? పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించారే? ఆ విషయం ప్రస్తావనకు రాలేదా..? లేదు. కేవలం నా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కుశల ప్రశ్నలు వేసుకున్నాం. సర్వేలు అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉన్నట్టుందే? ఒక్కో సర్వే ఒక్కొకటి చెబుతోంది. తొలుత అన్నాడీఎంకేకు 30 స్థానాలు తథ్యం అని సర్వేలు చెప్పాయి. ఇప్పుడు అదే సర్వేలు 18 నుంచి 20లోపే అంటున్నాయి. ఎన్నికల నాటికి ఆ సంఖ్య మరికొన్ని తగ్గడం తథ్యం. అదెలా తగ్గుతాయో? తమ అధినేత కరుణానిధి ప్రచార బాట పట్టే సరికి సర్వేల్లోను సంఖ్యలు మారాయి. ఇప్పుడు ఆయన సుడిగాలి పర్యటనతో ప్రజల్లోకి వెళ్లారు. అధినేత రాకతో అభ్యర్థుల్లో బలం పెరిగింది. ఎన్నికల నాటికి అన్నాడీఎంకే సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఇది మరో సర్వేతో స్పష్టం అవుతుంది. మీ మీద, మీ ఎంపీ రాజా మీద ‘2జీ’అవినీతి ఆరోపణ లు ఉన్నాయే?మరి ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు..? ఇలాంటి ఆరోపణల వెనుక రాజకీయ కారణాలు ఉంటారుు. మా విషయంలో అదే జరిగింది. నిజాలు ఏదో ఒక రోజు బయటకు వచ్చి తీరుతాయి. తాము నిర్దోషులం అని తేలుతుంది. మా మీద మోపిన నిందల గురించే అందరూ ప్రస్తావిస్తున్నారేగానీ, ఏళ్ల తరబడి బెంగళూరు కోర్టులో వాయిదాల మీద వాయిదాలతో సాగుతున్న ఆమె(జయలలిత) అవినీతి కేసు గురించి పట్టించుకోరా? ఎవరు మంచి వాళ్లో, చెడ్డ వారో ప్రజలకు తెలుసు. మీ అభ్యర్థులందరూ కోటీశ్వరులేనట? ఒకరిద్దరు మాత్రమే కోటీశ్వరులు ఉండొచ్చు. మిగిలిన వారందరూ చదువుకున్న విద్యావంతులు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. ఈలం తమిళుల విషయంలో డీఎంకే కపటనాటకం ప్రదర్శించ లేదా? ఆ అవసరం తమకేంటి. ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా ఆ నాటి నుంచి ఉద్యమిస్తున్నదని కలైంజర్ కరుణానిధి. కేంద్రంలోని యూపీఏతో తరచూ ఢీ కొట్టారు. ఆయన ఒత్తిడి మేరకు రెండు సార్లు శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానాలకు ఐక్యరాజ్య సమితిలో భారత్ మద్దతు ఇచ్చింది. తాము ప్రస్తుతం ఆ కూటమిలో లేనప్పటికీ, ఒత్తిడి తెచ్చాం. అయితే, కేంద్రం శ్రీలంకకు వత్తాసు పలికింది. ఇదెలా కపట నాటకం అవుతుంది. ప్రచారంలో తమరి అస్త్రం? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు. సుపరి పాలన పేరుతో సాగుతున్న అవినీతి బండారాలు. ప్రజల్ని మభ్య పెట్టే విధంగా సాగుతున్న ప్రకటన, ఉత్తర్వుల వ్యవహారాలు. విద్యుత్ సంక్షోభం డీఎంకే ఘనత కాదంటారా..? ఇది ముమ్మాటికి తప్పుడు సంకేతం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కలైంజర్ అనేక విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అన్నీ పూర్తి కావచ్చిన సమయానికి అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టింది. ఆ పథకాల్ని కొనసాగించి ఉంటే, సంక్షోభం ఉండేది కాదు. కొత్త ప్రాజెక్టులంటూ, తమ ప్రాజెక్టులను పక్కన పెట్టడంతో గ్రామాలు అంధకారంలో మునిగి ఉన్నాయి. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు నిందల్ని మా మీద వేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. -
బాలుతో అళగిరి ఢీ
సాక్షి, చెన్నై : తంజావూరు లోక్‌సభ అభ్యర్థి, డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలును ఓడించడమే లక్ష్యంగా బహిష్కృత నేత అళగిరి ప్రయత్నాల్లో మునిగారు. పళని మాణిక్యం వర్గాన్ని ఏకం చేసి డిపాజిట్లు గల్లం తు చేయడానికి సిద్ధమవుతున్నారు. గురువారం అళగిరి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. డీఎంకే నుంచి అధినేత పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరిని శాశ్వతంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. తనను పార్టీ నుంచి బహిష్కరించడంతో అళగిరి తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. డీఎంకేను చీల్చనని, ప్రత్యేకంగా పార్టీని పెట్టనని స్పష్టం చేస్తున్న అళగిరి తన మద్దతుదారుల్ని, డీఎంకేలోని అసంతృప్తి వాదుల్ని ఏకం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలోని తన మద్దతుదారుల్ని కలుస్తున్న అళగిరి రోజుకో చోట సంచలన వ్యాఖ్య లు చేస్తున్నారు. ఇన్నాళ్లు స్టాలిన్‌ను టార్గెట్ చేసి ఆరోపణలు సంధించిన ఆయన తన దృష్టిని డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్‌బాలు మీద మరల్చారు. బాలుపై ఫైర్: దక్షిణాది కింగ్ మేకర్‌గా తన సత్తా ఏమిటో టీఆర్ బాలుకు రుచి చూపించేందుకు అళగిరి ఉరకలు తీస్తున్నారు. తంజావూరులో తన మిత్రుడు పళని మాణిక్యంను పక్కన పెట్టి టీఆర్ బాలును అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన జీర్ణిం చుకోలేకున్నారు. తంజావూరులో గురువారం ఆయ న మాట్లాడుతూ బాలు ఓటమి లక్ష్యంగా తన మద్దతుదారులకు, కేంద్ర మాజీ మంత్రి పళని మాణిక్యం వర్గానికి పిలుపునివ్వడం గమనార్హం. ఓడిద్దాం:డీఎంకేలో చిచ్చుకు ప్రధాన కారకుల్లో టీఆర్ బాలు కూడా ఉన్నాడని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో పార్టీకి చెందిన కేంద్ర మం త్రులపై గతంలో తప్పుడు ఫిర్యాదుల్ని అధిష్టానానికి చేరవేశారని ఆరోపించారు. ఇందుకు దయానిధి మారన్‌ను మధ్యవర్తిగా పెట్టుకున్నట్టు విమర్శిం చారు. పార్టీలో చిచ్చుపెట్టి వేడుక చూడడంతోపాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు సీట్లు రానివ్వకుండా చేశాడని మండిపడ్డారు. శ్రీపెరంబదూరులో గెలవనన్న విషయాన్ని తెలుసుకుని, పళని మాణిక్యం మీద ఉన్నది లేనిది నూరి పోసి సీటు రానివ్వకుండా చేశాడని ధ్వజమెత్తారు. ఆ స్థానాన్ని తన చేతిలోకి తీసుకుని విజయం సాధించాలని అనుకు న్నాడని, ఓటమి తప్పదని హెచ్చరించారు. అంద రూ ఒకే బాట, ఒకే నినాదంతో ముందుకు వెళ్లాలని, అప్పుడు బాలు ఓటమిని చూడొచ్చంటూ పరోక్షంగా ఆయనకు ఓట్లు వేయొద్దని మద్దతు దారులకు పిలుపునిచ్చారు. అలాగే షాజహాన్‌ను బంధించి అధికార పగ్గాల్ని ఔరంగజేబు ఎలా సొం తం చేసుకున్నాడో, అదే పరిస్థితి డీఎంకేలో నెలకొం దని ఆరోపించారు. కరుణానిధి షాజహన్ అని, స్టాలిన్ ఔరంగజేబు అంటూ ఎద్దేవా చేశారు. అధికారికంగా అందనీ: తంజావూరు పర్యటన ముగించుకుని మదురై వెళుతూ అళగిరి తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడారు. మద్దతుదారులందర్నీ కలుస్తున్నారు కదా అని ప్రశ్నించగా ముందుగా చెప్పానుగా అని సమాధానం దాట వేశారు. ఇందు లో ఆంతర్యమేమిటో అని ప్రశ్నించగా, నేను పార్టీ పెట్టబోనని, డీఎంకేను రక్షించుకుంటానని సమాధానమిచ్చారు. టీఆర్ బాలు తంజావూరులో గెలుస్తారా? అని ప్రశ్నించగా, దీనికి సమాధానం డీఎంకే వాళ్లను అడగండి, ఇప్పుడు ఆ పార్టీలో నేను లేనుగా అని పేర్కొన్నారు. డీఎంకేపై కేసు ఎప్పుడు వేస్తున్నారు..? అని ప్రశ్నించగా తనను పార్టీ నుంచి తొల గించినట్టు టీవీలు, పత్రికల్లో చూసి తెలుసుకున్నానని, అధికారికంగా తనకు ఎలాంటి లేఖ, ఉత్తర్వు లు రాలేదన్నారు. అవి చేతికి అందిన తర్వాత దాన్ని ఎవరు పంపించారో వారిపై కేసు వేస్తానంటూ స్పష్టం చేశారు. తమరి మద్దతు నాయకులు, సిట్టింగ్ ఎంపీలు రితీష్, నెపోలియన్లపై మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోన్నట్టుందే..? అని ప్రశ్నించగా, డీఎంకే అధిష్టానాన్ని అడగండి, ఎందు కు చర్యలు తీసుకోలేదో అని ఎదురు ప్రశ్న వేశారు. -
అళగిరి బహిష్కరణతో బీజేపీ సంబరం
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంబరపడ్డాడట. డీఎంకే నుంచి ఎంకే అళగిరిని బహిష్కరించడంతో తమిళనాట బీజేపీ, దాని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎండేఎంకే అధినేత వైగో, బీజేపీ నాయకుడు హెచ్.రాజా తదితరులు అళగిరిని కలిసి, లోక్‌సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. బహిరంగంగా అళగిరి ఈ మద్దతు విషయమై ఏమీ చెప్పకపోయినా.. ఆయన మద్దతుదారులు మాత్రం అటు డీఎంకేకు గానీ, ఇటు అన్నా డీఎంకేకు గానీ ఎటూ ఓట్లు వేయరు కాబట్టి ఆ ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ కూటమి భావిస్తోంది. అళగిరిని డీఎంకే నుంచి బహిష్కరించడం వల్ల తమకు అదనంగా కనీసం 30 వేల నుంచి 40 వేల వరకు ఓట్లు వస్తాయని బీజేపీ నాయకుడొకరు తన పేరు రాయొద్దంటూ చెప్పారు. ఈ ఓట్లు ఎక్కువగా దక్షిణ తమిళనాడు జిల్లాల నుంచే పడేలా ఉన్నాయి. అళగిరి ఇంతకుముందు డీఎంకే దక్షిణ మండలానికి కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన పదేపదే పార్టీ నాయకులను విమర్శిస్తూ, పార్టీ పరువు మంటగలుపుతుండటంతో పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే.. అళగిరి సమావేశాలకు వస్తున్న జనాన్ని చూసి డీఎంకే నాయకులు ఆశ్చర్యపోతున్నారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అళగిరి మద్దతుదారులు విడిగా పోటీచేసి, డీఎంకే ఓట్లను గణనీయంగా చీల్చేశారు. ఈసారి వాళ్లు ఏం కొంప ముంచుతారోనని డీఎంకే నాయకులు లోలోపలే ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
అళగిరికి ఉద్వాసన
డీఎంకే నుంచి బహిష్కరించినకరుణానిధి కోర్టుకు వెళతానని అళగిరి ప్రకటన సస్పెండ్ అయిన ఎంపీ, పార్టీ అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె.అళగిరిని డీఎంకే బహిష్కరించింది. అళగిరికి శాశ్వతంగా ఉద్వాసన పలుకుతున్నట్టు పార్టీ అధ్యక్షుడు కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్బళగన్ మంగళవారం ప్రకటించారు. పార్టీ వ్యతి రేక కార్యకలాపాలకు పాల్పడటం.. క్రమశిక్షణను ఉల్లంఘించడం వంటి కారణాలతో పార్టీ దక్షిణాది జిల్లాల కార్యదర్శిగా ఉన్న అళగిరిని కొద్దిరోజులక్రితం తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఎన్నికల్లో టికెట్ సైతం నిరాకరించారు. దీంతో స్వరం పెంచిన అళగిరి డీఎంకేకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. కోట్లు దండుకుని అభ్యర్థులకు సీట్లు ఇచ్చారని ఆరోపించడమే కాక పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తానని సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో తమకు మద్దతివ్వాలని కోరుతూ బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు మదురైలోని అళగిరి ఇంటి ముందు క్యూ కట్టారు. దీంతో తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ ఆయా పార్టీల అభ్యర్థులకు అళగిరి హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అళగిరి చర్యల్ని తీవ్రంగా పరిగణించిన డీఎంకే అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మంగళవారంమీడియాకు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై వివరణ ఇవ్వనందునే అళగిరిపై చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఇందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. కరుణానిధి బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో క్రమశిక్షణపై పార్టీ శ్రేణులకు హెచ్చరిక ఇచ్చేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బహిష్కరణపై కోర్టుకు వెళతా: అళగిరి తనను డీఎంకే నుంచి శాశ్వతంగా బహిష్కరించడంతో అళగిరి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమను బహిష్కరించినంత మాత్రాన తాను, తన మద్దతుదారులు పార్టీని వీడేది లేదని, దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్టు మంగళవారం మదురైలో ప్రకటించారు. పార్టీ తనను ఎలాంటి వివరణ కోరలేదని, ఆయా పార్టీల నాయకులు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తుంటే అందులో తన తప్పేముందని ప్రశ్నించారు. -
డీఎంకే నుంచి అళగిరి బహిష్కరణ
చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరిపై బహిష్కృత వేటు పడింది. డీఎంకే పార్టీ నుంచి అళగిరిని మంగళవారం కరుణానిధి బహిష్కరించారు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలోనే పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్‌తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతుదారులకు సీట్లు దక్కుతాయా? అని ఎదురు చూశారు. అయితే, స్టాలిన్ వర్గంపై చేయిగా నిలిచింది. దీంతో డీఎంకే అభ్యర్థులపై విమర్శలు, స్టాలిన్‌పై ఆరోపణాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు. సీట్ల కోసం కోట్లు దండుకున్నారంటూ ఆరోపించడం, దక్షిణాదిలో డీఎంకే డిపాజిట్లు గల్లంతు తథ్యం అన్న హెచ్చరికలు ఇస్తుండటం, ఇతర పార్టీల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది. దాంతో అళగిరి మద్దతు ఇవ్వాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే మినహా మిగతా పార్టీ నేతలు ఆయన నివాసానికి క్యూ కట్టారు. బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు నిన్న అళగిరిని కలుసుకుని మద్దతు ఇవ్వాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆయనపై డీఎంకే వేటు వేయటం గమనార్హం. -
అళగిరి ఇంట క్యూ
సాక్షి, చెన్నై: అయ్యా... మద్దతు ఇవ్వండి అంటూ అళగిరి ఇంటి వద్ద క్యూ కట్టే పనిలో రాజకీయ పక్షాలు పడ్డాయి. బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు అళగిరిని కలుసుకుని మద్దతు ఇవ్వాలని విన్నవించారు. డీఎంకే, అన్నాడీఎంకే మినహా తక్కిన పార్టీల వాళ్లంతా అళగిరి మద్దతు కోసం క్యూ కడుతుండడంతో మదురై రాజకీయం ఆసక్తికరంగా మారింది. మదురై అంటే ఆధ్యాత్మికంగా అరుుతే అందరికీ గుర్తుకు వచ్చేది మీనాక్షి అమ్మవారి ఆలయం.రాజకీయంగా అయితే, అళగిరి అడ్డా. ఇక్కడి నుంచే దక్షిణాది జిల్లాల్లో డీఎంకే కింగ్ మేకర్‌గా అళగిరి అవతరించారు. డీఎంకే అధికారంలో ఉన్నా,లేకున్నా సరే మదురై అడ్డాగా అళగిరి చక్రం తిప్పేవారు. అయితే, ఇప్పుడు ఆయన అవసరం డీఎంకేకు లేదు. అళగిరి కోటను దాదాపుగా దళపతి, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ చీల్చేయడం ఇందుకు ఓ ఉదాహరణ. దక్షిణాదిలో సగం మంది అళగిరి వెంట, మిగిలిన వారు స్టాలిన్ వెంట సాగుతున్నారు. ఈ ఆధిపత్య రాజకీయమే కరుణానిధి కుటుంబంలో చిచ్చు రేపుతూ వ చ్చింది. చివరకు ఇటీవల పార్టీ నుంచి అళగిరిని బిహ ష్కరించారు. ఆరోపణాస్త్రం: పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతుదారులకు సీట్లు దక్కుతాయా? అని ఎదురు చూశారు. అయితే, స్టాలిన్ వర్గంపై చేయిగా నిలిచింది. దీంతో డీఎంకే అభ్యర్థులపై విమర్శలు, స్టాలిన్‌పై ఆరోపణాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు. సీట్ల కోసం కోట్లు దండుకున్నారంటూ ఆరోపించడం, దక్షిణాదిలో డీఎంకే డిపాజిట్లు గల్లంతు తథ్యం అన్న హెచ్చరికలు ఇస్తుండటం, ఇతర పార్టీల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది. డీఎంకే అభ్యర్థులను అళగిరి వ్యతిరేకిస్తున్న దృష్ట్యా, ఆయన్ను ప్రసన్నం చేసుకుని, ఆయన మద్దతుదారుల ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు రాజకీయ పక్షాలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం అళగిరిని ఎండీఎంకే నేత వైగో కలిశారు. అనధికారికంగా అళగిరిని అనేక మంది కలుస్తున్నా, అధికారికంగా వైగో భేటీ కావడం చర్చకు దారితీసింది. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అళగిరి వర్గం మద్దతు ఎటో? అన్న ప్రశ్న బయలు దేరింది. డీఎంకేను, అధినేత కరుణానిధిని మాత్రం రక్షించుకుంటానని అళగిరి తేల్చిన దృష్ట్యా, ఆ పార్టీ అభ్యర్థులకు ఆయన ఆశీస్సులు ఇక లేనట్టేనని తేలింది. మద్దతు కోసం...: అళగిరిని కలిసి వైగో మద్దతు కోరారో లేదో ఉదయాన్నే అళగిరి ఇంటి వద్ద క్యూ పెరిగింది. వాతావరణం అంతా సందడి సందడిగా మారింది. సినీ తరహాలో అయ్యా...తమకంటే, తమకు మద్దతు ఇవ్వాలన్నట్టుగా రాజకీయ పక్షాల అభ్యర్థులు బారులు తీరారు. ఉదయాన్నే బీజేపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు, శివగంగై అభ్యర్థి హెచ్ రాజా అళగిరిని కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. శివైగంగైలో తన గెలుపు లక్ష్యంగా సహకారం అందించాలని విన్నవించారు. దక్షిణాది జిల్లాల్లోని లోక్ సభ బరిలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించే రీతిలో మద్దతు సంకేతం ఇవ్వాలని విన్నవించారు. వెలుపలకు వచ్చిన హెచ్ రాజా మీడియాతో మాట్లాడుతూ, అళగిరిని మర్యాద పూర్వకంగా కలిసినట్టు తెలిపారు. తమ అధినేత రాజ్ నాథ్ సింగ్‌తో ఆయన ఢిల్లీలో సమావేశం అయ్యారని, మోడీ పీఎంగా వస్తే ఆహ్వానిస్తామని అళగిరి గతంలో ప్రకటించిన విషయూన్ని గుర్తు చేశారు. అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడంతో పాటుగా, తమ గెలుపున కు మద్దతు ఇవ్వాలని వేడుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎండీఎంకే తేని అభ్యర్థి అలగు సుందరం అళగిరితో భేటీ అయ్యారు. తన గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు అళగిరిని కలిసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు సైతం అళగిరిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ప్రసన్నం: డీఎంకే అభ్యర్థులను ఓడించడం లక్ష్యంగా అళగిరి కంకణం కట్టుకున్న దృష్ట్యా, ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మదురైకు పయనం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన అళగిరి మద్దతు కోరే విషయాన్ని మదురైలో ప్రకటిస్తానన్నారు. మదురై కాంగ్రెస్ అభ్యర్థి సీఎన్ భరత్నాచ్చియప్పన్ మధ్యాహ్నం అళగిరిని కలిశారు. యువతకు పెద్ద పీట వేయాలని యువకుడైన భరత్ నాచ్చియప్పన్ అళగిరిని విజ్ఞప్తి చేశారు. దక్షిణాదిలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక శాతం మంది యువకులే ఉన్నారని మీడియాతో మాట్లాడుతూ భరత్ వివరించారు. కేంద్ర కేబినెట్లో పనిచేసిన మంత్రుల్లో అళగిరి ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. తాను మంత్రి పదవిలో లేనప్పటికీ, తనకు అవకాశం ఇచ్చినందుకు గాను ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేయడం ఆయన మనస్సుల్లో మంచితనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. మదురైలో తన గెలుపు కోసం అళగిరి మద్దతు తప్పని సరిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అళగిరికి మద్దతు వినతుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతున్నారుు.మదురై వేదికగా కింగ్ మేకర్ రాజకీయం రక్తికట్టిస్తోంది మరి. అళగిరి వార్తకు కలుపుకోవాలి మళ్లీ ఫైర్: డీఎంకే అభ్యర్థులపై అళగిరి మళ్లీ విరుచుకు పడ్డారు. ఉదయం నుంచి అళగిరిని పలు పార్టీల నాయకులు కలవడంతో సాయంత్రం ఆయన్ను మీడియా కలిసింది. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అని ప్రశ్నించగా, ముందే చెప్పానుగా మద్దతుదారుల భేటీ అనంతరం వెల్లడిస్తానన్నారు. డీఎంకే అభ్యర్థులు కోట్లు చల్లి మరీ సీట్లు తెచ్చుకున్నారని, వీరందరికీ ఓటర్లు గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. తెన్కాశి బరిలో నిలబడ్డ పుదియ తమిళగం నేత కృష్ణ స్వామిని ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి పనికి రాని ఆయనకు ఒక పదవి చాలదా? అని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మరొకరికి అవకాశం ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించారు. పార్టీ తన చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా చేస్తానని హెచ్చరించడం గమనార్హం. -
అమెరికాకు అళగిరి పయనం
చెన్నై : కొన్నాళ్లు అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణల నుంచి డీఎంకే వర్గాలు తప్పించుకోనున్నాయి. తన చుట్టూ సాగుతున్న తంతును చూసిన అళగిరి, ఇక్కడ ఉండటం కన్నా విదేశాలకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఏప్రిల్ 10న అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. డీఎంకేలో అధినేత కరుణానిధి పెద్దకుమారుడు ఎంకే అళగిరి ఎపిసోడ్ గురించి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణాస్త్రల్ని సంధిస్తూ వచ్చిన అళగిరి రెండు రోజుల క్రితం మదురై వేదికగా తన మద్దతుదారులతో భేటీ అయ్యారు. పార్టీ పెట్టబోతున్నట్టు, డీఎంకేను చీల్చనున్నట్టు సాగుతున్న ప్రచారాలకు బ్రేక్ వేస్తూ అళగిరి తన మదిలోని నిర్ణయాన్ని ప్రకటించారు. కరుణానిధిని, డీఎంకేను రక్షించుకోవడం తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే అళగిరి పార్టీ వర్గాలను గందరగోళంలోకి నెట్టే యత్నం చేస్తున్నారని, ఆయనతో జర భద్రం అంటూ డీఎంకే అధిష్టానం కార్యకర్తల్ని హెచ్చరించింది. అదే సమయంలో అళగిరితో మంతనాల్లో బిజిబిజీగా ఉన్న దక్షిణాది జిల్లాలోని పార్టీ నేతలపై డీఎంకే అధిష్టానం కన్నేసింది. వారి వివరాలను, అందుకు తగ్గ ఆధారాల్ని సేకరించి, వారిపై కొరడా ఝుళిపించే వ్యూహంతో ముందుకెళ్తోన్నది. ఈ పరిస్థితుల్లో జర భద్రం అంటూ డీఎంకే అధిష్టానం చేసిన హెచ్చరికకు స్పందించిన అళగిరి, తాను మాత్రం డీఎంకే పక్ష పాతినని చాటుకునే యత్నం చేశారు. విదేశాలకు తాను ఇక్కడ ఉండటం వల్లే లేని పోని ఆరోపణలు, ప్రచారాలు సాగుతుండడంతో కొన్నాళ్లు అందరికీ దూరంగా ఉండేందుకు అళగిరి నిర్ణయిం చినట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. పార్టీకి ఎన్నడూ ద్రోహం తలపెట్టనని అళగిరి స్పష్టం చేశారని, ఇలాంటి సమయంలో మద్దతుదారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనలో పెరిగిందంటున్నారు. ఎన్నికల వేళ తాను ఇక్కడే ఉంటే కొన్ని మీడియాలో పని గట్టుకుని మరీ తానేదో కుట్రలు చేస్తున్నట్టు, అభ్యర్థులను ఓడించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కట్టు కథలు అల్లడం ఖాయం అన్న విషయాన్ని అళగిరి గ్రహించి ఉన్నారు. దీంతో ఇక్కడుండడం కన్నా విదేశాలకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచా రం. పార్టీలో ఉన్న తన మద్దతుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పార్టీ కోసం వాళ్లు పనిచేసే రీతిలో తనంతట తాను కొన్నాళ్లు అందరికీ దూరంగా ఉండేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. 10న పయనం తరచూ అళగిరి అమెరికాకు వెళుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన కుమార్తె ఉన్నారు. ఆమెను చూసేందుకు వెళ్లినప్పుడల్లా నెలల తరబడి అక్కడే ఉండే వారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే వరకు తమిళనాడు వైపు తొంగి చూడని రీతిలో అమెరికాకు పయనం అయ్యేందుకు సిద్ధం అవుతోన్నారట!. ఏప్రిల్ పదో తేదీన ఆయన అమెరికా పయనం ఉంటుందని మద్దతుదారులు పేర్కొంటున్నారు. అదే రోజు నుంచి మూడు రోజుల పాటుగా మదురైలో తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి ఎన్నికల ప్రచారం నిమిత్తం తిష్ట వేయనుండడం గమనార్హం. ఇక్కడుంటే కరుణానిధిని పలకరించాల్సి ఉంటుందని, ఇక్కడ జరిగే పరిణామాలన్నింటిని తన మీదే రుద్దే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయంతో కరుణానిధి ఇక్కడికి వచ్చే రోజు ఉదయాన్నే చెన్నై లేదా ముంబై నుంచి అమెరికా వెళ్లడానికి అళగిరి పర్యటన సిద్ధం చేసుకుంటున్నారట! అళగిరి విదేశాలకు వెళ్లే యత్నంలో ఉన్న సమాచారంతో డీఎంకే లోక్ సభ అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నట్టు సమాచారం. ఆయన ఇక్కడుంటే విమర్శలతో తమ గెలుపునకు అడ్డు పడుతారోనన్న బెంగ నుంచి కాస్త ఊరట చెందుతున్నారు. -
అళగిరి తో జర భద్రం!
సాక్షి, చెన్నై: పార్టీ నుంచి ఎంకే అళగిరిని ఇటీవల డీఎంకే అధిష్టానం తాత్కాలికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చాక అళగిరి తన స్వరాన్ని పెంచుతూ వస్తున్నారు. మద్దతుదారులతో మంతనాల్లో బిజీబిజీగా ఉన్నారు. డీఎంకేను చీల్చే వ్యూహం తో దూసుకెళుతున్న అళగిరి రెండు రోజుల క్రితం మదురై వేదికగా జరిగిన మద్దతుదారుల మంతనాల అనంతరం తాను పార్టీ పెట్టబోనంటూ ప్రకటించారు. డీఎంకేను రక్షించుకోవడం, కరుణానిధికి అండగా నిలబడటం తన కర్తవ్యంగా ప్రకటించారు. కొందరి చెప్పు చేతుల్లోకి డీఎంకే వెళ్లిందని, వారి నుంచి పార్టీని రక్షించుకుందామని అళగిరి ఇచ్చిన పిలుపు డీఎంకే వర్గాల్ని ఆలోచనలో పడేసింది. పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి దుందుడుకు చర్యలు ఉండటం, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు రాక పోవడంతో అసంతృప్తితో ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునే విధంగా అళగిరి వ్యాఖ్యలు ఉండడంతో డీఎంకే అధిష్టానం మేల్కొంది. అదే సమయంలో డీఎంకే నుంచి ఆహ్వానం వస్తే, వెళ్లేందుకు తాను సిద్ధమంటూ పరోక్ష సంకేతాన్ని అళగిరి ఇవ్వడానికి పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో గందరగోళ పరిస్థితిని సృష్టించడం లక్ష్యంగా దక్షిణాది కింగ్ మేకర్ అళగిరి చక్రం తిప్పుతున్నట్టు అధిష్టానం గుర్తించింది. దీంతో కింగ్ మేకర్‌కు షాక్ ఇచ్చేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ద్వారా అధినేత కరుణానిధి హెచ్చరికలు జారీ చేశారు. జర భద్రం: బుధవారం డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఆదేశాల మేరకు అన్నా అరివాళయం వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. అందులో అళగిరిని టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. పార్టీలో గందరగోళం సృష్టించడం లక్ష్యంగా, పార్టీ వర్గాల్ని పక్కదారి పట్టించే రీతి లో అళగిరి చర్యలు ఉన్నాయని వివరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతోనే అళగిరిని తాత్కాలికంగా బహిష్కరించామని గుర్తు చేశారు. అయితే, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతోపాటుగా, పార్టీలో గందరగోళం సృష్టించే లక్ష్యంగా ఆయన ముందుకెళుతున్నట్టు పేర్కొన్నారు. పార్టీతో అళగిరికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంతనాలు, సమావేశాల పేరుతో పార్టీ నాయకులను, కార్యకర్తలను అళగిరి కలుస్తూ వస్తున్నట్టుగా అధిష్టానం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అళగిరి చర్యలు పార్టీకి నష్టం తెప్పించే అవకాశాలు ఉన్నాయని, దీన్ని గుర్తెరిగి ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యవహరించాలని సూచించారు. మరో మారు స్పష్టం చేస్తున్నామని అళగిరికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన పిలుపు మేరకు సమావేశాలు, సభలకు పార్టీ వర్గాలెవ్వరు వెళ్లడానికి వీలు లేదని హెచ్చరించారు. ఒక వేళ ఎవరైనా వెళ్లినట్టు తేలిన పక్షంలో క్రమ శిక్షణ చర్యలు తప్పదని, వారెంతటి వారైనా సరే ఉపేక్షించబోమన్నారు. అరుుతే అధిష్టానం హెచ్చరికతో అళగిరి స్పందిస్తూ, తాను డీఎంకే వ్యతిరేకిని కాను అని స్పష్టం చేశారు. -
కరుణానిధికి పార్టీలో వేధింపులు
మధురై: డీఎంకే పార్టీ బహిష్కృత నేత అళగిరి మరోమారు ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి అయిన కరుణానిధిని పార్టీలో కొన్ని శక్తులు వేధింపులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. తన తండ్రి అధ్యక్ష స్థానానికి భంగం వాటిల్లే విధంగా వారు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో భాగంగానే ఆయన్ను పార్టీ సమావేశాలకు దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు. ఆయన సోమవారం మద్దతుదారులతో సమావేశం అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొన్ని శక్తులు కొన్ని శక్తులు కరుణానిధిని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నఆయన ముందుగా తన సొంత నియోజకవర్గం మదురైలో తన మద్దతుదారులతో సమావేశం అవుతూ పార్టీ పెడితే ఎలా ఉంటుందన్నదానిపై మంతనాలు జరుపుతున్నారు. క్రమశిక్షణ రాహిత్యం ఆరోపణలతో జనవరిలో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అళగిరి, పార్టీ పెట్టే విషయాన్నికొన్నిరోజుల క్రితమే సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటానంటారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికే కళైంగర్ డీఎంకే అనే పేరును కొత్త పార్టీకి పెడుతూ మదురైలో పోస్టర్లు కూడా వెలిశాయి. ఇంతకుముందే ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిసిన అళగిరి, ఆ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కూడా భేటీ అయ్యారు.అళగిరి వేరే పార్టీ ఆలోచన విరమించుకుని ఎవరైనా మద్దతు ఇస్తే మాత్రం డీఎంకే కోటకు బీటలు వారే అవకాశాలున్నాయి. అళగిరి కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో ఆయన తీవ్ర ప్రభావం చూపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కలైంజర్ డీఎంకే!
మదురైలో ఆదివారం పోస్టర్లు కలకలం రేపాయి. డీఎంకే వర్గాల్లో గుబులు పుట్టించే రీతిలో హంగామా సృష్టిస్తూ వీటిని అళగిరి మద్దతుదారులు సిద్ధం చేశారు. డీఎంకేను చీలుస్తూ కలైంజర్ డీఎంకే పేరిట పార్టీ ఆవిర్భావం అన్న నినాదాలను అందులో పొందు పరచడం చర్చకు దారి తీస్తున్నది. ఈ తంతు ఓ వైపు ఉంటే మరో వైపు సోమవారం తన మద్దతుదారులతో మంతనాలకు అళగిరి సిద్ధం అయ్యారు. సాక్షి, చెన్నై:డీఎంకే నుంచి అళగిరిని బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ తనను దూరం పెట్టినా, కలైంజర్ కరుణానిధి మాత్రం తన నాయకుడంటూ అళగిరి చెప్పుకొస్తున్నారు. కరుణానిధిని తప్ప మరొకరిని నాయకుడిగా అంగీకరించబోనని స్పష్టం చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా అళగిరి వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పతనం తప్పదని బల్ల గుద్ది మరీ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తన సత్తాను చాటుతానని హెచ్చరికలు చేస్తూ వచ్చిన అళగిరి గత వారం మీడియాకు చిక్కారు. పార్టీ పెట్టబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా లేదని సమాధానం ఇచ్చిన ఆయన తన మద్దతుదారుల అభీష్టమే తన నిర్ణయంగా ప్రకటించారు. జాతీయ స్థాయి నేతలతోపాటు, దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్‌తో ఆయన భేటీ కావడంలో ఆంతర్యమేమిటోనన్న ప్రశ్న బయలు దేరింది. రజనీ కాంత్‌తో భేటీ అనంతరం ఈనెల 17న మద్దతుదారులతో భేటీ కాబోతున్నట్టు, అందులో తీసుకునే నిర్ణయం మేరకు లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికోనన్నది ప్రకటిస్తానని అళగిరి స్పష్టం చేశారు. ఏర్పాట్లు: మద్దతుదారులతో భేటీకి అళగిరి నిర్ణయించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మదురైలో ఓ కల్యాణ మండపం వేదికగా సోమవారం మద్దతుదారులను కలుసుకునేందుకు అళగిరి సిద్ధం అయ్యారు. ఇందులో అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. మీడియూ అంతా మదురై వైపు చూస్తున్నది. అదే సమయంలో అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తమకు ఎలాంటి ఢోకా లేదని డీఎంకే వర్గాలు పైపైకి చెబుతున్నా, లోలోపల అళగిరి కార్యచరణపై నిఘా వేసి ఉన్నాయి. ఈ సమయంలో ఏకంగా పార్టీ పెట్టేద్దామని పిలుపునిస్తూ అళగిరి మద్దతుదారులు మదురైలో ఆదివారం హల్చల్ సృష్టించారు. పోస్టర్ల కలకలం: సోమవారం మద్దతుదారులతో అళగిరి మంతనాలకు సిద్ధం అవుతున్న సమయంలో ఆదివారం మదురైలో పోస్టర్లు కలకలం సృష్టించాయి. డీఎంకేను రెండుగా చీలుస్తూ, కలైంజర్ డీఎంకే పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. పార్టీని, జెండాను ప్రకటిచేద్దాం...లోక్ సభ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలబెట్టేద్దామన్న నినాదంతో వెలసిన ఈ పోస్టర్లపై డీఎంకే వర్గాలు దృష్టి కేంద్రీకరించారుు. కేవలం తమను బెదిరించేందుకు ఈ పోస్టర్లు వెలిశాయూ లేదా, అళగిరి పార్టీ పెట్టే నిర్ణయంతో ఉన్నారా..? అనే అన్వేషణలో మదురై డీఎంకే నాయకులు తలమునకలై ఉన్నారు. మద్దతుదారుల అభీష్టం మేరకు పార్టీ నిర్ణయం ఉంటుందని అళగిరి ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా, తాజాగా వెలసిన పోస్టర్లపైఅ ళగిరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
ఎలక్షన్ వాచ్
రజనీతో అళగిరి భేటీ సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు, బహిష్కృత నేత అళగిరి సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకోవడం తమిళనాట చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏ పార్టీతోనూ ప్రత్యక్ష సంబంధాలులేని అళగిరి తన కుమారుడు దురై దయానిధితో కలసి శుక్రవారం ఉదయం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు గడిపారు. తన కుమారుడు నిర్మించే తర్వాతి చిత్రంలో హీరోగా నటించాలని రజనీకాంత్‌ను అడిగేందుకు, తమ మధ్య రాజకీయాలపై చర్చ జరగలేదన్నారు. డీఎంకే ఒక మట్టి గుర్రమని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకటి లేదా రెండు స్థానాలు వస్తే గొప్పని వ్యాఖ్యానించారు. రజనీతో భేటీకి సంబంధించిన ఫొటోను అళగిరి కుమారుడు దురై దయానిధి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ..: మరోవైపు అళగిరి శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్యా సుమారు 45 నిమిషాల సేపు చర్చలు జరిగాయి. తాజా రాజాకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చేందుకు అళగిరి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే అళగిరికి రాజ్‌నాథ్ ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. బీజేపీ తీర్థం పుచ్చుకున్న శ్రీరాములు సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి బి.శ్రీరాములు శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చా రు. శ్రీరాములు మాట్లాడుతూ.. మోడీ ప్రధాని కావాల్సిన అవసరముందని, దీనికి తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరానని వెల్లడించారు. సుష్మా స్వరా జ్ తన చేరికను వ్యతిరేకించారనే వార్తలపై వివరణ ఇస్తూ, ఆమె సహా అందరి అంగీకారంతోనే బీజేపీలో చేరానన్నారు. సాంకేతిక కారణాల వల్ల బీఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీలో విలీనం కాలేదని మాజీ ఉపముఖ్యమంత్రి ఈశ్వరప్ప చెప్పారు. తాను తీవ్రంగా వ్యతిరేకించినా శ్రీరాములును పార్టీలో చేర్చుకున్నారని సుష్మ పేర్కొన్నారు. జైరాం రమేశ్ కోడ్ ఉల్లంఘించారు: బీజేపీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ పలు పథకాలు ప్రకటించి, ప్యాకేజీలకు హామీలివ్వడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. సీమాంధ్రకు రూ.50వేల కోట్ల ప్యాకేజీ ఇస్తామని, రాజధాని సెప్టెంబరులో ఖరారవుతుందని, లక్షన్నర కోట్లతో విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తామం టూ ప్రకటించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జైరాం హామీలకు సంబంధించిన సీడీని, పత్రికల కథనాలను బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. -
అళగిరి కలకలం
డీఎంకే అధినేత కరుణానిధికి చెవిలో జోరీగలా తయారైన ఆయన తనయుడు, బహిష్కృత నేత అళ గిరి శుక్రవారం రాజకీయ కలకలం సృష్టించారు. డీఎంకేను దుయ్యబడుతూ తనదైన శైలిలో ముందుకెళుతున్న ఆయన శుక్రవారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకుని రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టించారు. ప్రతి ఎన్నికల్లోనూ రజనీకాంత్ మద్దతు కోరని రాజకీయ పార్టీ ఉండదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన క్రేజును ఓట్లుగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేయడం పరిపాటి. రజనీ కూడా ఒక్కోసారి ఒక్కో పార్టీకి మద్దతు పలుకుతుంటారు. ఈసారి మిగతా పార్టీలు ప్రయత్నించకున్నా బీజేపీ అన్ని కోణాల్లోనూ ప్రయత్నాలు చేసి విఫలమైంది. కోచ్చడయాన్ ఆడియో వేడుకల్లో రజనీ ని రాజకీయం గురించి ప్రశ్నించగా నో పాలిటిక్స్ అంటూ సున్నితంగా తప్పించుకున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కరుణానిధితో విభేదించి దూరంగా ఉంటున్న అళగిరిని ఎవ్వరూ బుజ్జగించి చేరదీసే ప్రయత్నాలు కూడా చేయలేదు. డీ ఎంకే అభ్యర్థుల జాబితాలో అళగిరికి, ఆయన అనుచరులకు చోటు దక్కలేదు. దీంతో మరింతగా విరుచుకుపడుతున్న అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలో అళగిరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్సింగ్ను కలిశారు. దీంతో కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కావడం వల్ల ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే పుకార్లు షికారు చేశారుు. ఎండీఎంకే అధినేత వైగోను సైతం చెన్నై విమానాశ్రయంలో కలిసి ముచ్చటించారు. తన రాజకీయ ఎత్తుగడ ఏమిటో తెలియకుండా అన్ని పార్టీల్లో అయోమయ పరిస్థితిని సృష్టిస్తున్న అళగిరి అకస్మాత్తుగా రజనీకాంత్‌ను కలుసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన కుమారుడు దురై దయానిధిని వెంటబెట్టుకుని శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసానికి చేరుకున్న అళగిరి సుమారు 15 నిమిషాలు మంతనాలు జరిపా రు. ఈ విషయం ముందుగానే బయటకు పొక్కడంతో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు రజనీ నివాసం ముందు గుమికూడారు. మట్టి గుర్రంపై సవారి అసాధ్యం రజనీ ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన అళగిరి తానుగా ఏమీ చెప్పకుండా మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్పారు. డీఎంకే ఒక మట్టిగుర్రం వంటి పార్టీ, అందులో సవారీ అసాధ్యం, పార్టీ గెలుపు కూడా అంతంత మాత్రమేనని అళగిరి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకటి లేదా రెండు స్థానాలు వస్తే పెద్ద గెలుపుగా భావించవచ్చన్నారు. లోపభూయిష్టమైన అభ్యర్థుల ఎంపిక, డబ్బుకు ప్రాధాన్యం, సిసలైన కార్యకర్తల విస్మరణే డీఎంకు శాపాలుగా మారతాయన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకేకు గట్టిపోటీ ఇచ్చేది బీజేపీ కూటమి మాత్రమేనని పేర్కొన్నారు. ఈ నెల 16 వ తేదీన తన అనుచరులతో సమావేశమై భవిష్య ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. కొచ్చడయాన్ ఆడియో విడుదలపై మర్యాద పూర్వకంగా కలుసుకున్నానని తెలిపారు. తన కుమారుడు, నిర్మాత దురై దయానిధి రజినీతో చిత్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ అంశాన్ని కూడా ప్రస్తావించానన్నారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావనే రాలేదని తీవ్ర స్వరంతో బదులిచ్చారు. -
ఎలక్షన్ వాచ్..
రాష్ట్రపతి ఆమోదానికి ఎన్నికల షెడ్యూల్ న్యూఢిల్లీ: తొమ్మిది దశల లోక్‌సభ ఎన్నికల తేదీలను నోటిఫై చేసే ప్రక్రియకు ప్రభుత్వం సోమవారం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన ఎన్నికల తేదీల వివరాలను రాష్ట్రపతికి పంపింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈ నెల 13న మొదటి నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారమిక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వివిధ దశల కోసం నోటిఫికేషన్ల జారీకి ఆమోదం తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 5న కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం విదితమే. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం కమిషన్ ఎన్నికల షెడ్యూల్ వివరాలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అరుణాచల్‌లో లోక్‌సభతోపాటే అసెంబ్లీకి... న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతోపాటే ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్లు సోమవారం రాత్రి ఎన్నికల సంఘం ప్రకటించింది. అరుణాచల్‌లో 60 అసెంబ్లీ, 16 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబరు 4 వరకూ ఉంది. అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీని కేబినెట్ సిఫారసుల మేరకు రద్దు చేస్తున్నట్లు గవర్నర్ నిర్భయ్ సింగ్ మార్చి 6న ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది. లాలూ కుమార్తెపై రామ్‌కృపాల్ పోటీ పాట్నా: లోక్‌సభ టికెట్ ఇవ్వనందుకు ఆర్జేడీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత రామ్‌కృపాల్ యాదవ్... లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెతో తాడోపేడో తేల్చుకోనున్నారు. పాటలీపుత్ర నియోజకర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు రామ్‌కృపాల్ సోమవారం పాట్నాలో మీడియాకు తెలిపారు. ఆర్జేడీ అధినేత లాలూ పాటలీపుత్ర స్థానానికి తన పెద్ద కుమార్తె మీసా భారతి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విభేదించి పార్టీని వీడిన రామ్‌కృపాల్ అదే స్థానం నుంచి పోటీకి సిద్ధం కావడంతో రాజకీయం వేడెక్కనుంది. ఆంధ్రప్రదేశ్ బరిలో సమాజ్‌వాదీ సాక్షి, న్యూఢిల్లీ: ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని తిరుపతి, మచిలీపట్నం, వరంగల్, అరకు, నరసాపురం లోక్‌సభ స్థానాలతోపాటు, తొమ్మిది శాసనసభ స్థానాలకు (నెల్లూరు సిటీ, జనగామ, వరంగల్ తూర్పు, చీరాల, వర్ధన్నపేట, తిరువూరు, మచిలీపట్నం, కర్నూలు, అవనిగడ్డ) పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ లక్నోలో సోమవారం మీడియాకు వెల్లడించారు. కుమారుడిపై ‘కరుణ’ లేమి! చెన్నై: కొన్నాళ్ల కిందట పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారంటూ తన సొంత కుమారుడు అళగిరిపై సస్పెన్షన్ వేటు వేసి సంచలనం సృష్టించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరోసారి అళగిరిపై క్రమశిక్షణ కొరడా ఝుళిపించారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో అళగిరికి టికెట్ ఇచ్చేందుకు తిరస్కరించారు. అదేవిధంగా ఆయన మద్దతుదారులైన డి.నెపోలియన్, జీకే రితీష్‌లకు కూడా టికెట్లను నిరాకరించారు. మరోపక్క, 2జీ కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ రాజా (నీలగిరి స్థానం), దయానిధి మారన్(సెంట్రల్ చెన్నై)లకు మరోసారి టికెట్లు ఇవ్వడం సంచలనానికి తెరతీసింది. సిట్టింగుల్లో టీఆర్ బాలు సహా 8మందికి తిరిగి టికెట్టు కేటాయించారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 ఎంపీ సీట్లకుగాను 5 స్థానాలను తమ కూటమి పార్టీలకు కేటాయించినట్టు తెలిపారు. -
కోర్టుకు రండి!
సంస్థాగత ఎన్నికలపై ఓ వార్డుకు చెందిన చోటా నాయకుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తెన్కాశి కోర్టు స్పందించింది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన కార్యద ర్శి అన్భళగన్ కోర్టుకు హాజరు కావాలంటూ న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. సాక్షి, చెన్నై:సంస్థాగత ఎన్నికల ద్వారా పార్టీ కార్యవర్గాల ఎంపికలో డీఎంకే వర్గాలు నిమగ్నమైన విషయం తెలి సిందే. అయితే, ఈ ఎన్నికలు సజావుగా జరగడం లేదని, తమకు కావాల్సిన వాళ్లను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు డీఎంకే అధిష్టానానికి చేరుతూ వస్తున్నాయి. దక్షిణాదిలో సంస్థాగత ఎన్నికలు మమ అనిపించడంతోనే అధిష్టానంపై అధినేత కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగ్రహాలు, ఫిర్యాదులు ఓ వైపు ఉంటే, ఓ చోటా నాయకుడు ఏకంగా కోర్టుకెక్కాడు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఆ నాయకుడు దాఖలు చేసిన పిటిషన్‌తో అధినాయకులకు సమన్లు జారీ అయ్యూరుు. పిటిషన్: తిరునల్వేలి జిల్లా తెన్కాశి పరిధిలోని మహ్మద్ హుస్సేన్ స్థానిక కోర్టులో రెండు రోజుల క్రితం పిటిషన్ వేశాడు. తెన్కాశి పరిధిలో 33 వార్డులు ఉన్నాయని. ఆ వార్డు కమిటీలకు సంస్థాగత ఎన్నికల ద్వారా కార్యవర్గాల ఎంపికకు తమ పార్టీ నిర్ణయించిందని గుర్తు చేశారు. తాను ఆ పార్టీ కోసం సేవలందిస్తూ వస్తున్నానని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా తన వార్డులో పోటీ చేసి, పదవిని చేజిక్కించుకోవాలన్న ఆశతో ఉన్నట్టు పేర్కొన్నారు. పది వార్డుల్లో పదవులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 23 వార్డులకు ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. తొమ్మిదో వార్డు నుంచి ఎన్నికల్లో పోటీ నిమిత్తం తాను నామినేషన్ వేసినట్టు పేర్కొన్నారు. అయితే, ఎన్నికలు నిర్వహించకుండానే, ఉన్నట్టుండి అన్ని వార్డులకు పదవులు భర్తీ చేయడానికి కసరత్తులు చేశారని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా, తమకు కావాల్సిన వాళ్లతో జాబితా సిద్ధం చేసి ప్రకటించేందుకు సిద్ధమయ్యారని కోర్టు దృష్టికి తెచ్చారు. డీఎంకేలో సాగుతున్న తంతంగంపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి గౌతమన్ బుధవారం విచారణకు స్వీకరించారు. సమన్లు: విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఇసక్కి తన వాదన వినిపించారు. అన్ని నిబంధనలకు లోబడి సంస్థాగత ఎన్నికల ద్వారా కార్యవర్గాల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసినా, చివరకు ఎన్నికలు జరపకుండానే కార్యవర్గాల్ని ఎంపిక చేయడం ఎంత వరకు సమంజసమని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా, బాధ్యత కల్గిన పార్టీగా ఉన్న డీఎంకేలో ఈ తంతు జరగడాన్ని తన పిటిషనర్ తీవ్రంగా ఖండిస్తున్నారని, ఆయనకు న్యాయం చేయాలని విన్నవించారు. దీంతో తదుపరి విచారణను మార్చి మూడో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే, ఆ రోజు విచారణకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, తిరునల్వేలి జిల్లా పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ విశ్వనాథన్ కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. వార్డు నాయకుడు వేసిన పిటిషన్ అధినేతలను కోర్టుకు రప్పించేందుకు దారి తీయడం తిరునల్వేలి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
బల నిరూపణ!
తన బలాన్ని నిరూపించుకునే రీతిలో హంగు ఆర్బాటలతో జన్మదిన వేడుకను గురువారం అళగిరి జరుపుకున్నారు. మద్దతుదారులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఏ నిర్ణయం తీసుకున్నా ‘అన్న’ వెంటేనని స్పష్టం చేశారు. ముగ్గురు ఎంపీలు అళగిరితో భేటీ కావడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి, చెన్నై: డీఎంకేలో అళగిరి వివాదం రక్తికట్టిస్తూ వస్తు న్న విషయం తెలిసిందే. సస్పెన్షన్, పోస్టర్ల యుద్ధం, రోజు కో వ్యాఖ్యలతో సమరం వెరసి పార్టీలో గందరగోళం నెల కొంది. అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారోనన్న ఉత్కంఠ పెరిగింది. ఈ పరిస్థితుల్లో గురువారం తన 63వ జన్మదినాన్ని బల నిరూపణకు వేదికగా అళగిరి చేసుకున్నా రు. తన సత్తా ఏమిటో అధిష్టానానికి చాటే విధంగా, దక్షిణాదిలో కొనసాగుతున్న తన హవాను నిరూపించుకునే రీతిలో పుట్టిన రోజు వేడుకను అళగిరి జరుపుకున్నారు. బర్తడే: అళగిరి బర్త్‌డే వేడుకకు ఆయన మద్దతుదారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన మద్దతు నేతలు మన్నన్, గౌష్‌బాషా, ఉదయకుమార్, శివకుమార్, ఎంఎల్ రాజా, అరుణ్‌కుమార్, ముబారక్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎటు చూసినా అళగిరి ఫ్లక్సీలు, బ్యానర్లతో మదురై నిండింది. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోష్, అన్నా దురై, అబ్దుల్ కలాం, కరుణానిధి చిత్ర పటాల్ని ముద్రించారు. మహా నేతల మార్గదర్శకంలో అళగిరి ముందడుగు వేస్తున్నారన్న నినాదాల్ని అందులో పొందు పరచడం గమనార్హం. ఉదయం 9 గంటలకు కుటుంబంతో కలసి జన్మదిన వేడుకను అళగిరి జరుపుకున్నారు. సత్యానగర్‌లోని నివాసంలో సతీమణి గాంధీ, తనయుడు దురై దయానిధి, కోడలు అనుషా, కుమార్తె కయల్ వెళి, అల్లుడు వెంకటేష్‌తో కలసి కేక్ కట్ చేశారు. అత్యంత సన్నిహితులుగా ఉన్న మద్దతుదారులతో సమాలోచన జరిపారు. అనంతరం ఇంటి నుంచి భారీ హంగామాతో రాజాముత్తయ్య మండ్రంకు చేరుకున్నారు. మేళతాళాలు, కోలాటాలు, మైలాటం, గరగాట్టం సంగీత సాంస్కృతిక కార్యక్రమాల నడుమ, మద్దతుదారుల ఆహ్వానాన్ని అళగిరి అందుకున్నారు. 630 కిలోలతో రూపొందించిన కేక్‌ను ఆయన కట్ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని, వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, స్కూటర్లు, మహిళలకు కుట్టు మిషన్లు వంటివి పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున జనం, డీఎంకే శ్రేణులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు డీఎంకే కండువా, జెండాల్ని సైతం చేతబట్టి తరలి వచ్చారు.ఎంతో ఆనందం: ఈ ఏడాది తన జన్మదినోత్సవం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అళగిరి చిరునవ్వులు చిందిస్తూ మీడియా దృష్టికి తెచ్చారు. ఇది వరకు తాను ఎన్నో జన్మదిన వేడుకల్ని జరుపుకున్నానని, అయితే, ఈ వేడుక ఇచ్చినంత ఆనందం అప్పట్లో కలగలేదని పేర్కొన్నారు. తన మద్దతుదారులు, తన కోసం తరలి వచ్చిన జన సందోహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయన మీడియూతో మాట్లాడారు. డీఎంకే నుంచి శుభాకాంక్షలు వచ్చాయా? అంటే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పారు. డీఎంకేతో సంధి యత్నాలు జరిగాయా? అంటే డీఎంకే నుంచి తనను ఏ ఒక్కరూ కలవలేదని, మద్దతుదారులు మాత్రం వచ్చారని పేర్కొన్నారు. తమరి నిర్ణయం ఏంటో చెప్పండి? అని ప్రశ్నించగా ఒక్క రాత్రి వేచి చూడండంటూ ముగించారు. అనంతరం తన మద్దతు దారులతో మంతనాల్లో మునిగారు. ముగ్గురు ఎంపీల భేటీ: అళగిరి బర్త్‌డేలో ముగ్గురు ఎంపీలు ప్రత్యక్షం కావడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారిం ది. డీఎంకే ఎంపీలు నెపోలియన్, రితీష్, కేపీ రామలింగం తో ఉదయం సత్యానగర్ ఇంట్లో అళగిరితో భేటీ అయ్యా రు. ఆయనతో పాటుగా రాజాముత్తయ్య మండ్రంకు వచ్చారు. వీరిని మీడియా కదిలించింది. రితీష్ మాట్లాడుతూ రాజకీయంగా తనకు అన్నీ అన్న మాత్రమేనని, ఆయన వెంటే ఉంటానన్నారు. ఆయన తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తాను ఇన్నాళ్లు అమెరికాలో ఉన్నానని, ఇక్కడికి వచ్చేలోపు ఎన్నో చేదు సంఘటనలు వినాల్సి వచ్చిందని నెపోలియన్ అన్నారు. వివాదాలన్నీ సమసి పోవాలని కాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అందుకు కట్టుబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. కేపీ రామలింగం మీడియా ప్రశ్నలకు చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగడం గమనార్హం. ఈ ముగ్గురు ఎంపీలతో పాటుగా, పలువురు దక్షిణాది జిల్లాల నాయకులు అళగిరిని కలుసుకోవడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. స్టాలిన్‌కు జెడ్ ప్లస్: అళగిరి వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకే కోశాధికారి స్టాలిన్‌కు భద్రతను పెంచేందుకు కేంద్ర హోం శాఖ ప్రయత్నాలు చేపట్టింది. స్టాలిన్‌కు భద్రత పెంచాలంటూ డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖ కేంద్ర హోం శాఖ చెంతకు చేరింది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, డీఎంకే పార్లమెంటరీ నేత టీ ఆర్ బాలు స్టాలిన్ భద్రత పెంపులో కీలక భూమిక పోషిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేయడంతో చకచకా భద్రతా పనులు సాగుతోన్నాయి. తద్వారా ఆయన వెంట భద్రతకు 36 మందితో కూడిన కేంద్ర బలగం, బ్లాక్ క్యాట్ కమాండోలు విధులు నిర్వర్తించబోతున్నారు. రాష్ట్రంలో ఈ భద్రత సీఎం జయలలితకు, డీఎంకే అధినేత ఎం కరుణానిధికి మాత్రమే ఉంది. -
ఆపండి!
‘అళగిరి నా అన్నయ్య.. ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దు... రాద్ధాంతం వద్దు... రచ్చ చేయొద్దు... అన్నీ ఆపండి’ అని మద్దతుదారులకు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ విన్నవించారు. అదే సమయంలో తనయుడికి ముప్పు ఉందని, భద్రత పెంచాలని కేంద్రానికి కరుణానిధి లేఖాస్త్రం సంధించారు. కరుణ మనవడు దురై దయానిధి స్పందిస్తూ, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయని చెప్పడం గమనార్హం. సాక్షి, చెన్నై: డీఎంకేలో బయలుదేరిన ముసలం గాలివానగా మారుతోంది. అళగిరి సస్పెన్షన్‌తో ఆయన మద్దతుదారులు అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డీఎంకేతో తాడో పేడో తేల్చుకునే విధంగా విమర్శలు సంధిస్తున్నారు. వీరి చర్యలపై మంగళవారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందించారు. అళగిరి తీరును దుయ్యబట్టారు. స్టాలిన్ మరో రెండు నెలల్లో చచ్చిపోతాడంటూ అళగిరి హెచ్చరించినట్టు కరుణానిధి చేసిన వ్యాఖ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. దీనిపై అళగిరి స్పందించినా, స్టాలిన్ మద్దతుదారులు మాత్రం తగ్గలేదు. అళగిరికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఆయన్ను హేళన చేస్తూ పోస్టర్లు వెలిశాయి. స్టాలిన్ మద్దతుదారులు చెన్నైలో 20 చోట్ల అళగిరి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతుండడంతో స్టాలిన్ స్పందించారు. తన మద్దతుదారులను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. పట్టించుకోవద్దు: దివంగత నేత అన్నా ఆశయ సాధన, అధినేత కరుణానిధి అడుగు జాడల్లో డీఎంకే పయనం సాగుతోందని గుర్తు చేశారు. పార్టీలో సమస్యలు, ఆరోపణలు సహజం అని వివరించారు. తనకు ఏదో ముప్పున్నట్టుగా వ్యాఖ్య చేసింది.. నా సోదరుడే...దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు...పెద్దది చేయొద్దు అని తన మద్దతుదారులకు హితవు పలికారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనం, పోస్టర్ల ఏర్పాటును మానుకోవాలని సూచించారు. అందరూ సంయమనంతో ముందుకెళ్లాలని విన్నవించారు. భద్రత పెంచండి: అళగిరి వ్యాఖ్యల నేపథ్యంలో స్టాలిన్‌కు ముప్పు ఉందన్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. డెప్యూటీ సీఎంగా స్టాలిన్ పనిచేశారని, ఒక పార్టీకి కోశాధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న దృష్ట్యా, ఆయనకు భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత టీ ఆర్ బాలు ద్వారా ఆర్థిక మంత్రి చిదంబరం సహకారంతో కేంద్ర హోం శాఖపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. శాశ్వతంగా బయటకు: అళగిరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఆయన్ను శాశ్వతంగా బయటకు పంపించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ దిశగా రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాళయం వర్గాలు దృష్టి కేంద్రీకరించాయి. అధినేత కరుణానిధి చేసిన వ్యాఖ్యలను ధిక్కరిస్తూ ఎదురు దాడికి దిగడం, పార్టీ వర్గాల్ని ఓ చోట చేర్చి మంతనాలు జరుపుతుండటం, తానేమిటో 31న ప్రకటిస్తానంటూ జబ్బలు చరచడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. నోటీసులిచ్చి వారంలోపు అళగిరి ఇచ్చే వివరణ మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతోన్నారు. అళగిరి కుమారుడు, కరుణానిధి మనవడు దురై దయానిధి మీడియాతో మాట్లాడుతూ, నిజాలు అంత సులభంగా దాగవని, అవి ఏదో ఒక రోజు బయటకు వచ్చి తీరుతాయని పేర్కొనడం గమనార్హం. -
అళగిరి మాటలను లైట్ తీసుకున్న స్టాలిన్
-
పుట్టినవాళ్లంతా ఏదోరోజు చావాల్సిందే
డీఎంకే కుటుంబ కథా చిత్రం పలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. 'స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడు' అని అళగిరి తనతో అనడం వల్లే, కడుపు మండి అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కరుణానిధి వెల్లడిస్తే.. 'పుట్టిన ప్రతివాళ్లూ ఏదో ఒకరోజు చావాల్సిందే' అని ఇప్పుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. అలాగని ఆయనేదో వేదాంతం వల్లిస్తున్నారనుకుంటున్నారా.. కాదు, తన అన్న ఎంకే అళగిరి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాలనే స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించారట. అయితే, అదే సమయంలో.. తన అన్నయ్య దిష్టిబొమ్మలను మాత్రం దహనం చేయొద్దని కార్యకర్తలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ క్రమశిక్షణ అన్నింటికంటే ముఖ్యమని ఆయన అన్నారు. తన గురించి అన్నయ్య అళగిరి చేసిన వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పారు. దాన్ని తాను పెద్ద సమస్యగా చేయాలనుకోవట్లేదని కూడా అన్నారు. -
డీఎంకేలో కొనసాగుతున్న వార్
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు అళగిరిల మధ్య వార్ ఇంకా కొనసాగుతోంది. డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన అళగిరిని ఈ నెల 24న పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, దానిపై అళగిరి మండిపడటం తెలిసిందే. అయితే ఆ రోజు అళగిరి వ్యవహరించిన తీరు వల్లే ఆయనను సస్పెండ్ చేసినట్లు కరుణానిధి మంగళవారం వె ల్లడించారు. ‘ఆ రోజు అళగిరి నా దగ్గరికి వచ్చి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. నా చిన్న కుమారుడు, తన సోదరుడు అయిన స్టాలిన్ త్వరలోనే చస్తాడని, పార్టీ తీరునూ విమర్శించాడు. దీంతోనే సస్పెండ్ చేశాం’ అని తెలిపారు. అయితే కరుణ వ్యాఖ్యలపై అళగిరి స్పందిస్తూ... తన తండ్రి అబద్ధాలాడుతున్నారని అన్నారు. పార్టీలోని గ్రూపు రాజకీయాన్ని, అన్యాయాన్ని ఎత్తి చూపినందుకే తనపై వేటువేశారన్నారు. ‘నాన్న చేసిన వ్యాఖ్యల్ని నా పుట్టిన రోజు కానుకగా స్వీకరిస్తున్నా’ అని అన్నారు. కరుణకన్నా ముందుగానే తాను చచ్చి పోవాలని భావిస్తున్నానని, ఆయన కన్నీళ్లు తన భౌతిక కాయంపై పడాలని కాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. -
మాటల యుద్ధం
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం అన్నదమ్ముళ్లు అళగిరి, స్టాలిన్ల మధ్య ఏళ్ల తరబడి వివాదం సాగుతోంది. ఇది ముదిరి పాకాన పడడంతో డీఎంకే అధిష్టానం కన్నెర్ర చేసింది. అళగిరిని తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో అళగిరి వర్గం తీవ్ర ఆక్రోశంతో రగిలిపోతోంది. తదుపరి తన కార్యాచరణను ఈనెల 31న ప్రకటించేందుకు అళగిరి సిద్ధం అవుతోన్నారు. దక్షిణాది జిల్లాల్లోని మద్దతుదారుల ను ఏకం చేసి మదరై వేదికగా మంతనాల్లో మునిగి పోయూరు. అదే సమయంలో అళగిరిని సస్పెండ్ చేసిన రోజు గోపాలపురంలో ఏమి జరిగింది? అని తెలుసుకోవడానికి మీడియా తీవ్ర ప్రయత్నాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం అధినేత ఎం కరుణానిధి అళగిరిపై విరుచుకు పడ్డారు. ఆవేశ పరుడు: అళగిరి ఆవేశ పరుడు అని కరుణానిధి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అళగిరి తాజా చర్యల్ని ఎండ గడుతూ, ఈనెల 24వ తేదీ ఉదయం తన ఇంట్లో ఏమి జరిగిందోనన్న విషయాన్ని వెల్లడించారు. ఆరోజు ఉదయాన్నే అళగిరి తీవ్ర ఆవేశంతో గోపాలపురంలోని తన ఇంట్లోకి వచ్చారని, వచ్చీ రాగానే పత్రికల్లో రాయలేనంతగా పదజాలం ఉపయోగించారని వివరించారు. తాను పడక గదిలో బెడ్ మీద నుంచి కూడా లేవకుండానే అళగిరి వ్యవహరించిన తీరు మనో వేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. తన చిన్న కుమారుడు స్టాలిన్‌ను తీవ్ర పదజాలంతో దూషించడంతో తనలో ఆక్రోశాన్ని రగిల్చిందన్నారు. కుటుంబం అన్న విషయాన్ని పక్కన పెట్టి, పార్టీ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని స్టాలిన్‌పై అళగిరి చేసిన వ్యాఖ్యలు తనను జీర్ణించుకోలేకుండా చేశాయన్నారు. ఆయన వ్యాఖ్యల్లో చచ్చిపోతారు అన్న అర్థం వచ్చేలా ఉన్నాయన్నారు. కార్యకర్తలను ఏ నాయకుడు తిట్టినా, తాను ఊరుకోనని, అలాంటప్పుడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కోశాధికారి, తన చిన్న కుమారుడిని నానా మాటలనడంతో తాను స్పందించాల్సి వచ్చిందన్నా రు. అళగిరి ఆగడాలకు కళ్లెం వేయడం లక్ష్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. కరుణానిధి అలా వ్యాఖ్యలు చేశారో లేదో, ఇలా అళగిరి మదురైలో స్పందించారు. అవన్నీ అబద్ధాలేనని, తనపై అభాండాలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలే కానుక: తనను తొలగించిన సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ కొన్ని కారణాలు ప్రకటించారని గుర్తు చేశారు. తాజాగా తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవంగా కొట్టి పారేశారు. ఆయన మోపిన ఆభాండాలను పుట్టినరోజు శుభాకాంక్షల కానుకగా స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీలోని రాజకీయం, జిల్లాల్లో నాయకులకు జరుగుతున్న అన్యాయం గురించి పదే పదే అరివాళయంకు ఫిర్యాదులు చేసినా, అవి అధినేతకు చేరడం లేదన్నారు. అందుకే తాను స్వయంగా ఆ రోజున కరుణానిధిని కలుసుకుని ఆధారాలతో చూపిస్తే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను పార్టీ సంయుక్త కార్యదర్శి దురై మురుగన్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు. అయితే, తానేదో ఆవేశంతో ఊగిపోయినట్టు, తీవ్ర పదజాలాల్ని ఉపయోగించినట్టు కరుణానిధి పేర్కొనడం మనోవేదనకు గురి చేస్తున్నదన్నారు. నా తమ్ముడు: స్టాలిన్ తమ్ముడు అని, అందరూ కుటుంబ సభ్యులు అన్న విషయం తనకు తెలుసని పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే సస్పెండ్‌ను కానుకగా ఇచ్చారన్నారు. ఇప్పుడేమో జన్మదిన కానుకగా తాజా ఆరోపణలు సంధించారని, ఎవరెన్ని ఆరోపణలు చేసినా, కుట్ర లు పన్నినా, తాను మాత్రం కార్యకర్తల వెంటేనని, మద్దతుదారుల కోసం ఎంత కైనా సిద్ధం అని స్పష్టం చేశారు. చచ్చిపోతారన్నట్టు ఏదో వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తూ, ఆయన వందేళ్లు జీవించాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ‘‘చిట్ట చిరవగా ఒకటే చెబుతున్నా, నాకు కరుణానిధి ముఖ్యం... ఆయన కంటే ముందే చచ్చిపోవాలని భావించేవాడిని నేను. నా భౌతిక కాయంపై ఆయన కన్నీళ్లు పడాలన్నదే నా కోరిక.’’ అని చెమ్మగిల్లిన కళ్లతో ఉద్వేగంగా వ్యాఖ్యానించి ముగించారు. -
'స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడట'
ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తన పెద్ద కొడుకు ఎంకే అళగిరిపై కరుణానిధి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడని అళగిరి తనకు చెప్పినట్లు కరుణ వెల్లడించారు. 'స్టాలిన్ అంటే అళగిరికి ఎందుకోగానీ అస్సలు పడదు. స్టాలిన్ మూడు నెలల్లో చచ్చిపోతాడని కూడా అన్నాడు. కన్న కొడుకు గురించి ఇలాంటి మాటలను ఏ తండ్రీ సహించలేడు. కానీ పార్టీ అధినేతగా నేను సహించాల్సి వచ్చింది' అని కరుణానిధి విలేకరుల సమావేశంలో అన్నారు. జనవరి 24వ తేదీ ఉదయం అళగిరి తన ఇంటికి వచ్చి, స్టాలిన్ గురించి చాలా చెడ్డగా మాట్లాడాడని కరుణ చెప్పారు. పార్టీ అధినే ఇంటికి తెల్లవారుజామున 6, 7 గంటల సమయంలో రావడం సరైనదేనా అన్నారు. మదురైలో పార్టీకి వ్యతిరేకంగా అళగిరి ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. డీఎండీకేతో పొత్తు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో ఫలితాలు సరిగా రాలేదన్నారు. చాలా కాలంగా పార్టీ కోశాధికారి స్టాలిన్ గురించి అళగిరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని కరుణానిధి మండిపడ్డారు. క్షమాపణ చెబితే అళగిరిపై సస్పెన్షన్ ఎత్తేస్తారా అని అడగ్గా, ఆ విషయం అతడినే అడగాలని చెప్పారు. -
ఆంతర్యమేమిటో!
బహిష్కరణకు గురైన అళగిరితో డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి దురై మురుగన్ భేటీ కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అళగిరికి మదురైలో పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టడం, మళ్లీ పోస్టర్ల యుద్ధం మొదలవడంతో డీఎంకే అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. సాక్షి, చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యల నెపంతో అధినేత ఎం కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరిపై సస్పెండ్ వేటు వేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్‌పై అళగిరి తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈనెల 30న జరిగే బర్త్‌డే వేడుకల అనంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోన్నారు. ఈ సమయంలో అళగిరితో దురై మురుగన్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. స్టాలిన్‌తో సన్నిహితంగా దురైమురుగన్ ఉండే వారు. పార్టీలో సీనియర్ నేతగా, ముఖ్య పదవిలో ఉన్న దురై మురుగన్ ఆదివారం కోట్టూరులో ప్రత్యక్షమయ్యారు. అక్కడి ఇంట్లో అళగిరితో ఆయన భేటీ అయిన సమాచారం డీఎంకే వర్గాల దృష్టికి చేరింది. ఈ ఇద్దరు భేటీ కావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది, ఇందులో ఆంతర్యం ఏమిటోనన్న అన్వేషణలో డీఎంకే వర్గాలు ఉన్నాయి. అయితే, వీరి భేటీ అంతా, మదురై పార్టీ చుట్టూ సాగినట్టు సమాచారం. ఇటీవల తొలగించిన నేతల గురించి, మళ్లీ మళ్లీ చేస్తూ ఉన్న వివాదాస్పద వ్యాఖ్యలపై దురై మురుగన్ సమీక్షించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం మదురైకు వెళ్లిన అళగిరి అక్కడి విమానాశ్రయంలో తాను ఓ అర్థంతో వ్యాఖ్యలు చేస్తే, మరో అర్థం వచ్చేలా మీడియాలో రాస్తున్నారని పేర్కొనడం గమనార్హం. బ్రహ్మరథం: చెన్నై నుంచి మదురైకు వచ్చిన అళగిరికి డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. విమానాశ్రయం నుంచి వందలాది వాహనాలు కాన్వాయ్‌గా అళగిరి ఇంటికి వెళ్లాయి. పార్టీ నాయకులు, అళగిరి మద్దతుదారులు గౌష్ బాషా, మన్నన్, బోసు, ఉదయకుమా ర్, జలాలుద్దీన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నాయకులు తరలి రావడం విశేషం. సోమవారం కూడా అళగిరి నివాసం మద్దతుదారులతో నిండింది. మీడియాతో మాట్లాడిన అళగిరి తన సత్తా ఏమిటో 30వ తేదీ తెలుస్తుందన్నారు. వచ్చింది గోరంత మద్దతుదారులేనని, కొండంత మద్దతుదారులను తన జన్మదినం రోజు చూడబోతున్నారని ప్రకటించారు. ప్రతి ఏటా తన జన్మదినాన్ని పేదల సంక్షేమార్థం జరుపుకోవడం జరుగుతోందని, ఈ ఏడాది అదే తరహాలో జరుపుకుంటామని, అరుుతే ఈ వేడుకకు ప్రత్యేకత సంతరించుకోనున్నదన్నారు. అయితే, తాను ఓ అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తుంటే, మీడియా మరో అర్థం చేసుకుని వార్తలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. తాను ఏ నిర్ణయాన్ని అయినా, సరే మద్దతుదారులతో చర్చించిన తర్వాతే తీసుకుంటానని స్పష్టం చేశారు. మళ్లీ పోస్టర్లు: అళగిరి సస్పెన్షన్‌కు వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు, ఆయన మద్దతుదారుల అత్యుత్సాహ పోస్టర్లు కూడా కారణమయ్యూయి. అళగిరిపై సస్పెన్షన్ వేటు పడటంతో మళ్లీ మద్దతుదారులు రెచ్చి పోతున్నారు. చెన్నై, మదురైలో పోస్టర్లు వెలిశాయి. తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ధైర్యవంతుడిగా, వీరుడిగా, కింగ్ మేకర్‌గా అళగిరిని పేర్కొంటూ వ్యాఖ్యల్ని అందులో పొందు పరిచారు. అళగిరి సతీమణి గాంధీ, తనయుడు దురై దయానిధి చిత్ర పటాల్ని సైతం ముద్రించడం గమనార్హం. -
పొత్తు కోసం పుత్రుడిపై వేటు
-
పొత్తు కోసం పుత్రుడిపై వేటు
డీఎంకే నుంచి అళగిరిని సస్పెండ్ చేసిన కరుణానిధి ప్రాథమిక సభ్యత్వం నుంచీ ఉద్వాసన డీఎండీకేతో పొత్తును వ్యతిరేకించినందుకే సాక్షి, చెన్నై: సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలకు దిగిన అళగిరిపై ఆయన తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అయితే, సస్పెన్షన్ తాత్కాలికమేనని డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ చెప్పారు. అళగిరి హద్దులు మీరారని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఆయన అన్నారు. కరుణానిధి నిర్ణయాన్ని డీఎంకేలోని మెజారిటీ నాయకులు స్వాగతించారు. ఆయన రెండో కుమారుడు స్టాలిన్ మద్దతుదారులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. తన సస్పెన్షన్‌పై అళగిరి మాట్లాడుతూ, మద్దతుదారుల ప్రయోజనాల కోసం పాటుపడినందుకు తనకు దక్కిన బహుమతి అని వ్యాఖ్యానించారు. అళగిరి సస్పెన్షన్‌కు దారితీసిన పరిణామాలు... * తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను వ్యతిరేకించే విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఒకవైపు డీఎంకే, మరోవైపు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. * డీఎండీకేతో పొత్తు తమకు కలిసొస్తుందని భావించిన డీఎంకే అధినేత కరుణానిధి, ఇప్పటికే ఆ పార్టీతో మంతనాలు పూర్తి చేశారు. * కరుణ వ్యూహం అమలు కానున్న తరుణంలో ఆయన పెద్ద కుమారుడు, మదురై ఎంపీ అళగిరి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్‌పై విమర్శలకు దిగారు. విజయకాంత్‌ను రాజకీయ నేతగా పరిగణించబోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. * విజయ్‌కాంత్‌పై ఈ వ్యాఖ్యలు చేసినందుకు అళగిరిని కరుణ ఈనెల 7న తీవ్రంగా మందలించారు. పొత్తులపై పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. * తన నివాసంలో కలుసుకున్న అళగిరితో కరుణానిధి ఇదే అంశంపై చర్చించారు. చర్చలు ముగిసిన కొద్ది గంటలకే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కరుణానిధి ఒక ప్రకటన విడుదల చేశారు. * ఒకవైపు, స్టాలిన్ మద్దతుదారులు, కె.వీరమణి వంటి డీఎంకే నేతలు కరుణానిధి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేయగా, ఈ నిర్ణయం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని అళగిరి మద్దతుదారులన్నారు. * కరుణానిధి మాత్రం అళగిరి మద్దతుదారుల వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అళగిరి సస్పెన్షన్ నిర్ణయం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. * డీఎంకేతో పొత్తుపై డీఎండీకే చీఫ్ విజయకాంత్ ఫిబ్రవరి 2న ప్రకటన చేసే అవకాశం ఉంది. -
అలక వీడిన అళగిరి
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి హెచ్చరిక స్వరంతో ఆయన పెద్దకుమారుడు అళగిరి అలక వీడారు. బుధవారం గోపాలపురంలో అధినేతను కలుసుకున్నారు. తన ఆవేదనను ఏకరువు పెట్టారు. అయితే, కరుణ ఇచ్చిన వార్నింగ్ ప్రత్యేకంగా తనకు కాదంటూ అళగిరి వ్యాఖ్యానించడం గమనార్హం. టీవీ ఛానల్‌కు అళగిరి ఇచ్చిన ఇంటర్వ్యూ డీఎంకేలో ప్రకంపన సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన అధినేత ఎం కరుణానిధి మంగళవారం ప్రత్యేక ప్రకటన చేశారు. అళగిరికి, ఆయన మద్దతుదారులకు షాక్ ఇచ్చే విధంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారి తీసింది. అధినేత కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అళగిరి వెనక్కు తగ్గారు. ఉదయాన్నే కరుణానిధిని కలుసుకుని ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. భేటీ: కరుణానిధి అపాయింట్మెంట్ కోసం కొంత కాలంగా అళగిరి ప్రయత్నిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అనుమతి లభించక పోవడం, పార్టీలో తనను పక్కన పెడుతుండడంతో ఇంటర్వ్యూ ద్వారా చర్చల్లోకి ఎక్కారు. చివరకు అళగిరికి కరుణానిధి నుంచి ఆహ్వానం వచ్చింది. చెన్నైలో ఉన్న అళగిరి ఉదయం 9 గంటలకు గోపాలపురం చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన ఆయన తల్లి దయాళు అమ్మాళ్‌ను పరామర్శించినానంతరం పార్టీ అధినేత, తండ్రి కరుణానిధితో అరగంట పాటుగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎవరు ఎవరిని బుజ్జగించారో బయటకు రాకున్నా, ఆ వ్యాఖ్యలపై మాత్రం కరుణానిధి తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో, తనకు జరుగుతున్న అవమానం, పార్టీలో తన స్థానం, దక్షిణాదిలో తన బలం తగ్గేలా కుట్రలు జరుగుతుండటం వంటి అంశాలను కరుణానిధి వద్ద అళగిరి ఏ కరువు పెట్టినట్లు సమాచారం. తీవ్ర ఆవేదనతో ఇంట్లోకి వెళ్లిన అళగిరి, తిరిగి వచ్చే క్రమంలో ఉల్లాసంగా ఉన్నట్టు మద్దతుదారులు పేర్కొనడం గమనార్హం. అళగిరి బయటకు వచ్చారో లేదో ఇటీవల మదురైకు కొత్తగా ప్రకటించిన డీఎంకే కమిటీ గోపాల పురం ఇంట్లోకి ప్రవేశించింది. ఆ వార్నింగ్ నాకు కాదు: కరుణానిధి చేసిన హెచ్చరికల స్వరాన్ని గుర్తు చేస్తూ మీడియా ప్రతినిధి అళగిరిని ప్రశ్నించగా, అది నాకు కాదు అని సమాధానం ఇచ్చారు. పార్టీ పరంగా అందర్నీ ఉద్దేశించి అధినేత ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఎవరు బడితే వాళ్లు ప్రకటనలు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఆ ప్రకటన చేశారని చెప్పారు. ప్రత్యేకంగా తనను ఉద్దేశించి మాత్రం కాదన్న విషయాన్ని మీడియా గుర్తించాలని హితవు పలికారు. పార్టీలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, సమస్యలెదురైనా అళగిరి వెంటే తాముంటామంటూ మదురై లోని మద్దతుదారులు ప్రకటించడం విశేషం. అళగిరి కాకుండా మరొకరు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే పార్టీ నుంచి ఇప్పటికే వేటు పడేదని డీఎండీకే నుంచి ఇటీవల బయటకు వచ్చిన సీనియర్ నాయకుడు బన్రూటి రామచంద్రన్ వ్యాఖ్యానించడం గమనించాల్సిందే. -
వార్నింగ్!
సాక్షి, చెన్నై: పెద్ద కుమారుడు అళగిరి తీరు డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఆగ్రహం తెప్పించింది. అళగిరి వర్గానికి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని మంగళవారం ఆయన తీసుకున్నారు. తీవ్రంగా స్పందిస్తూ వార్నింగ్‌లు ఇచ్చారు. పార్టీకి, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని తేల్చేశారు. డీఎంకేలో సాగుతున్న వారసత్వ సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు రోజుల క్రితం కరుణానిధి పెద్దకుమారుడు ఎంకే అళగిరి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చకు దారి తీసింది. సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా, డీఎండీకే అధినేత విజయకాంత్ శైలిని తప్పుబడుతూ అళగిరి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఆ ఇంటర్వ్యూ ద్వారా తన మదిలో ఉన్న వేదనను అళగిరి ఏకరువు పెట్టడంతో పెద్దకుమారుడిపై కరుణానిధి సానుభూతి చూపించారు. అతడ్ని బుజ్జగించడంతో పాటుగా, అన్నదమ్ముళ్ల మధ్య సంధికి చర్యలు చేపట్టారు. అయితే, అళగిరి ఏ మాత్రం తగ్గనట్టు సమాచారం. దూతల వద్ద మరింత ఘాటుగా స్పందించినట్టు తెలిసింది. అదే సమయంలో తన మద్దతుదారులను ఏకం చేసి భవిష్యత్తు కార్యాచరణ దిశగా అళగిరి చకచకా పావులు కదుపుతుండడంతో అధిష్టానం మేల్కొంది. అళగిరి స్పీడుకు బ్రేక్ వేస్తూ, ఆయన మద్దతుదారులకు షాక్ కల్గించే రీతిలో మంగళవారం వార్నింగ్ ఇవ్వడం చర్చకు దారి తీసింది. స్టాలిన్‌పై చేసిన వ్యాఖ్యలతో పాటుగా ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ఉద్దేశించి అళగిరి చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని అధిష్టానం పరిగణనలోకి తీసుకుంది. ఆ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ, స్వయంగా అధినేత కరుణానిధి హెచ్చరికలు జారీ చేయడం అళగిరి వర్గాన్ని కలవరంలో పడేసింది. హెచ్చరిక : కరుణానిధి అన్నా అరివాళయూనికి ప్రతి రోజూ తప్పని సరిగా వస్తారు. అయితే, సోమవారం అరివాళయం వైపు ఆయన కన్నెత్తి చూడ లేదు. దీంతో అళగిరి వ్యాఖ్యలపై కరుణానిధి షాక్‌కు గురయ్యారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ ప్రశ్నకు బ్రేక్ వేస్తూ మంగళవారం ఉదయం అరివాళయూనికి రాగానే, పార్టీ వర్గాలతో అళగిరి తీరుపై చర్చించినట్టు సమాచారం. కాసేపటికి హెచ్చరికలతో కూడిన ప్రకటన వెలువడింది. డీఎండీకే తమతో దోస్తీ కడితే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇది తమకు ఎంతో ఆనందం అంటూ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలో తాను స్పష్టం చేశానని, అయితే, తన వ్యాఖ్యల్నే ధిక్కరించే విధంగా అళగిరి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నట్టు పేర్కొన్నారు. డీఎండీకేతో దోస్తీ వద్దంటూ అళగిరి చేసిన వ్యాఖ్యతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నట్టు గుర్తు చేశారు. పార్టీ నాయకులకు, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు నిందలను ఇతరుల మీద వేయడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎంతటి వారైనా సరే క్రమ శిక్షణ చర్యలకు గురి కావాల్సి ఉంటుందని, పార్టీ సభ్యత్వం నుంచి కూడా ఉద్వాసన పలకాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. పొత్తు కోసమేనా: డీఎండీకే ఓట్లు తమకు తప్పనిసరి కావడంతోనే అళగిరి వ్యాఖ్యలపై కరుణానిధి తీవ్రంగా స్పందించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమతో కలసి అడుగులు వేయడానికి డీఎండీకేలో చర్చ సాగుతున్న తరుణంలో అళగిరి వ్యాఖ్యలు ఆ ప్రయత్నాలకు మొకాలొడ్డేలా ఉండటంతో కరుణానిధి మేల్కొనట్టు చెబుతున్నారు. అందుకే విజయకాంత్‌ను మెప్పించడం లక్ష్యంగా అళగిరికి షాక్ ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. అయితే, అళగిరి వెంట నడిచే వాళ్లు డీఎంకేలో లేరన్న విషయాన్ని గ్రహించే కరుణానిధి తీవ్రంగా స్పందించినట్టు మరి కొందరు పేర్కొంటుండటం గమనార్హం. గతంలో అళగిరి వెంట ఉన్న నాయకులు, దక్షిణాది జిల్లాల పార్టీ కార్యదర్శుల్లో ఒకరు మినహా తక్కిన వారందరూ స్టాలిన్ పక్షాన చేరిపోయూరు.