
పట్నా : బీహార్‌లో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) బుధవారం ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో బిస్కోమోన్ చైర్మన్ సునీల్ సింగ్, బీఎన్ కాలేజీ ప్రొఫెసర్ రామ్ బాలి చంద్రవన్షీ, ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఫరూఖ్ షేక్‌లు ఉన్నారు.అంతకుముందు మంగళవారం వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలతో పాటు ఆర్జేడీకి చెందిన రాధా చరణ్ షా, సంజయ్ ప్రసాద్, దిలీప్ రాయ్, ఎండి కమర్ ఆలమ్, రణ్‌విజయ్ కుమార్ సింగ్‌లు పార్టీకి రాజీనామా చేసి జేడీయులో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకేత్తించింది. మరోవైపు జేడీయూ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గులామ్ కౌస్, కుముద్ వర్మ, బీష్మ్ సాహ్నిలను ఎంపిక చేశారు. బీహార్ శాసనడమండలిలో మొత్తం 75 సీట్లు ఉండగా అందులో 63 ఎన్నికల ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 12 నామినేటెడ్ పదవులుగా ఉన్నాయి. జూలై 6న బీహార్‌లోని తొమ్మిది శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.(ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు)