► కరుణతో అళగిరి
► గంట పాటు గోపాలపురంలో..
పెద్దకుమారుడు, డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరికి పార్టీ అధినేత, తండ్రి కరుణానిధిని కలిసేందుకు గోపాలపురంలో అనుమతి లభించింది. గంట పాటు ఆ ఇంట్లో ఉన్న అళగిరి ఉత్సాహంగా వెలుపలకు రావడంతో మీడియా చుట్టుముట్టింది. తలైవర్ నల్లా ఇరుక్కురార్(నాయకుడు బాగున్నారు) అంటూ ఆనందకర వ్యాఖ్యలతో ముందుకు సాగడం విశేషం.
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి వారసులు ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్‌ల మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పరిణామాలు అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించే వరకు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. పార్టీ బహిష్కరణతో కొన్నాళ్లు మదురైకు, మరికొన్నాళ్లు విదేశాలకు పరిమితమైన అళగిరి, రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా ఉండే వారు. గతంలో పలుమార్లు అధినేత, తండ్రి కరుణానిధితో భేటీకి తీవ్రంగా ప్రయత్నించినా, ఆయనకు అనుమతి దక్కలేదని చెప్పవచ్చు.
చివరకు గోపాలపురం ఇంటికి రావడం, తల్లి దయాళుఅమ్మాల్‌తో మాట్లాడడం, తిరిగి వెళ్లడం జరుగుతూ వచ్చింది. అరుుతే, ఇటీవల మాత్రం కొన్ని నిమిషాల పాటు కరుణానిధితో భేటీ అయ్యే అవకాశం అళగిరికి వచ్చింది. అరుుతే, ఆ భేటీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు సంధిం చకుండా, మౌనంగానే గోపాలపురం నుంచి ఆయన వెళ్లి పోయారు. ఈనేపథ్యంలో కొద్ది రోజులుగా కరుణానిధి అలర్జీ కారణంగా ఇంట్లోనే ఉంటూ, చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను చూడడానికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు.అరుుతే, శుక్రవారం ఉదయం అళగిరి గోపాలపురంలో ప్రత్యక్షంకావడం గమనార్హం.
అన్నయ్యకు అనుమతి : ఎప్పుడొచ్చినా, ఒకింత ఆగ్రహంతో గోపాలపురం మెట్లు ఎక్కే అళగిరి, ఈ సారి ఆనందంగా ఇంట్లోకి దూసుకెళ్లడం గమనార్హం. పదకొండు గంటల సమయంలో తన సతీమణి గాంధీతో కలిసి గోపాలపురం చేరుకున్న ఆయన గంట సేపు అక్కడే ఉండడం విశేషం. అర గంట పాటు కరుణానిధితో అళగిరి భేటీ సాగినట్టు, తదుపరి తల్లి, సోదరి సెల్విలతో మాట్లాడి అళగిరి ఆ ఇంట్లో నుంచి ఆనందంగా బయటకు రావడం గమనార్హం. మీడియా చుట్టుముట్టడంతో ఆనందంగా వ్యాఖ్యల్ని వళ్లిస్తూ...తలైవర్ నల్లా ఇరుక్కురార్...నల్లా ఇరుక్కురార్ అంటూ ముందుకు సాగారు.
మదురై తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల ప్రస్తావనను మీడియా తీసుకురాగా, నో కామెంట్ అన్నట్టు మౌనంగా కదిలారు. కాగా, తమ నాయకుడు గోపాలపురం నుంచి ఉత్సాహంగా బయటకు రావడంతో అళగిరి వర్గీయుల్లో ఆనందమే. ఇక, స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో తనతో పాటు చదువుకున్న మిత్రులతో అళగిరి భేటీ అయ్యారు. శని లేదా, ఆదివారం అళగిరి మళ్లీ విదేశాలకు పయనం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు.
అన్నయ్యకు అనుమతి!
Published Sat, Nov 5 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
Advertisement