చౌటుప్పల్/మునుగోడు/చండూరు: నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంపై బీసీ జెండా ఎగురవేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకుల ఆధ్వర్యంలో చౌటుప్పల్ నుంచి సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు మీదుగా చండూరు వరకు బహుజనుల బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ మునుగోడులో త్వరలో లక్ష మందితో బహుజనుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మునుగోడులో బీసీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీలో తమ వాణిని వినిపిస్తామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు బహుజనులకు రాష్ట్ర వ్యాప్తంగా 60 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9 స్థానాలు ఇస్తేనే ఆ పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. లేదంటే అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి బీసీ అభ్యర్థులను బరిలో నిలిపి సత్తా చాటుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment