
జైపూర్: సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తున్నట్లు రాజస్తాన్ నూతన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ బుధవారం ప్రకటించారు. సీఎంగా ప్రమాణం చేశాక తొలిసారిగా కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో చర్చల తర్వాత గెహ్లోత్ మీడియాతో మాట్లాడారు. ఇతర బ్యాంకుల్లో తీసుకున్న రూ.2లక్షల లోపు రుణాలనూ మాఫీ చేయనున్నారు. దీంతో రాజస్తాన్‌లో మొత్తంగా రూ.18,000 కోట్ల మేర రైతు రుణాలు మాఫీకానున్నాయి. నవంబర్ 30లోపు తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తారు.