PEDDI Reddy Mithun Reddy
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనాధ్ రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు జి వి. రాకేష్ రెడ్డి, ఎం.వెంకట కృష్ణారెడ్డి, వి.ఉమాకాంత్ రెడ్డి, బి.నరేందర్ రెడ్డి, జి.నరేష్కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. చదవండి: (రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోంటాం
-
ప్రతిపక్షాలకు మంత్రి పదవులిచ్చినఅసమర్థుడు బాబు
మదనపల్లె: అనైతికంగా ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేసి మంత్రి పదవులిచ్చిన అసమర్థుడిగా చంద్రబాబునాయుడు చరిత్రలో నిలిచిపోతారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మదనపల్లెకు వచ్చిన ఆయన, విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు సంతలో పశువుల్లా, గాడిదల్లా కొనుగోలు చేశారన్న చంద్రబాబు, నేడు ఆంధ్రలో ఏ రకంగా కొనుగోలు చేశారో ప్రజలకు సమా«ధానం చెప్పాలన్నారు. ప్రతిపక్ష నాయకులను తిట్టడం, సభ సజావుగా జరగనీయకుండా అడ్డుకోవడం, ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు చెప్పారు. నవంబర్ 6న ప్రారంభమమ్యే జగన్మోహన్రెడ్డి పాదయాత్ర (ప్రజా సంకల్ప యాత్ర) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని, సమస్యలు తెలుసుకునేలా సాగుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ పాదయాత్రతో టీడీపీకి సంబంధం లేకున్నా విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు మేనిఫెస్టో హామీలు ఎంతమేర నెరవేర్చారో టీడీపీ నాయకులు సమీక్షించుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉదయ్‌కుమార్, మహిళా విభాగం కార్యదర్శి షమీం అస్లాం, చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు భువనేశ్వరి సత్య, దేశాయ్ జయదేవ్, బాలకృష్ణారెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఆరోపణలు అవాస్తవం
-
ఆ ఆరోపణలు అవాస్తవం: మిథున్‌రెడ్డి
న్యూఢిల్లీ : తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, రాజకీయ దురుద్దేశ్యంతో కూడినవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాఙకీయ ప్రత్యర్ధుల ప్రోద్భలంతో స్థానిక పోలీసులు తప్పడు కేసు పెట్టారని, సీసీటీవీ ఫుటేజీ వివరాలు వెల్లడి చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. విలేకరుల సమావేశం లో ఎంపీలు మేకపాటి రాఙమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బి. రేణుక, వరప్రసాద్ పాల్గొన్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను వివరిస్తూ, ‘నవంబర్ 26 వ తేదీన హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లో తిరుపతి విమాశ్రయంలో దిగాను. మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోమోహన్ రెడ్డి అదే విమానంలో హైద్రాబాద్ వెళుతున్నారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడి విమానాశ్రయం బయటకు వస్తున్నా... అదే సమయం లో మేనేజర్ రాఙశేఖర్ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విమానం ఎక్కనివ్వడం లేదని కొందరు తనకు ఫిర్యాదు చేసారు. సంబంధిత వ్యక్తి కోసం తాను ఎదురు చూశాను. అతను వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆలస్యానికి కారణాలను ప్రశ్నించా. సరైన సమాధానం ఇవ్వడానికి బదులుగా నాతో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు బాధిత యాత్రికులతో పాటు పలువురు ప్రత్యక్ష సాక్ష్యులున్నారు. కొందరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసారు, అయితే కొద్దిసేపటి తర్వాత సంబంధిత అధికారి, తన సీనియర్ అధికారులు, స్థానిక పోలీసుల సమక్షంలొ క్షమాపణ చెప్పారు.’ అని మిథున్ రెడ్డి వివరించారు. ఆ సమస్య అంతటితో ముగిసిందని ఆయన అన్నారు. అయితే తాను మేనేజర్ పై దాడి చేసానని రాత్రి సమయం లో ఫిర్యాదు చేసారని, అది వాస్తవం కాదని స్పష్టం చేసారు. సంఘటన ఙరిగిన సమయం నుంచి రాత్రి వరకూ ఏమి జరిగిందో తనకు తెలియదని మిథున్ రెడ్డి చెప్పారు. తమ వాదనను రుజువు చేయడానికి సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని డిమాండ్ చేసానని, అయితే ఇంతవరకూ వాటిని విడుదల చేయకపోవడాన్ని బట్టి సంఘటన వివరాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్ధుల ప్రోద్భలమే అందుకు కారణమని మిథున్ రెడ్డి చెప్పారు. ఈ విషయం పై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కు ఫిర్యాదు చేసానని, హైకోర్టును ఆశ్రయిస్తానని మిథున్ రెడ్డి తెలిపారు, -
నాగభూషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఎంపీ మిథున్‌రెడ్డి పరామర్శ
- పోలీసులు కఠినంగా వ్యవహరించాలి - మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో సమీక్ష రాయచోటి: తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేత, గాలివీడు మండలానికి చెందిన మాజీ సర్పంచ్ ఆవుల నాగభూషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులను రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పరామర్శించారు. పట్టణంలో ఎస్ఎన్ కాలనీలోని నాగభూషణ్‌రెడ్డి నివాసానికి వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న నాగభూషణ్‌రెడ్డి కుమారుడితో మాట్లాడారు. అలాగే ఇదే దాడిలో గాయపడిన నాగభూషణ్‌రెడ్డి సోదరుడు పుల్లారెడ్డి, ఆయన కుమారుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దాడుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు సలావుద్దీన్, కౌన్సిలర్లు ఫయాజూర్ రెహమాన్, బియంకె రషీద్‌ఖాన్, చిల్లీస్ ఫయాజ్, వైఎస్సార్సీపీ నాయకులు కొలిమి చాన్‌బాషా, యస్పియస్ రిజ్వాన్, ముల్లా హజరత్, కొట్టె చలపతి, జాకీర్, గంగిరెడ్డి, మిట్టపల్లె యదుభూషణ్‌రెడ్డి, గుమ్మా అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో చర్చ మున్సిపల్ ఛైర్పర్సన్ నసిబున్ఖానంతో పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ మిథున్‌రెడ్డి చర్చించారు. శనివారం ఆయన ఛైర్పర్సన్ ఇంటికి వెళ్లి విందులో పాల్గొన్నారు. అనంతరం ఛైర్పర్సన్ భర్త సలావుద్దీన్, పలువురు కౌన్సిలర్లతో ఆయన పట్టణంలోని పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.