టీ.నగర్: జయలలిత డిసెంబరు నాలుగో తేదీ మృతిచెందినట్లు తాను చెప్పలేదని, ఆమె గుండె పనిచేయడం లేదని మాత్రమే చెప్పానని మంత్రి రాజేంద్ర బాలాజీ ప్లేటు ఫిరాయించారు. శివకాశిలో ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో మంత్రి రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ, పేద, సామాన్య ప్రజల ప్రభుత్వంగా అన్నాడీఎం కే పాలన కొనసాగుతోందని, ఎంజీఆర్, జయలలిత అహర్నిశలూ పాటుపడి సంరక్షించిన అన్నాడీఎంకే పార్టీని ఎవరూ నాశనం చేయలేరన్నారు. ఎంజీఆర్ ప్రారంభించిన పార్టీ, ఆయన ప్రవేశపెట్టిన చిహ్నం రెండాకుల గుర్తుపై తాను ఐదుసార్లు పోటీ చేసి గెలు పొందానన్నారు. నాల్గవ తేదీ హార్ట్‌అటాక్‌కు గురికాగా, ఐదో తేదీన జయలలిత మృతిచెందారన్నారు. జయలలిత ప్రజల మనస్సుల్లో జీవిస్తున్నట్లు తెలిపారు.
జాతీయ పార్టీలకు నోటాతో పోటీ–తంబిదురై : జాతీయ పార్టీలు నోటాతో పోటీపడాల్సి ఉంటుందని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై వ్యాఖ్యానించారు. కరూరు 80 అడుగుల రోడ్డులో జిల్లా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఎంజీఆర్ 101 జయంతి వేడుక శనివారం రాత్రి జరిగింది. ఇందులో నగర కార్యదర్శి నెడుంజెళియన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తంబిదురై జాతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలు ఇకపై నోటాతోనే పోటీపడాలని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment