‘ఆవు మూత్రంతో క్యాన్సర్‌ నయమైంది’ | Sadhvi Pragya Says Cow Urine Cured My Breast Cancer  | Sakshi
Sakshi News home page

ఆవు మూత్రంతో క్యాన్సర్‌ నయమైంది: సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ 

Published Tue, Apr 23 2019 9:20 AM | Last Updated on Tue, Apr 23 2019 9:30 AM

Sadhvi Pragya Says Cow Urine Cured My Breast Cancer  - Sakshi

భోపాల్‌ : ఆవు పాల పదార్థాలతో పాటు ఆవు మూత్రం సేవించడం వల్ల తనకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నయమైందని భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. భోపాల్‌ లోక్‌సభకు సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన ఆమె ఓ జాతీయ చానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశంలో ఆవుల పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు.  ఆవు మూత్రం అమృతమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆవుతో, ఆవుకు సంబంధించిన పదార్థలతో ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు ఆవు మూత్రం, ఆవు పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయని, తన బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. ఆవు మూత్రంతోనే నయమైందన్నారు.

ఆవుకు సంబంధించిన ఐదు పదార్థాలు (ఆవు పేడ, పాలు, మూత్రం, నెయ్యి, పెరుగు)తో తయారు చేసే పంచగవ్యతో చాలా లాభాలున్నాయన్నారు. దీనికి తానే ఓ ఉదాహరణని చెప్పుకొచ్చారు. సరైన పద్దతిలో ఆవును మర్థన చేస్తే బీపీ అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. గోమాత వెనుక నుంచి మెడల వరకు మర్థన చేస్తే ఆవు సంతోషంగా ఉండటమే కాకుండా.. రోజు చేస్తే మన బీపీ కంట్రోల్‌లో ఉంటుందని చెప్పుకొచ్చారు. తపస్సు చేసుకోవడానికి గోశాలను మించిన మరో ప్రదేశం లేదన్నారు. వేదమంత్రాల మధ్య ఆమె సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మాలేగావ్‌ పేలుడు కేసులో నిందితురాలైన ఆమె కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌కు పోటీగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజ్ఞా సింగ్‌ ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement