
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
మదనపల్లె: అనైతికంగా ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేసి మంత్రి పదవులిచ్చిన అసమర్థుడిగా చంద్రబాబునాయుడు చరిత్రలో నిలిచిపోతారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మదనపల్లెకు వచ్చిన ఆయన, విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు సంతలో పశువుల్లా, గాడిదల్లా కొనుగోలు చేశారన్న చంద్రబాబు, నేడు ఆంధ్రలో ఏ రకంగా కొనుగోలు చేశారో ప్రజలకు సమా«ధానం చెప్పాలన్నారు. ప్రతిపక్ష నాయకులను తిట్టడం, సభ సజావుగా జరగనీయకుండా అడ్డుకోవడం, ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు చెప్పారు.
నవంబర్ 6న ప్రారంభమమ్యే జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర (ప్రజా సంకల్ప యాత్ర) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని, సమస్యలు తెలుసుకునేలా సాగుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ పాదయాత్రతో టీడీపీకి సంబంధం లేకున్నా విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు మేనిఫెస్టో హామీలు ఎంతమేర నెరవేర్చారో టీడీపీ నాయకులు సమీక్షించుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉదయ్‌కుమార్, మహిళా విభాగం కార్యదర్శి షమీం అస్లాం, చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు భువనేశ్వరి సత్య, దేశాయ్ జయదేవ్, బాలకృష్ణారెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment