
సాక్షి, ఏలూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఏలూరులోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఎమ్మెల్సీగా, డీసీసీబీ చైర్మన్‌గా బాలసుబ్బారావు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు సేవలందించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు సన్నిహితులుగా కొనసాగారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment