న్యూఢిల్లీ : గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటన రాజ్‌నాథ్ సింగ్‌కు అంత బాధ కలిగిస్తే.. ఆ ట్వీట్‌లో చైనా పేరు ప్రస్తావించకుండా భారత ఆర్మీని ఎందుకు కించపరిచారని ప్రశ్నించారు. ఇలా మొత్తం ఐదు ప్రశ్నలను రాజ్‌నాథ్‌కు సంధించారు. (చదవండి : మన సైనికుల్ని చంపడానికి వారికెంత ధైర్యం..)
1. మీరు ట్వీట్‌లో చైనా పేరు ప్రస్తావించుకుండా భారత ఆర్మీని ఎందుకు కించపరిచారు?
2. సంతాపం తెలుపడానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది?
3. ఓ వైపు సైనికులు అమరలవుతూంటే మరోవైపు ప్రసంగాలు ఎందుకు చేశారు?
4. అనుకూల మీడియాతో ఆర్మీని నిందిస్తూ.. ఎందుకు దాక్కున్నారు?
5. పెయిడ్ మీడియా భారత ప్రభుత్వాన్ని కాకుండా ఆర్మీని ఎందుకు నిందించింది?
అంతకు ముందు రాజ్‌నాథ్ తన ట్వీట్‌లో ‘వారి ప్రాణత్యాగం నన్ను మనోవేదనకు గురి చేసింది. సైనికుల త్యాగాలను, ధైర్యాన్ని దేశం ఎన్నడూ మరిచిపోదు. గాల్వన్ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఇదే నా ప్రగాడ సానుభూతి . క్లిష్ట సమయంలో దేశం అంతా కలిసికట్టుగా ఉంది. భారతీయ బ్రేవ్‌హార్ట్స్ పట్ల గర్వంగా ఉంది. గాల్వన్‌లో సైనికులు చనిపోవడం బాధాకరం. సరిహద్దు విధుల్లో మన సైనికులు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారు. అత్యున్నత స్థాయిలో సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే.(చదవండి : విషం చిమ్మిన చైనా..)
Comments
Please login to add a commentAdd a comment