పుట్టినవాళ్లంతా ఏదోరోజు చావాల్సిందే | everybody have to die one day, says mk stalin | Sakshi
Sakshi News home page

పుట్టినవాళ్లంతా ఏదోరోజు చావాల్సిందే

Published Wed, Jan 29 2014 2:03 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

పుట్టినవాళ్లంతా ఏదోరోజు చావాల్సిందే

పుట్టినవాళ్లంతా ఏదోరోజు చావాల్సిందే

డీఎంకే కుటుంబ కథా చిత్రం పలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. 'స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడు' అని అళగిరి తనతో అనడం వల్లే, కడుపు మండి అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కరుణానిధి వెల్లడిస్తే.. 'పుట్టిన ప్రతివాళ్లూ ఏదో ఒకరోజు చావాల్సిందే' అని ఇప్పుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. అలాగని ఆయనేదో వేదాంతం వల్లిస్తున్నారనుకుంటున్నారా.. కాదు, తన అన్న ఎంకే అళగిరి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాలనే స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించారట.

అయితే, అదే సమయంలో.. తన అన్నయ్య దిష్టిబొమ్మలను మాత్రం దహనం చేయొద్దని కార్యకర్తలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ క్రమశిక్షణ అన్నింటికంటే ముఖ్యమని ఆయన అన్నారు. తన గురించి అన్నయ్య అళగిరి చేసిన వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పారు. దాన్ని తాను పెద్ద సమస్యగా చేయాలనుకోవట్లేదని కూడా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement