ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా ఆందోళనలు కవర్ చేస్తున్న మీడియాపై ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిషేధాజ్ఞలు విధించారు. రెండురోజులు పాటు ఇంటర్వ్యూలు చేయొద్దని అనధికారికంగా హుకుం జారీ చేశారు. ఆందోళనలు ప్రసారం చేసేందుకు ప్రయత్నించిన సాక్షి టీవీ విలేకరులను కూడా పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ భవన్‌లో ఇంటర్వ్యూలు చేయొద్దని, ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
దీంతో లిఖిత పూర్వక ఉత్తర్వులు చూపాలని అమర్‌నాథ్ కోరగా.. రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడుకోవాలని దురుసుగా ప్రవర్తించారు. ఏదేమైనా ఏపీ భవన్ నుంచి బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు తీవ్రతరం చేస్తుండటంతో ఎక్కడ తమకు చెడ్డ పేరొస్తుందనే ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వమే కావాలని ఏపీ భవన్‌లో మీడియాపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. సోమవారం సంసద్ మార్గ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా నిర్వహించనున్న నేపధ్యంలో కావాలనే ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించిందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment