గుంటూరు జిల్లా నల్లపాడులో సోమవారం అశేష జనవాహిని మధ్య పాదయాత్ర కొనసాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : హోదా సమర హోరును పెంచిన విపక్ష నేత వైఎస్ జగన్‌కు సోమవారం ప్రజా సంకల్పయాత్రలో జనం నీరాజనాలు పట్టారు. వేలమంది జననేత అడుగులో అడుగేస్తూ ‘ప్రత్యేక హోదా– ఆంధ్రుల హక్కు’ అని నినదించారు. సమరాంగణానికి సై అంటూ మద్దతు పలికారు. పోరుబాటకు సిద్ధమంటూ యువ కెరటాలు గొంతు కలి పాయి. ఉవ్వెత్తున ఉద్యమించి హోదా కోసం ఎందాకైనా పోరాటానికి ముందుంటామని విద్యార్థి లోకం భరోసా ఇచ్చింది. విజయబా వుటా ఎగరేయాలంటూ మహిళలు హారతులు పట్టారు. సంకల్పం సిద్ధించాలని వేద పండి తులు ఆశీర్వదించారు. సోమవారం 126వ రోజు ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో పూర్తి చేసుకుని ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవ ర్గాల్లో కొనసాగింది. వెంగళాయపాలెం క్రాస్, నల్లపాడు, చల్లపాడు గ్రామాల మీదుగా సాగిన యాత్రకు జనం భారీగా తరలివచ్చారు. రోజూ మాదిరే వినతులతో పాటు, హోదా వేడి స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి, ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షకు దిగుతారని జగన్ చేసిన సంచలన ప్రకటనను స్వాగతించేందుకు జనం పోటీ పడ్డారు. మద్దతుగా నిలవాలని ఆయన ఇచ్చిన పిలుపునకు పాదయాత్ర సాక్షిగా ప్రజలు స్పందించడం కనిపించింది.
పోరాడే వీరుడా... అందుకో హారతి
‘చంద్రబాబు ఢిల్లీ నడి వీధిలో మా హోదాను తాకట్టు పెట్టాడు. హోదా పోరు సమాధి కాకుండా సజీవంగా ఉంచింది జగనన్నే. ఇప్పుడాయన ఢిల్లీకి వినిపించేలా ఉద్యమిస్తున్నాడు. అందుకే హారతులు పడుతున్నాం’ అని కరివేటి గంగ, ఉలిగమ్మ, లక్ష్మి అనే మహిళలు అన్నారు. పేరేచర్ల ఆరవ మైలురాయి దగ్గర వారు జగన్‌కు మంగళహారతులు పట్టారు. ‘అనుకున్నది అన్న సాధించాలని కోరుకున్నాం’ అని లక్ష్మి ఉద్వేగంగా చెప్పింది. ఇలాంటి సన్నివేశాలే అడుగడుగునా కనిపించాయి. పలువురు మహిళలు గుమ్మడికాయలతో ఎదురొచ్చి.. ఎర్రనీళ్లతో దిష్టి తీశారు. జగనన్న వల్లే హోదా పోరు మళ్లీ రగులుకుందని ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం కనిపించింది.
సంకల్పం సిద్ధించాలి.. వేద పండితుల దీవెనలు
‘పోరుబాటే మార్గంగా ప్రజా క్షేత్రంలో దూసుకెళ్తున్న జననేతకు దైవ కృప తోడుకావాలని మనసారా ఆశీర్వదించాం’ అని వేదపండితుడు తుర్లపాటి పవన్‌కుమార్ శర్మ, వేదాంతం కృష్ణమా చార్యులు అన్నారు. నల్లపాడు వద్ద వారు త్రివేణి సంగమ జలాలతో జగన్‌ను దీవించారు. వేద మంత్రోచ్ఛారణ లతో ఆశీర్వదించారు. సంకల్పానికి అడ్డంకులు లేకుండా చూడాలని దేవుడిని ప్రార్థించినట్టు చెప్పారు. విభజనతో ఒంటరైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి చేయూత కల్పిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. పండితులు దీవించే క్రమంలో వెన్నంటిన ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వా నాలు చేశారు. ‘ఉద్యమ సారథి జగన్.. రావాలి జగన్.. తేవాలి హోదా’ అంటూ నినదించారు. నల్లపాడు గ్రామానికే చెందిన బారెడ్డి బాలమ్మ అనే మహిళ.. జగన్ సీఎం కావాలంటూ ప్లకార్డును ప్రదర్శిస్తూ ఆకర్షణగా నిలిచారు. ‘హోదానే కావాలి... ప్యాకేజీ మాకొద్దు’ అంటూ సేవాదళ్ మహిళా కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యువత జగన్‌కు స్వాగతం పలికింది. హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరామ్‌నగర్ కాలనీల్లో యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు.
ఉప్పెనై లేస్తాం.. ఉద్యమానికి మద్దతిస్తాం
‘అన్న ఇచ్చిన పిలుపు విద్యార్థుల బాధ్యతను గుర్తు చేసింది. హోదా వచ్చేదాకా నిద్రపోం. అన్నకు తోడుగా ఉంటాం’ అని శ్రీరామ్‌నగర్ వద్ద బీటెక్ విద్యార్థిని లయ ఆవేశంతో చెప్పింది. దాదాపు వంద మంది విద్యార్థులు జగన్ పాదయాత్రలో నడిచారు. ఎంపీల ఆమరణ దీక్షకు విద్యార్థులు కదిలిరావాలన్న పిలుపును వాళ్లంతా స్వాగతించారు. ఢిల్లీని కదిలించి మన హక్కు సాధించాలన్న జగన్ స్ఫూర్తి విద్యార్థి లోకాన్ని నిద్ర లేపిందని డిగ్రీ చదువుతున్న అప్పిరెడ్డి తెలిపారు. హోదా రాకుంటే భవిష్యత్తు బాగుండదనే ఆందోళన విద్యార్థుల్లో ఉందని, జగన్ ప్రసంగాల ద్వారా ఈ విషయమై అవగాహన పెరిగిందన్నారు. యువభేరీ పెట్టినప్పుడు జగన్‌తో కలసి ఉద్యమించామని, ఆ సమయంలో చంద్రబాబు పీడీ యాక్ట్ కింద కేసులు పెడతానని బెదిరించారని, ఇప్పుడు తామే కాదు.. రాష్ట్రంలో ఏ విద్యార్థీ భయపడే పరిస్థితి లేదని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment