రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రలు సంధించారు. డోక్లామ్ విషయంలో మౌనంగా ఉంటున్న ప్రధాని.. బహుశా పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారేమోనంటూ ఎద్దేవా చేశారు.
ఈ మేరకు మంగళవారం తన ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ‘డోక్లామ్ నుంచి భారత్ గుణపాఠాలు నేర్చుకుని ఉంటుందని చైనా అంటోంది. గత వారం ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్‌లో 63 శాతం మంది మోదీ తన హగ్‌ప్లోమసీ(మోదీ కౌగిలింతలకు పెట్టిన పేరు)ని ఉపయోగించి కూడా డోక్లామ్ అంశానికి సమస్య చూపలేకపోతున్నారన్నారు. కానీ, మీరనుకునేది చాలా తప్పు. ఇండియా కోసం మన 56 ఇంచుల ఛాతీ(మోదీని ఉద్దేశించి) దగ్గర ఏదైనా పెద్ద ఉపాయమే ఉంటుందని భావిస్తున్నా’ అని రాహుల్ పేర్కొన్నారు.
“India should have learnt lessons from Doklam” says China.
— Rahul Gandhi (@RahulGandhi) 27 March 2018
Last week thousands took my Twitter poll. 63% felt Modi Ji would use hugplomacy, blame RM and cry in public to deal with the Doklam issue!
For India’s sake, I hope you were wrong and our 56 inch strongman has a plan. https://t.co/2BiIisZHkl
కాగా, డోక్లామ్ తమ దేశానికి చెందినదేనని.. గత అనుభవాలతో భారత్ గుణపాఠాలు నేర్చుకుని ఉంటుందని చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కేంద్ర వైఫల్యాన్ని ఎండగడుతూ ట్వీట్ చేశారన్న మాట.
ఇది కూడా చదవండి.. భారత్ తప్పు సరిదిద్దుకో!
Comments
Please login to add a commentAdd a comment