
సాక్షి, అమరావతి: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎక్కువే సాయం చేసిందని, అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చిందని, సంతృప్తిగా ఉన్నామని గతంలో పలుసార్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారన్నారు.
కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా టీడీపీ అడ్డుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.