తలైవర్ బాగున్నారు...: అళగిరి | Alagiri calls on ailing Karunanidhi, says the leader is fine | Sakshi
Sakshi News home page

తలైవర్ బాగున్నారు...: అళగిరి

Nov 4 2016 3:30 PM | Updated on Sep 4 2017 7:11 PM

తలైవర్ బాగున్నారు...: అళగిరి

తలైవర్ బాగున్నారు...: అళగిరి

డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమారుడు, బహిష్కత డీఎంకే నేత అళగిరి తెలిపారు.

చెన్నై : డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమారుడు, బహిష్కత డీఎంకే నేత అళగిరి తెలిపారు. గోపాలపురంలోని నివాసంలో కరుణానిధిని శుక్రవారం అళగిరి కలిశారు. తండ్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తలైవర్ బాగున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు చెప్పారు. కాగా కరుణానిధి ఇటీవలి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అలర్జీ కావడంతో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు విశ్రాంతి సూచించారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న కరుణానిధి సందర్శకులను కలవడం లేదు.

కాగా తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని డీఎంకే అధినేత కరుణానిధి ఇటీవల ఓ తమిళ వారపత్రికకు ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరుణానిధి తర్వాత డీఎంకే ఆధిపత్యం కోసం అళగిరి, స్టాలిన్ మధ్య చాలాకాలంగా పోరు  జరిగిన విషయం విదితమే. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2014లో డీఎంకే నుంచి అళగిరిని  పార్టీ చీఫ్ కరుణానిధి బహిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement